ఈ 3 రాశులవారు నిస్వార్థమైన ప్రేమికులు మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడంలో ఒక్కొక్కరిదీ ఓక్కో పద్ధతి..ఇందులో టాప్ 3 లో ఉండే రాశులేంటంటే... 12 రాశులలో అత్యంత ప్రేమగల రాశి తులా రాశి. వీరెప్పుడూ తమకన్నా భాగస్వామి అవసరాలకే తొలి ప్రాధాన్యతనిస్తారు. ప్రేమ బంధాలకు అత్యంత ప్రయార్టీ ఇస్తారు. తులారాశివారు తమ ప్రియమైనవారు సంతోషంగా ఉండేందుకు చేయగలిగినదంతా చేస్తారు. అందుకే ప్రేమను వ్యక్తం చేయడంలో ఈ రాశివారిదే టాప్ ప్లేస్.. ప్రేమను వ్యక్తం చేయడంలో కర్కాటక రాశివారిది రెండో ప్లేస్...వీరు ప్రేమకు కట్టుబడి ఉంటారు. భాగస్వామి భావోద్వేగాలకు అనుగుణంగా వ్యవహరిస్తారు. . వారిపై ఎంత ప్రేమ ఉందో చూపించేందుకు కర్కాటక రాశివారు తాపత్రయపడతారు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటే వారితో జీవితం అత్యంత సంతోషంగా ఉంటుంది. ప్రేమను వ్యక్తం చేయడంలో మీన రాశివారు టాప్ 3 లో ఉన్నారు. బంధాల విషయంలో సున్నితంగా, శ్రద్ధగా వ్యవహరిస్తారు. మీన రాశివారు తమ జీవిత, ప్రేమ భాగస్వాముల భావాలను, అవసరాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. మీన రాశివారు ప్రేమ, ఆప్యాయత చూపించేందుకు సమయం వెచ్చిస్తారు. తమ ప్రేమలో నిస్వార్థంగా ఉంటారు. Images Credit: Pixabay