Guppedantha Manasu September 17th Update: రిషిలో ఈగోని నిద్రలేపిన దేవయాని, ఈ బంధం ఇంతేనా అని వసుధార కన్నీళ్లు!
Guppedantha Manasu September 17th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు( శనివారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu September 17 Today Episode 558)
కాలేజీ రోజులు పరీక్షలు ముగియడంతో రిషి-వసుధారలు తమ మనసులో మాట బయటపెట్టి రిషిధారగా మారారు. కొన్ని రోజులుగా వీళ్లిద్దరి ముచ్చటే నడిచింది. ప్రేమలో మునిగితేలారు..ఎపిసోడ్ మొత్తం ప్రేమ మయం చేశారు. ఇక పెళ్లే తరువాయి అనుకున్న సమయంలో రిషి..మళ్లీ దేవయాని వలకు చిక్కాడు. గురుదక్షిణ అన్న ఒక్కమాటని వినియోగించుకుని దేవయాని అందరికీ షాకిచ్చింది. ఎప్పటిలా రిషి ఆవేశం..జగతి ఆవేదన..మహేంద్ర మాట్లాడలేని పరిస్థితి..వసు కన్నీళ్లు.. చూస్తుండిపోయిన ఫణీంద్ర, ధరణి, గౌతమ్. ఎటువాళ్లు అటు వెళ్లిపోతారు.. ఇటు వసుధార-అటు రిషి ఎవరి రూమ్స్ లో వాళ్లు జరిగినదంతా తెలుసుకుని బాధపడుతుంటారు.
వసుధార దగ్గరకు వెళ్లిన దేవయాని అప్పటి తన నిజస్వరూపం బయటపెడుతుంది.ఇకపై రిషి దృష్టిలో నువ్వు మోసగత్తెవు మాత్రమే అని పైశాచిన ఆనందం పొందుతుంది..స్పందించిన వసుధార...ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా మీ నిజస్వరూపం రిషి సార్ తెలుసుకుంటారని కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది.. మరోవైపు ఒంటరిగా ఆలోచిస్తున్న రిషి దగ్గరకు వెళతాడు మహేంద్ర. ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించినా రిషి అస్సలు వినడు..మా ఇద్దరి మధ్యా ప్రేమ మాత్రమే ఉందనుకున్నాను కానీ మీతో గురుదక్షిణ ఒప్పందం కూడా ఉందని ఇప్పుడే తెలిసిందంటాడు..ఏం చెప్పాలో అర్థంకాక మహేంద్ర చూస్తూండిపోతాడు. శనివారం రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్ ప్రోమో ఇక్కడ చూడొచ్చు...
Guppedantha Manasu - Promo | 17th Sep 2022 | #StarMaaSerials #GuppedanthaManasu Mon to Sat at 7.00 pm #StarMaa. pic.twitter.com/E1O8yMMqGa
— starmaa (@StarMaa) September 17, 2022
Also Read: బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత,దీప చేతిరాత గుర్తుపట్టిన శౌర్య - వంటలక్క ఏం చేయబోతోంది!
జరిగిన కథ
రిషి..వసుధారకి దగ్గరవడం..అటు జగతి-మహేంద్ర సంతోషంగా ఉండడం చూసి రగిలిపోతుంది దేవయాని. ఇంతలో రిషి వచ్చి పెద్దమ్మా ఈ సంతోషం అంతా మీ వల్లే మీరు భోజనం చేయండని చెబుతాడు. ఇదంతా నా వల్ల కాదు వసుధార వల్లే అయిందని పొడుగుతూనే వసుని రిషి ముందు బుక్ చేస్తుంది దేవయాని. రిషితో జగతిని అమ్మా అని అని పిలిపిస్తానని మహేంద్రకి వసుధార ఇచ్చిన మాటని బయటపెట్టేస్తుంది దేవయాని. ఇదంతా విని రిషి షాక్ అవుతాడు. ఇప్పుడెందుకు ఇదంతా అని ఎంతమంది వారించినా దేవయాని అస్సలు తగ్గదు. రిషిపై వసుధారకి ఉన్నది ప్రేమకాదని.. కేవలం జగతికి దగ్గరచేయడానికే ఇదంతా చేసిందనిపించేలా రిషి మనసులో క్రియేట్ చేస్తుంది.
దేవయాని: ఎలా ఉండే రిషిని ఎలా మార్చింది.. జగతి పుట్టినరోజు జరిపించింది,ఈ రోజు పెళ్లిరోజు కూడా జరిపించింది.రేపు అమ్మ అని కూడా పిలిపిస్తుంది. ఇంతకన్నా మంచి కోడలు దొరకదు కాబట్టి..వసుధార వాళ్ల అమ్మా నాన్నతో మాట్లాడుదాం జగతి. రిషి ఎప్పుడైతే నిన్ను అమ్మా అని పిలుస్తాడో అప్పుడు వెంటనే వెళ్లి వాళ్ల అమ్మా నాన్నతో మాట్లాడి వసుధారని ఇంటి కోడలిగా తెచ్చేసుకుందాం అంటుంది. అప్పటి వరకూ కోపంతో తనలో తానే రగిలిపోయిన రిషి...ఇక ఆపండి పెద్దమ్మా అనిఅరుస్తాడు. ఒక్కసారి నామాట వినండి సార్ అని వసుధార ఎంత చెప్పినా వినకుండా వెళ్లిపోతాడు..
Also Read: అడ్డుతప్పుకో వసుధార అని రిషి ఆగ్రహం, జగతి-మహేంద్ర పెళ్లిరోజు వేడుకలో ఏం జరిగింది!
దేవయాని ఇచ్చిన ఈ షాక్ నుంచి అక్కడున్నవారంతా చూస్తూ నిలబడిఉండిపోతారు. మహీంద్రా కోపంతో చేతులెత్తి దండం పెట్టి, మీరు మా కన్నా పెద్దవారు, మీరేం చేసినా మేము సైలెంట్ గా ఉంటాము. మా హద్దులు దాటము కానీ కొన్ని కొన్ని సార్లు మీరు చేసినవి కూడా మంచే అయింది. ఏమో, రిషి జగతిని అమ్మ అని పిలిచే రోజు కూడా వస్తుందేమో అని అంటే...అదే జరగాలని కోరుకుందాం మహేంద్ర. నేను అదే కోరుకుంటాను అని అంటుంది దేవయాని. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నావా జగతి... మీరిద్దరూ రూమ్ లో మాట్లాడుకున్నప్పుడు విన్నానని క్లారిటీ ఇస్తుంది దేవయాని. ( పెళ్లిరోజు వేడుకకోసం తయారైన తర్వాత జగతితో మహేంద్ర ఈ విషయాలన్నీ చెబుతాడు..వాటిని వీడియో తీస్తుంది దేవయాని). మొత్తానికి నిన్నటి వరకూ ప్రేమమయంగా మారిన సీరియల్లో మళ్లీ ఇప్పుడు కుట్రలు మొదలయ్యాయి.... శనివారం ఎపిసోడ్ ప్రోమో పైన చూడొచ్చు...