Guppedantha Manasu March 4th: వసుని ఇంటి కోడలిగా అడుగుపెట్టనిచ్చేది లేదన్న దేవయాని- క్షమాపణలు చెప్పిన రిషి
Guppedantha Manasu March 4th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
అందరి ముందు వసుధారని భార్య అని ఎలా అంటాడని దేవయాని చిర్రుబుర్రులాడుతుంటే రిషి వస్తాడు. మీ పెద్దమ్మకి కోపం వచ్చింది ప్రసన్నం చేసుకోమని ఫణీంద్ర అంటాడు.
రిషి: నేను అన్న మాటలు మీకు కోపం బాధ తెప్పిస్తాయని నాకు తెలుసు
దేవయాని: తెలిసి ఎందుకు అలా చేశావ్
రిషి: మీ కోపంలో అర్థం ఉంది అలా మాట్లాడటం నచ్చకపోవచ్చు మిమ్మల్ని బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను అలా అనడానికి కారణాలు ఉన్నాయి. అవి ఇప్పుడు చెప్పలేను కావాలంటే జగతి మేడమ్ ని అడగండి
Also Read: ఐపీఎస్ అయిపోయిన జానకి, పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తున్న కుటుంబం- మల్లిక కల నిజమయ్యేనా
దేవయాని: నువ్వు అలా అనడం కరెక్ట్ కాదు నా చేతుల్లో పెరిగిన రిషి నా ముందు అలా మాట్లాడటం బాధేసింది
రిషి: నేను ఎప్పటికీ మీ రిషినే మీ పెంపకంలోనే పెరిగాను
దేవయాని: రిషి ఇంకా నా ఆధీనంలోనే ఉన్నాడన్న మాట అని మనసులో అనుకుని పైకి మాత్రం నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుండేది. నా మాటలతో నిన్ను బాధపెట్టి ఉంటే సారి
రిషి: పెద్దమ్మా మీరు నాకు సారి చెప్పడం ఏంటి
దేవయాని: నిన్ను ఎప్పుడు బాధపెట్టను ఏది ఏమైనా రిషి నా రిషినే
రిషి అన్న మాటలు వసు జగతికి చెప్తుంది. నలుగురిలో భర్త అని ఒప్పుకున్న సర్ నాలుగు గోడల మధ్య మాత్రం మాట మార్చేశారు తన భార్యని కాదని అన్నారని వసు బాధపడుతుంది.
వసు: ప్రపంచానికి మేం భార్యాభర్తలం బంధానికి కాదా. ఎందుకు ఇంతగా శిక్షిస్తున్నారు, ఆయన కోపం ఏంటో ప్రేమ ఏంటో సరిగా అర్థం చేసుకోలేకపోయానేమో. మీకు తెలియకుండానే మీరు రిషి సర్ ని వెనకేసుకొస్తున్నారు
జగతి: అందరి ముందు ఒప్పుకున్న రిషి బంధాన్ని ఎందుకు వద్దని అంటాడు. తన మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేయాలి కదా. నేను ఈ సమస్యని పరిష్కరిస్తాను
వసు: వద్దు చాడీలు చెప్పినట్టు అవుతుంది మేమే పరిష్కరించుకుంటాం, మా ఎండీని ఏమి అనొద్దు
Also Read: లాస్య కుట్ర తెలిసి తులసి ఉగ్రరూపం- లిమిట్స్ లో ఉండమంటూ దివ్య స్ట్రాంగ్ వార్నింగ్
రిషి వసు మాటలు గుర్తు చేసుకుంటూ నువ్వు చేసిన తప్పుని నేను సరిదిద్దానని అనుకుంటాడు. అటు వసు కూడా ఇదే ఆలోచిస్తూ నలుగురిలో నన్ను బతికించి నాలుగు గోడల మధ్య చంపేశారని బాధపడుతుంది. అందరికీ నువ్వు ఒక టాపిక్ కాకూడదని చేశాను కానీ తర్వాత చెప్పిన విషయం నీకు చేదుగా అనిపించింది. ఒకవైపు ఆలోచిస్తున్నావ్ మెడలో తాళి వేసుకోవడం తప్పని రిషి అంటాడు. మిమ్మల్ని కాపాడుకోవడం కోసమే కదా ఇలా చేసింది మీరే శిక్షిస్తే ఎవరికి చెప్పుకోవాలని వసు కన్నీళ్ళు పెట్టుకుంటుంది.
కొత్త కోడలు గృహప్రవేశం ఎప్పుడు చేస్తుందని దేవయాని వెటకారంగా జగతిని అడుగుతుంది. ఆ ఘడియలు వస్తే అవే జరుగుతాయని అంటుంది. అందరి ముందు వసుధార పెళ్ళాం అని చెప్పినంత తేలిక కాదు ఈ ఇంటికి రావడమని దేవయాని మనసులో అనుకుంటుంది. వసు గురించి మాట్లాడొచ్చా అని జగతి రిషిని అడుగుతుంది. ప్రతిదీ నా అనుమతితోనే మాట్లాడుతున్నారా అని రిషి ప్రశ్నిస్తాడు. కొన్ని నీ అనుమతి లేకుండా జరిగాయి వసుని ప్రేమిస్తున్న విషయం నీ అనుమతి లేకుండానే చెప్పాను. నిన్ను అడిగి నీ అనుమతి తీసుకోకుండా ఆ తాళిబొట్టు నీతో పంపలేదు. నిజానికి అందులో ఏముందో కూడా నీకు చెప్పలేదు చూడలేదు. నీ అనుమతి లేకుండానే నీ పేరు చెప్పాను. వసు ఆవేశంలో తనకి తోచింది చేసిందని జగతి అంటుంది.