News
News
X

Guppedantha Manasu జులై 20 ఎపిసోడ్: ఎట్టకేలకు రిషికి 'ఐ లవ్ యూ' చెప్పేసిన వసుధార, సాక్షిని ఆడేసుకున్న గౌతమ్

Guppedantha Manasu July 20 Episode 507:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 20 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంతమనసు జులై 20 బుధవారం ఎపిసోడ్ (Guppedantha Manasu  July 20 Episode 507)

తనిచ్చిన డ్రెస్ వేసుకున్న వసుని చూసి మురిసిపోతుంటాడు రిషి. ఇంతలో అక్కడకు జగతి-మహేంద్ర రావడం చూసి మాట మార్చేస్తాడు. అక్కడి నుంచి నెమ్మదిగా జారుకుంటారు రిషి-వసు
మహేంద్ర: మనం రాగానే ఇద్దరూ వెళ్లిపోయారు..నేను అలిగాను జగతి
జగతి: నేను ఏం చేశాను
మహేంద్ర: వాళ్ల పరిచయం ఏమాత్రం చెప్పు..అప్పుడే ఇన్ని గిఫ్టులు ఇచ్చుకుంటున్నారు నువ్వెప్పుడైనా ఇచ్చావా
జగతి: ఆ మాట నేనుకదా అడగాలి...
మహేంద్ర: మీటింగ్ కి టైమ్ అయింది పద 
రిషి తన క్యాబిన్ కి వెళ్లిపోతూ క్లాస్ రూమ్ లో చూస్తాడు..బోర్డుపై వసు వేసిన నెమలి కన్ను కనిపిస్తుంది. అది చూసి వెనక్కు తిరిగి వెళ్లిపోతూ.. ఒక్కసారి ఆగి ( గతంలో రెస్టారెంట్ లో వసుకి తాను నెమలి కన్ను ఇచ్చిన విషయం గుర్తుచేసుకుంటాడు). ఓ సెల్ఫీ దిగుదాం సార్ అన్న వసు మాటలు గుర్తొచ్చి..రిషి అక్కడ సెల్ఫీ దిగుతాడు. క్లాస్ రూమ్ లోంచి బయటకు వచ్చి తన క్యాబిన్ కి వెళ్లిపోతుండగా ఎదురుపడుతుంది సాక్షి.
సాక్షి: నీతో మాట్లాడాలి రిషి..ఇది నా పర్సనల్ విషయం..నిన్ను ఇబ్బంది పెట్టేది కాదు చిన్న రిక్వెస్ట్ అంతే.. నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి
రిషి: సడెన్ గా ఇదేంటి..
సాక్షి: నా బర్త్ డే అని అబద్ధం చెప్పడం లేదు..భోజనానికి రమ్మంటున్నాను అంతేకదా. నేనుజీవితంలో ఓడిపోయానో నాకు ఇంతే రాసిపెట్టి ఉందో తెలియదుకానీ నీ జీవితంలో ఫ్రెండ్ గా ఉండలేనా..నేను పబ్ కి రమ్మనడం లేదు కదా పద్ధతిగా ఇంటికి భోజనానికి రమ్మంటున్నాను. జీవితంలో చాలా అలసిపోయాను..నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నావ్.. ఈ ఒంటరితనం ఏదేదో ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయ్.. ( చావు అంచుల వరకూ వెళ్లొచ్చిందన్న దేవయాని మాటలు గుర్తుచేసుకుంటాడు రిషి) స్వయంగా నాచేత్తో వండి పెడతాను అంటుంది.
ఇదంతా విన్న వసుధార...ఒప్పుకోవద్దు సార్ అనుకుంటూ..రిషి సార్ ఒప్పుకోరు అనుకుంటుంది..
రిషి: సరే సాక్షి అంటాడు 
సాక్షి ఆనందానికి అవధులుండవు....

Also Read: నిరుపమ్-శౌర్యని దగ్గర చేసేందుకు ప్రేమ్ ప్లాన్, పెళ్లి ఆపే ప్రయత్నంలో స్వప్న-శోభ

రిషి భోజనానికి వస్తున్నాడంటే సగం నువ్వు సక్సెస్ అయినట్టే.. రిషి మనసు మార్చాలి తన మనసులో చోటు సంపాదించుకోవాలి సాక్షి ఇది నీకు గోల్డెన్ అవకాశం. నాటాలెంట్ మొత్తం రిషి ముందు చూపిస్తాను అనుకుంటూ దేవయానికి కాల్ చేసి మీకో గుడ్ న్యూస్ అని చెబుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది...డోర్ తీసిన సాక్షి..ఎదురుగా రిషి ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది. నా గెటప్ కి రిషి షాక్ అయ్యాడేమో అనుకుంటుంది.. వెల్ కమ్ అంటుంది...
రిషి: వెల్ కమ్ నా ఒక్కడికే కాదు సాక్షి అంటాడు
ఇంతలో హాయ్ అంటూ గౌతమ్, జగతి, మహేంద్ర..నేను లేకుండా ఎలా ఉంటానంటూ వసుధార వరుసగా ఎంట్రీ ఇస్తారు..
గౌతమ్: షాకయ్యారా...
జగతి: ఆశ్చర్యపోతోంది
మహేంద్ర: ఒక్కర్ని పిలిస్తే ఇంతమంది వచ్చారేంటి అనుకుంటోంది
రిషి: చదువుల పండుగ మీటింగ్ ఉంది..భోజనం చేస్తూ ఇక్కడే డిస్కస్ చేసుకుందాం అని అందర్నీ రమ్మన్నాను అంటాడు
గౌతమ్: చెప్పకుండా అందరం వచ్చేశాం భోజనానికి ఇబ్బంది కదా
రిషి: సాక్షి ఆల్ రౌండర్..గబగబా చేసేస్తుంది 
హలో సాక్షి గారూ మీ ఇంటికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు అంటూ వసుధార లోపలకు ఎంట్రీ ఇస్తుంది..
గౌతమ్: సాక్షి గారు కిచెన్ ఎక్కడుంది..మీరేం వంటలు చేశారో చూడాలని ఆత్రంగా ఉంది..
సాక్షి: నేను రిషిని పిలిస్తే అందరూ వచ్చారేంటి..నేను ఇద్దరికే ఆర్డర్ ఇచ్చాను..ఆర్డర్ కన్నా ముందే రిషి వచ్చాడు అనుకుంటుంది

Also Read:  మనసు తెలుసుకోండి సార్ అని మళ్లీ క్లారిటీ ఇచ్చిన వసు, సాక్షికి పెద్ద షాక్ ఇచ్చిన రిషి అండ్ కో!

గౌతమ్: సరాదాగా మనం ఓ పందెం పెట్టుకుందామా...సాక్షి ఏం వంటలు చేసిందో గెస్ చేస్తాను నువ్వు కూడా గెస్ చేయి వసుధార
వసు: సాక్షి గారిని తక్కువ అంచనా వేశారా..లండన్ నుంచి వచ్చారు..లండన్ నుంచి వచ్చిన వారు మనకు సౌత్ ఇండియా,నార్త్ ఇండియా ఫుడ్ పెడతారా ఇంకా చాలా ఉంటాయి కదా సార్...మనకు ఈ రోజు ఇంటర్నేషనల్ రేంజ్ లో మెనూ ఉంటుంది మీరు అస్సలు డిస్సప్పాయింట్ కారు.. కదా సాక్షి గారూ..
మహేంద్ర: నేను భోజన ప్రియుడిని కానీ ఈ మధ్య డైట్ లో ఉన్నాను
జగతి: నువ్వేం ఇబ్బంది పడకు..ఉన్నదాంట్లో సర్దుకుందాం లే...
రిషి: సాక్షి టెన్షన్ పడుతున్నావేంటి..
సాక్షి: టెన్షన్ కాదు
గౌతమ్: టెన్షన్ కి ఆనందానికి నీకు తేడా తెలియదురా..ఒకేసారి అన్ని పండుగలు కలిసొస్తే ఎలా ఉంటుందో ఆ ఆనందాన్ని నేను సాక్షి ముఖంలో చూస్తున్నాను..
రిషి: చదువుల పండుగ గురించి డిస్కషన్ అయ్యాక భోజనం చేద్దాం..
గౌతమ్: భోజనం చేస్తూ మాట్లాడితే బావుంటుంది కదా
మహేంద్ర: బాబూ గౌతమ్ ఈ ఐడియా బావుంది ఫిక్స్ చేసెయ్..
ఇంతలో కాలింగ్ బెల్ మోగుతుంది..సాక్షి టెన్షన్ పడుతుంది..అరేయ్ గౌతమ్ నువ్వెళ్లరా అని పంపిస్తాడు రిషి...
ఫుడ్ డెలివరీ సార్ అని ఇచ్చేసి వెళ్లిపోతాడు... అది తీసుకొచ్చిన గౌతమ్.. రేయ్ ఈ రెస్టారెంట్ లో ఫుడ్ బావుంటుందిరా నాకు తెలుసు అంటాడు గౌతమ్..
మహేంద్ర: సాక్షి నువ్వు వంట చేయేలేదా
రిషి: సాక్షి నీకు వంట చేయడం రాదా
జగతి: ఎవరినైనా ఇన్వైట్ చేసినప్పుడు మనం వండిపెట్టాలి కదా
గౌతమ్: ఈ ఫుడ్ నా ఒక్కడికే సరిపోదు మరి మీ అందరికీ ఎలా.. ఏముందిలే సాక్షిగారు మీ అందరికీ క్షణాల్లో వంట చేసి పెడతారు
రిషి: ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నావేంటి..
సాక్షి: అసలు వంటలే రావంటే ఇదేంట్రా బాబు అనుకుంటూ ఇబ్బందేం లేదంటుంది
రిషి: మరి ఆర్డర్ ఎందుకు పెట్టావ్..వంటలు రావా
వసు: వంటరాకపోవడం ప్రాబ్లెమ్ కాదు పెద్ద విషయం కాదు..మేం అందరం వస్తామని నువ్వు అనుకోలేదు కదా .. నేనున్నాను కదా క్షణాల్లో వంట చేసేస్తాను. సాక్షి గారు ఇంట్లో ఏం ఉన్నాయ్..
సాక్షి: ఇంట్లో ఏం ఉన్నాయో లేవో తెలియదు..
గౌతమ్: అన్నీ ఉంటే ఎవరైనా వంట చేస్తారు..ఏమీ లేకుండా వంట చేయడమే గొప్ప 
వసు: నేను కిచెన్లోకి వెళ్లొస్తాను..పావుగంట టైమ్ ఇవ్వండి..
రిషి: నువ్వేం ఫీలవకు సాక్షి కూర్చో...
సాక్షి: కిచెన్లో ఏమీ లేవు..వంట చేస్తుందట వంట..ఇంతమందికి వంట చేయడం అంటే మాటలా..ఎటూ నాకు వంటరాదని తెలిసిపోతుంది.. కాసేపట్లో బయటకు వస్తుంది తన పరువు పోతుంది నేను రిలాక్స్ అయిపోవచ్చు అనుకుంటూ బయటి నుంచి తెచ్చుకుందామా అంటుంది..
మహేంద్ర: బయటి నుంచి వద్దమ్మా..ఏదో ఒకటి ఇంట్లోనే చేద్దాం..
గౌతమ్: నేను వెళ్లి వంటల దర్శకత్వ పర్యవేక్షణ చేస్తానంటూ లోపలకు వెళతాడు 
జగతి: వసు వంట చేస్తే రిషి తింటాడా..
మహేంద్ర: వసు ఏం వండినా తనకు నచ్చుతుందనే అనుకుంటాను

Also Read: వసుని అవమానించిన సాక్షికి మైండ్ బ్లాక్ అయ్యే కౌంటర్ ఇచ్చిన రిషి, మనసులో ప్రేమను చెప్పకనే చెప్పిన వసు
రేపటి(గురువారం)ఎపిసోడ్ లో 
సాక్షిపై మీ అభిప్రాయం ఏంటి..తను ఏం చెప్పినా మీరు ఊ అంటున్నారు అని అడిగిన వసుధారతో...నా విషయం నాకు స్పష్టత ఉంది కానీ నీ సంగతేంటి.. నా మెడలో దండ ఎందుకు వేశావ్ అంటాడు. నేను మిమ్మల్ని.... 

Published at : 20 Jul 2022 09:24 AM (IST) Tags: Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu July 20 Episode 507

సంబంధిత కథనాలు

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam Serial ఆగస్టు 19 ఎపిసోడ్: డాక్టర్ బాబుని తీసుకెళ్లిపోయిన మోనిత, మళ్లీ వంటలక్కకు కష్టాలు మొదలు

Karthika Deepam In Netflix: ఏవండోయ్ ఇది విన్నారా! సినిమాగా 'కార్తీకదీపం' సీరియల్

Karthika Deepam In Netflix:  ఏవండోయ్ ఇది విన్నారా! సినిమాగా 'కార్తీకదీపం' సీరియల్

Janaki Kalaganaledu August 19th Update: జెస్సితో జానకి ముచ్చట్లు, ఫైర్ అయిన జ్ఞానంబ- అఖిల్ లవ్ సంగతి నిలదీసిన జానకి

Janaki Kalaganaledu August 19th Update: జెస్సితో జానకి ముచ్చట్లు, ఫైర్ అయిన జ్ఞానంబ- అఖిల్ లవ్ సంగతి నిలదీసిన జానకి

'గుప్పెడంతమనసు' ఆగస్టు19 ఎపిసోడ్ : రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

'గుప్పెడంతమనసు' ఆగస్టు19 ఎపిసోడ్ : రిషి కోసం ఎంగేజ్మెంట్ రింగ్ చేయించే పనిలో పడిన వసు, తల్లిపై ద్వేషం తగ్గించుకున్న రిషి

'హైపర్' ఆది కోసం 'జబర్దస్త్' వదిలేసిన బ్యూటీ

'హైపర్' ఆది కోసం 'జబర్దస్త్' వదిలేసిన బ్యూటీ

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం