Guppedanta Manasu January 1st Episode - ‘గుప్పెడంత మనసు’ సీరియల్ : వసుధారకు ఫోన్ చేసిన రిషి - ఆ విషయం కనిపెట్టేసిన శైలేంద్ర
Guppedanta Manasu Serial Today Episode: వసుధారను కిడ్నాప్ చేసేందుకు భద్ర ప్రయత్నించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్ గా జరిగింది.
Guppedanta Manasu Telugu Serial Today Episode: వసుధారను కిడ్నాప్ చేసేందుకు సరైన టైమ్ కోసం భద్ర ఎదురుచూస్తుంటాడు. కాలేజీలో వసుధారను సీక్రెట్‌గా ఫాలో అవుతాడు. కానీ వసుధారకు దొరికిపోతాడు. నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావని భద్రను నిలదీస్తుంది వసుధార. మీ వెనకే ఉండి మిమ్మల్ని కాపాడమని మహేంద్ర సార్ తననతో చెప్పాడని భద్ర కవర్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ వసుధార అతడి మాటలను నమ్మదు.
వసుధార: ఇక్కడ ఎవరైనా ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే స్టూడెంట్స్ ఉన్నారు. ఏ కీలుకు ఆ కీలు విరగొడతారు. ఇక్కడ నన్ను కిడ్నాప్ చేయడానికి ఎవరైన ప్రయత్నిస్తే స్టూడెంట్స్ వారిని తుక్కురేగ్గొడతారు.
భద్ర: సరే మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఫాలో చేస్తాను.
అనడంతో అసలు ఫాలోనే చేయోద్దంటే మళ్లీ డిస్టర్బ్ చేయకుండా అంటావేంటి అంటూ భద్రకు వార్నింగ్ ఇస్తుంది వసుధార. తనను ఫాలో కావాల్సిన అవసరం లేదని భద్రకు చెప్తుంది. వసుధారను ఫాలో కాకుండా కాలేజీలో ఖాళీగా తిరుగుతోన్న భద్రను చూసి శైలేంద్ర ఫైర్ అవుతాడు. వసుధారను ఫాలో అవుతూ తన ప్రతి కదలికను తెలుసుకోమని చెప్పానుగా అంటూ కోప్పడతాడు. తను ఎవరిని కలుస్తుంది, ఎవరికి ఫోన్ చేస్తుందో చెప్పమంటే...అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ అంటూ భద్రపై ఎగిరిపడతాడు. వారిద్దరు మాట్లాడుకుంటుండగా ఇంతలో మహేంద్ర సడెన్‌గా ఎంట్రీ ఇస్తాడు. అతడిని చూసి శైలేంద్ర షాకవుతాడు. దొరికిపోయామని కంగారు పడతాడు. కానీ మహేంద్ర వారి మాటలను వినడు. భద్రను శైలేంద్ర బెదిరిస్తున్నాడని అపోహపడి
మహేంద్ర: నిన్ను కాలేజీకి ఎవరు రమ్మన్నారు? నీకు ఇక్కడ ఏం పని? అతడితో ఏం మాట్లాడుతున్నావు. నీకు ఎండీ సీట్‌పై ఆశలేదని మీ నాన్నకు లెటర్ రాసి ఇచ్చావుగా...అలాంటప్పుడు కాలేజీకి ఎందుకొచ్చావ్. వచ్చినవాడివి వచ్చినట్లు ఇలాగే వెనక్కి తిరిగి వెళ్లిపో..
అంటూ భద్రను తీసుకుని మహేంద్ర వెళ్లిపోతాడు. తండ్రికి లెటర్ రాసి ఇచ్చిన విషయం వసుధారనే అందరికి చెప్పిందని శైలేంద్ర కోపంతో రగిలిపోతాడు. మరోవైపు వసుధారతో మాట్లాడాలని రిషి పడుతోన్న తపన చూసి పెద్దయ్య కరిగిపోతాడు. రిషి కోసం తమ ఇంటి దగ్గరలో ఉన్న ఓ కుర్రాడి ఫోన్ తీసుకొస్తాడు. పెద్దయ్య ఇచ్చిన ఫోన్‌తో వసుధారతో మాట్లాడేందుకు రిషి ప్రయత్నిస్తాడు. కాలేజీ పనులతో బిజీగా ఉన్న వసుధార కొత్త నంబర్ కావడంతో ఫోన్ లిఫ్ట్ చేయదు. తర్వాత వసుధార తిరిగి రివర్స్ కాల్ చేస్తుంది. రిషి లిఫ్ట్ చేసి వసుధార అని పిలుస్తాడు. రిషి గొంతు విని వసుధార ఎమోషనల్ గా ఫీలవుతుంది.
రిషి: ఎలా ఉన్నావ్ వసుధార బాగున్నావా?
వసుధార: సార్ నేను బాగున్నాను.
అనగానే పక్కనుంచి శైలేంద్ర చూస్తున్న విషయం గమనించిన వసుధార. రిషితో తాను మాట్లాడుతున్న విషయం శైలేంద్రకు తెలియకుండా ఉండేందుకు మాట మార్చేస్తుంది. మా కాలేజీకి ఎలాంటి ప్రమోషన్స్ అవసరం లేదని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. వసుధార మాటలు విని రిషి షాకవుతాడు. రిషితోనే వసుధార ఫోన్ మాట్లాడిందని శైలేంద్ర కనిపెడతాడు. ఆ నిజం ఆమె నోటి నుంచే చెప్పించాలని ప్లాన్ వేస్తాడు. వసుధార క్యాబిన్‌లోకి వచ్చి
శైలేంద్ర: నువ్వు ఫోన్‌లో మాట్లాడింది రిషితోనే కదా
వసుధార: కాదు
శైలేంద్ర: నేనున్నానని నువ్వు మాట మార్చావని తెలిసిపోతుంది. నీ మాటల వల్ల రిషి ఎంత బాధపడి ఉంటాడో..
అని శైలేంద్ర అనడంతో వసుధార కోపంగా తన క్యాబిన్‌లోంచి వెళ్లిపోమ్మని మరోసారి ఇక్కడకు రావొద్దని శైలేంద్రకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో శైలేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు వసుధార మాటలు గుర్తు చేసుకుంటూ రిషి బాధపడుతుంటాడు. అసలు ఆ బిడ్డ నిన్ను గుర్తుపట్టిందా? అని పెద్దయ్య అడుగుతాడు. గుర్తుపట్టిందని...తనను ఎప్పుడు పిలిచేలా సార్ అని అన్నదని అంటాడు రిషి. వసుధారకు ఏదైనా సమస్య వచ్చి ఉంటుందని, అందుకే నిన్ను గుర్తుపట్టినా పట్టలేనట్లుగా మాట్లాడి ఉంటుందని పెద్దయ్య, పెద్దమ్మ రిషికి నచ్చచెబుతారు.
రిషి: ఒకవేళ ఇప్పుడు వసుధార ప్రమాదంలో ఉందేమో? ప్రమాదంలో ఉంటే కూడా కాపాడలేని పరిస్థితి నాది. ఎంతో ఆశతో తనతో ప్రేమగా మాట్లాడదామనుకుంటే తను ఏదేదో మాట్లాడుతుంది. నాకు చాలా భయంగా ఉంది పెద్దమ్మ.
అంటూ రిషి బాధపడుతుంటే.. ఇందాక అట్ల ఎందుకు మాట్లాడిందో మళ్లీ ఒకసారి ఫోన్ చేయ్ అంటూ పెద్దమ్మ చెప్తుంది. మరోవైపు శైలేంద్ర వెళ్లిపోవడంతో వసుధార కూడా రిషితో అలా మాట్లాడినందుకు సార్ బాధపడి ఉంటారనుకుంటూ మళ్లీ ఫోన్ చేస్తుంది.
రిషి: హలో వసుధార
వసుధార: సార్ సారీ సార్ ఇందాక చిన్న ఇబ్బంది వల్ల అలా మాట్లాడాల్సి వచ్చింది సార్. ఎలా ఉన్నారు సార్.
రిషి: బతికే ఉన్నాను వసుధార
అనగానే వసుధార షాక్ అవుతుంది. చావు వరకు వెళ్లొచ్చానని, నీతో మాట్లాడే ఓపిక కూడా తనకు లేదని నీరసంగా ఉందని రిషి చెప్పడంతో మీరు ఎక్కడున్నారో చెబితే నేనే అక్కడికి వస్తానని వసుధార అంటుంది. రిషిని కాపాడిన పెద్దయ్య, పెద్దమ్మకు వసుధార కృతజ్ఞతలు చెబుతుంది. నువ్వు నా దగ్గరకు వస్తోన్న విషయం ఎవరికి తెలియకుండా.. సీక్రెట్‌గా రావాలని రిషి చెప్తాడు. అలాగేనని ఈ విషయం మహేంద్ర, అనుపమలకు కూడా చెప్పకూడదనుకుంటుంది వసుధార దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: ఊహించని విధంగా ‘బిగ్ బాస్’ శోభాశెట్టి ఎంగేజ్‌మెంట్ - మళ్లీ ఎప్పుడూ రానన్న ప్రియుడు యశ్వంత్