Guppedanta Manasu Serial Today June 18th: ‘గుప్పెడంత మనసు’ సీరియల్: తాను రిషినేనని నిజం చెప్పిన రంగ - గుండెలు పగిలేలా ఏడ్చిన సరోజ
Guppedanta Manasu Today Episode: తాను రంగాను కాదు వసుధార భర్త రిషిని అని నిజం చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Guppedanta Manasu Serial Today Episode: కాలేజీలో మహేంద్ర, ఫణీంద్ర, మను, శైలేంద్ర మాట్లాడుకుంటుంటారు. మహేంద్ర, వసుధార గురించి బాధపడుతుంటాడు. ఫణీంద్ర నేను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. వసుధార ఇలా చేస్తుందనుకుంటే అసలు రిషి గురించి అడిగేవాణ్నే కాదు అంటాడు. ఇప్పుడు కాలేజీకి ఎండీని ఎవరిని చేయాలో అంటూ బాధపడతాడు. అవును ఆ లెటర్‌లో ఎవరిదో ఒకరిది పేరు రాసిన బాగుండు అంటూ శైలేంద్ర నోరు జారడంతో అందరూ షాక్ అవుతారు. ఏం లెటర్ అని అడుగుతారు. ఇంతలో శైలేంద్ర మాట మారుస్తాడు. కాలేజీకి ఎవరిని ఎండీని చేయాలో ఒక లెటర్ రాసింటే బాగుండు అంటాడు. బోర్డు మీటింగ్ లో ఎండీని ఎన్నుకుందామంటాడు మహేంద్ర, అయితే ఆ ఏర్పాట్లు చూడు అని ఫణీంద్ర చెప్తాడు.
మహేంద్ర: నేను ఏమీ చేయలేను అన్నయ్యా నా మనసేం బాగాలేదు. చుట్టూ ఉన్నవాళ్లంతా కనుమరుగవుతున్నారు. ఫస్ట్ జగతి ప్రాణాలు కోల్పోయి నన్ను ఒంటరి వాణ్ని చేసింది. తర్వాత రిషి, ఇప్పుడు వసుధార. తను ఎక్కడికి వెళ్లిందో తెలియడం లేదు. పోనీ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే ఇప్పటికే డీబీఎస్‌టీ కాలేజీ పరువు పోతుంది. నాకసలు ఈ జీవితమే వృథా అనిపిస్తుంది అన్నయ్య.
ఫణీంద్ర: మహేంద్ర నువ్వు ధైర్యంగా ఉండు. ఇప్పుడు నీకెంత బాధ ఉందో నాకు అంతే బాధ ఉంది. మనిషివి మనిషిలానే లేవు. నువ్వు ధైర్యంగా ఉండు మహేంద్ర.
శైలేంద్ర: అబ్బా అన్నదమ్ముల అనుబందం. ఇప్పుడేంటి బ్యాక్ గ్రౌండ్ సాంగ్ వేసుకోవాలా? (అని మనసులో అనుకుంటాడు.)
మరోవైపు రిషి సార్ అంటూ కలవరిస్తూ స్పృహలోకి వస్తుంది వసుధార. రూంలోకి రాధమ్మ వచ్చి వసుధారను వివరాలు అడుగుతుంది వసుధార ఏమీ మాట్లాడదు.
రాధమ్మ: ఏవరి కోసం చూస్తున్నావు అమ్మా.. నువ్వు ఏ కన్నతల్లి బిడ్డవో కానీ నా మనవణ్ని కాపాడావు. వాడికి తగలాల్సిన దెబ్బ నీకు తగిలిందట గద. వాడికి చిన్న దెబ్బ తగిలినా కూడా నేను తట్టుకోలేను. నీకెలా ఉంది అమ్మా..
వసుధార: రిషి సార్ ఏడీ..
రాధమ్మ: రిషి సార్ ఎవరమ్మా.. నిన్నెవరో రౌడీలు వెంబడిస్తుంటే నా మనవడు కాపాడాడంట కదా?
వసుధార: ఆయనే రిషి సార్
రాధమ్మ: వాడు రిషి సార్ కాదమ్మా వాడు నా మనవడు రంగ
వసుధార: రంగానా? కాదు రంగా కాదు. నా రిషి సార్.. ఆయన నా రిషి సార్
అని వసుధార బాధగా చెప్తుంటే రాధమ్మ తర్వాత మాట్లాడుకుందాం నువ్వు పడుకో అని పడుకోబెట్టి.. అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు శైలేంద్ర ఎండీ పదవి దక్కదనే కోపంతో ఇరిటేటింగ్ గా ఫీలవుతాడు. ఏం చేసినా నాకే బెడిసికొడుతుంది. పాండు గాడికి ఫోన్ చేసి వసుధారను నిజంగా చంపాడో లేదో కనుక్కుందామని ఫోన్ చేసి వసుధారను చంపేశారా? అని అడుగుతాడు. వసుధారను పూడ్చేసిన లోకేషన్ పెట్టమని అడుగుతాడు. సరేనని పాండు చెప్తాడు. మరోవైపు రంగ ఇంట్లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు.
రాధమ్మ: నాన్న రంగా ఈ అమ్మాయేంట్రా మాటిమాటికి రిషి సార్ రిషి సార్ అంటుంది. నిన్ను పట్టుకుని రిషి సార్ అంటుందేంట్రా..?
రంగ: మళ్లీ అలాగే అంటుందా? నాన్నమ్మ్..
రాధమ్మ: అవున్రా అలాగే అంటుంది.
వసుధార: రిషి సార్… రిషి సార్.. ( అంటూ లేచి బయటకు వచ్చి రంగను చూసి హగ్ చేసుకోబోతుంది. సరోజ వెళ్లి వసుధారను అడ్డుకుంటుంది.) నువ్వెవరు?
సరోజ: అసలు నువ్వెవరు?
రాధమ్మ: అమ్మా నువ్వు పదే పదే రిషి సార్ రిషి సార్ అంటున్నావు కదా అసలు రిషి సారు ఎవరు? అతను నీకేమవుతాడు.
వసుధార: రిషి సార్ నా ప్రాణం. రిషి సార్ నా భర్త.
సరోజ: రిషి సార్ నీ భర్తనా.. కానీ ఇతను నా బావ అమ్మా ఇతని పేరు రంగ.
అనగానే ఎందుకు అబద్దం చెప్తున్నారు. ఆయన స్పర్శే నాకు చెబుతుంది. అంటూ మీరైనా చెప్పండి రిషి సార్ నా మీద కోపమా? అలిగారా అంటూ నిలదీస్తుంది. దీంతో రంగ నేను తన రిషి సార్‌నే అని చెప్తాడు. దీంతో వసుధార హ్యాపీగా ఫీలవుతుంది. రాధమ్మ, సరోజ షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: నాలుకపై శూలం గుచ్చుకున్న టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా? గుండుతో గుడిలో మొక్కులు!