అన్వేషించండి

Guppedanta Manasu Serial Today January 29th - ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: మరోసారి రిషి కిడ్నాప్ - స్పృహ తప్పి పడిపోయిన వసుధార

Guppedanta Manasu Today Episode: మరోసారి రిషి కావడంతో వసుధార సృహ తప్పి పడిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu  Serial Today Episode: రిషిని వెతుక్కుంటూ అతడు ఉన్న ఇంటికి రాజీవ్‌ వస్తాడు. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉండటంతో రాజీవ్‌ డిసపాయింట్‌  అవుతాడు. తన మామయ్యే రిషిని ఇక్కడి నుంచి తప్పించాడని రాజీవ్‌ అనుకుంటాడడు. మళ్లీ నా మరదలు పిల్లే గెలిచేలా చేశావు కదా మామయ్యా... ఎప్పుడు గెలిచినట్లు ఈసారి కూడా నా మరదలు పిల్లే గెలిచింది. కానీ, ఇంతకుముందు జరిగినట్లు ఇకనుంచి జరగదు. ఎందుకంటే ఇన్నిరోజులు ఈ రాజీవ్ గాడు లేడు. ఇప్పుడు ఈ రాజీవ్ గాడు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఆ రిషిగాడిని చంపేసి నిన్ను నా దాన్ని చేసుకుంటా మరదలు పిల్లా అని రాజీవ్ అనుకుంటాడు. నీ మీద కసిలాంటి ప్రేమను నీకు చూపిస్తాను అని రాజీవ్ అనుకుంటుంటే ఇంతలో శైలేంద్ర కాల్ చేస్తాడు.

రాజీవ్‌: హలో భయ్యా..

శైలేంద్ర: ఆ రిషిగాడు దొరికాడా?

 రాజీవ్‌: లేదు భయ్యా కొద్దిలో మిస్ అయ్యారు.

అనగానే నువ్వు కాలు మీద కాలు వేసుకుని కూర్చో భయ్యా. వాడిని వేసేస్తాను అని గొప్పలు చెప్పావు అంటూ  రాజీవ్‌ మీద శైలేంద్ర అరుస్తాడు. చూడు భయ్యా.. మా మేడమ్ కొడువి కదా అని ఇన్నిసార్లు ఊరుకుంటున్నాను. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ఇలా ఇంకోసారి చేస్తే ఈ రాజీవ్ రాక్షసత్వం మీకు కూడా చూపించాల్సి వస్తుందని బెదిరిస్తాడు రాజీవ్. దీంతో  సైలెంట్‌గా ఉండిపోతాడు శైలేంద్ర. అయినా ఆ రిషి గాడు చావడం నీకన్నా నాకే ఎక్కువ. ఆ ఎండీ సీటు ఏంటీ భయ్యా. వాడు ఉన్నా లేకున్నా దక్కించుకోవచ్చు. కానీ, నేను మనసు పడ్డ నా మరదలు పిల్ల దక్కాలంటే రిషిగాడు చావాల్సిందే. వాళ్లు పక్కనే ఉండొచ్చు. నేను వెళ్లి వాన్ని చంపాకా చెబుతాను అని రాజీవ్ అంటాడు. మరోవైపు ఫెస్ట్ జరుగుతుంటుంది. అంతా వసుధారను మెచ్చుకుంటారు.

మహేంద్ర: అమ్మా వసుధార కార్యక్రమం గ్రాండ్‌గా సక్సెస్‌ అయినట్లే ఇక రిషి వస్తే ఆ శైలేంద్ర గాడి గుండె ఆగిపోతుందమ్మా..ఈ రోజుతో వాడి పీడా విరగైపోతుంది. అవును రిషి వాళ్లు ఎక్కడి దాకా వచ్చారట.

వసుధార: దారిలో ఉన్నారట మామయ్యా ఇంకాసేపట్లో వచ్చే్స్తారు.

మహేంద్ర: సరేనమ్మా..

ఇంతలో ఫణీంద్ర వసుధార దగ్గరకు వచ్చి ఈ ప్రోగ్రాంను అన్ని రకాలుగా  సక్సెస్‌ చేశావని.. ఫెస్ట్ బాగా నడుస్తోందని మెచ్చుకుంటాడు. మరోవైపు ఫెస్ట్ గ్రాండ్ సక్సెస్ అయ్యేలా ఉంది. ఎంత ఆలోచించినా ఏం చేయాలో అర్థం కావడం లేదని అనుకుంటూ.. ఆ రిషిగాడు ఎక్కడిదాక వచ్చాడో తెలిసుకుని దారిలోనే భద్రతో లేపించేద్దాం అని అనుకుంటాడు. ఫణీంద్ర వాళ్ల దగ్గరికి వెళ్తాడు శైలేంద్ర. ఎక్కడికి వెళ్లావురా అని ఫణీంద్ర అంటే.. రిషి వస్తున్నాడుగా.. ఎంట్రన్స్ దగ్గర ఉండి రిసీవ్ చేసుకుందామని అక్కడే ఉన్నా అని శైలేంద్ర అంటాడు. వసుధార రిషి ఎక్కడిదాకా వచ్చాడో ఓసారి కనుక్కో అని శైలేంద్ర అంటాడు. అవునమ్మా మినిస్టర్ గారు కూడా ఎదురుచూస్తున్నారు. ఓసారి కనుక్కో అని ఫణీంద్ర అంటాడు. దీంతో వసుధార చక్రపాణికి కాల్ చేస్తుంది. నాన్న ఎక్కడిదాకా వచ్చారంటుంది. ఈ ఫోన్ మీ తండ్రిగారిదా. నేను హాస్పిటల్ సిబ్బందిని మాట్లాడుతున్నాను. మీ నాన్న గారు గాయాలతో ఉంటే ఎవరో హాస్పిటల్‌లో జాయిన్ చేశారు అంటుంది. మరి ఆయనతో రిషి సార్ ఉంటారు కదా అని వసుధార అడగ్గానే ఆయనతో ఇంకెవరు లేరని నర్స్ చెబుతుంది. దీంతో వసుధార స్పృహ తప్పి పడిపోతుంది. వసుధార కిందపడిపోగానే అందరూ షాక్‌ అవుతారు. శైలేంద్ర మాత్రం నవ్వుకుంటాడు.

ఇంట్లో బెడ్‌పై ఉన్న వసుధార  సార్ అంటూ ఉలిక్కిపడి లేస్తుంది ఎలా ఉన్నావని అంతా అడిగితే..

వసుధార: నేను బాగానే ఉన్నాను. నాన్న రిషి సార్ ఎక్కడ

చక్రపాణి: నన్ను క్షమించమ్మా అల్లుడు గారు ఏమైపోయారో నాకు తెలియదమ్మా

వసుధార: అసలు ఏం జరిగింది నాన్నా..  నేను ఫోన్ చేస్తున్నప్పుడు రిషి సార్‌ను తీసుకొస్తున్నాని చెప్పారు కదా

చక్రపాణి: అవునమ్మా.. కానీ నీ కాల్ మాట్లాడిన తర్వాత నన్ను వెనుక నుంచి తలపై ఎవరో కొట్టారు. లేచి చూస్తే హాస్పిటల్‌లో ఉన్నాను. అల్లుడి గారి గురించి అంతా అడిగాను. ఎవరు తెలియదు అన్నారు. నా తలకు దెబ్బ తగిలిందమ్మా

  అంటూ చక్రపాణి బాధపడుతుంటే.. మహేంద్ర మాత్రం దూరం నుంచి మౌనంగా బాధపడుతూ..  ఏంటీ కష్టాలు. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు రిషి ఏ పరిస్థితుల్లో ఉన్నాడో.. వాడికిక సంతోషం ఉండదా అని మహేంద్ర బాధపడుతుంటాడు. శైలేంద్ర కూడా కాలేజీలోనే ఉన్నాడు. రిషిని తీసుకెల్లే అవసరం ఇంకెవరికి ఉంటుంది. మినిస్టర్ గారు కూడా డిసప్పాయింట్ అయి వెళ్లారు అని అనుపమ అంటుంది. వాళ్ల సంగతి పక్కన పెట్టు అనుపమ అసలు రిషి ఎక్కడున్నట్లు అని మహేంద్ర అంటాడు.

వసుధార: రిషి సార్‌కు ఏం కాదు మామయ్యా.. మీరు భయపడకండి. సార్‌ ఎక్కడున్నారో ఎక్కడుంటారో నాకు తెలుసు. సార్‌ను క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నాది.

అంటూ వసుధార వెళ్తుంటే వద్దని మహేంద్ర, అనుపమ ఎంత ఆపినా ఆగదు. చక్రపాణి వెళ్తుంది. మీ తలకు దెబ్బ తగిలింది. రెస్ట్ తీసుకోండని చక్రపాణితో మహేంద్ర అంటాడు. మరోవైపు సంతోషంగా భద్రకు శైలేంద్ర ఫోన్‌ చేసి..

శైలేంద్ర: శభాష్ భద్ర. నిన్ను తక్కువ అంచనా వేశాను. నీ టాలెంట్‌  ఈరోజు చూపించావ్.  రిషిని మాయం చేసి కాలేజీకి రాకుండా చేశావ్‌. వాన్ని ఎక్కడ దాచిపెట్టావ్

భద్ర: నాకు వాళ్లు కనపడలేదు సార్. ఇప్పుడు మీరు చెబితేనే రిషి కాలేజీకి రాలేదని తెలిసింది.  

అని భద్ర అనడంతో శైలైంద్ర షాక్‌ అవుతూనే  కాల్ కట్ చేసి.. ఇదేంటీ వీడికి కూడా తెలియదా. రాజీవ్ కూడా తను చూల్లేదు అన్నాడు. మరి రిషి ఎలా మాయం అయ్యాడు. ఎవరు తీసుకెళ్లారు అని శైలేంద్ర ఆలోచిస్తుంటే వసుధార కోపంగా వస్తుంది. రేయ్ శైలేంద్ర.. రారా బయటకు.. రారా అంటూ అరుస్తుంది వసుధార. శైలేంద్ర రాగానే.. కాలర్ పట్టుకుంటుంది వసుధార. రిషి సార్ ఎక్కడా అంటూ శైలేంద్ర చెంపలు ఎడా పెడా వాయించేస్తుంది. దేవయాని, పణీంద్ర వచ్చి ఆపినా వసుధార ఆగదు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: అందమైన కుందనాల బొమ్మలా మారిన శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోలు చూశారా

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

GT vs MI Match Highlights IPL 2025 | ముంబై ఇండియన్స్ పై 36 పరుగుల తేడాతో గుజరాత్ విజయం | ABP DesamMS Dhoni Fastest Stumping vs RCB | వరుసగా రెండో మ్యాచ్ లోనూ ధోని మెరుపు స్టంపింగ్ | ABP DesamMS Dhoni Sixers vs RCB IPL 2025 | యధావిథిగా ధోనీ ఆడాడు..CSK ఓడింది | ABP DesamCSK vs RCB Match Highlights IPL 2025 | 17ఏళ్ల తర్వాత చెన్నైలో ఆర్సీబీపై ఓటమి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 MI VS GT Result Update: గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
గుజ‌రాత్ బోణీ.. ముంబై పై భారీ విజ‌యం.. ఆక‌ట్టుకున్న సాయి సుద‌ర్శ‌న్, సిరాజ్, MIకి వరుసగా రెండో ఓటమి
Pastor Praveen case: పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
పాస్టర్ ప్రవీణ్ కేసులో సీసీ ఫుటేజీలు రిలీజ్ చేసిన పోలీసులు - ప్రాథమిక పోస్టుమార్టం రిపోర్టులో ఏముందంటే ?
Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు - పోలీసుల ఎదుట శ్రవణ్ రావు హాజరు - కీలక విషయాలు చెప్పారా ?
Chandra Babu Latest News: అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
అమరావతిలో సొంతిల్లు కట్టుకుంటున్న చంద్రబాబు -ఏప్రిల్ 9న భూమి పూజ
Hardik Pandya :బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
బూతు పదంతో సాయికిషోర్‌న తిట్టిన హార్దిక పాండ్యా, సోషల్ మీడియాలో వీడియో వైరల్
Operation Brahma: మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
మయన్మార్ చేరుకున్న NDRF రెస్క్యూ బృందాల విమానాలు, ఆర్సీ, మెడికల్ టీమ్‌లను పంపిన భారత్  
Hyderabad Metro Latest Timings: మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
మారిన హైదరాబాద్‌ మెట్రో టైమింగ్స్‌- ఏప్రిల్‌ 1 నుంచి అమలు!
US-Canada Tariff War: ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
ట్రంప్ టారిఫ్ విధానంతో అమెరికాలో టాయిలెట్ పేపర్ కొరత!
Embed widget