అన్వేషించండి

Guppedanta Manasu Serial Today April 1st: ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌: బోర్డు మీటింగ్‌లో మనును అవమానించిన శైలేంద్ర – మీటింగ్‌ లోంచి వెళ్లిపోయిన మను

Guppedanta Manasu Today Episode: బోర్డు మీటింగ్ లో శైలేంద్ర వెటకారంగా మను తండ్రి గురించి మాట్లాడటంతో ఇవాళ్లీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.

Guppedanta Manasu Serial Today Episode: కాలేజీకి స్టూడెంట్స్‌ తక్కువగా వస్తున్నారని ఇది కాలేజీకి మంచిది కాదని బోర్డు మీటింగ్‌ లో అందరూ చర్చిస్తుంటారు. కొంత మంది స్టూడెంట్స్‌ రుషి లేడన్న కారణంతో క్లాసులకు అటెండ్‌ కావడం లేదని కూడా తెలుస్తుందంటారు బోర్డు మెంబర్స్‌. అయితే స్టూడెట్స్‌ తో ఒకసారి మాట్లాడదామని మను ఐడియా చెప్తాడు. ఆల్‌రెడీ మాట్లాడామని బోర్డు మెంబర్‌ చెప్పగానే అయితే స్టూడెంట్స్‌‌ను బెదిరిద్దామని శైలేంద్ర చెప్పగానే..

ఫణీంద్ర: వార్నింగ్‌ ఇవ్వడం చాలా డేంజర్‌. వార్నింగ్‌ ఇస్తే వాళ్లు ఇంకా రెచ్చిపోతారు. వాళ్లను మచ్చిక చేసుకోవాలి అంతే

వసు: నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్‌. మన కాలేజీలో పేరెంట్స్‌ , స్టూడెంట్స్‌ మీటింగ్‌ అరైంజ్‌ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది సార్‌. ఇది పేరెంట్స్‌ డీల్‌ చేస్తేనే కరెక్ట్‌ సార్‌.

బోర్డు మెంబర్‌: వాట్‌ ఏ విజన్‌, వాట్‌ ఏ థాట్‌ మేడం.

ఫణీంద్ర: సో మన కాలేజీలో అటెండెంట్స్‌ ఇంప్రూవ్‌ చేయడానికి పేరెంట్స్‌ మీటింగ్‌ ఏర్పాటు చేస్తున్నాం.

అని చెప్పగానే శైలేంద్ర ఇప్పుడు నాకు కరెక్టు పాయింట్‌ దొరికింది అని మనసులో అనుకుని పేరెంట్స్‌ అంటే మథర్‌, ఫాథర్‌ ఇద్దరూ రావాలి కదా? అయితే కొందరికి తల్లో.. తండ్రో లేని వాళ్లను పిలిపించడం కష్టం కదా కొంతమందికైతే తండ్రి ఎవరో  కూడా తెలియదు. అనగానే మను కోపంగా వాటర్‌ గ్లాస్‌ పగులగొడతాడు. చేతికి బ్లడ్‌ వస్తుంటే మహేంద్ర వచ్చి ఫస్ట్‌ ఎయిడ్‌ చేసుకుందువు పదా అనగానే నేను వెళ్తాను మీరు మీటింగ్‌ కంటిన్యూ చేయండి అని మను వెళ్లిపోతాడు. పేరెంట్స్‌ మీటింగ్‌ అరైంజ్ మెంట్స్‌ చేయండి అని చెప్పి ఫణీంద్ర వెళ్లిపోతాడు. మమ్మీ నువ్వు చెప్పింది నిజమే వాడికి తండ్రి వీక్‌నెస్‌ ఉంది. ఇక మనుగాడికి మనుగడ లేకుండా చేస్తాను అని శైలేంద్ర మనసులో అనుకుంటాడు. మరోవైపు తన రూంలో కూర్చున్న మను కోపంగా శైలేంద్ర మాటలను గుర్తుచేసుకుంటూ ఉంటాడు. శైలేంద్ర ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తీసుకుని వస్తాడు.

శైలేంద్ర: రక్తం అంత పోతున్నా కూడా చలనం లేకుండా ఎలా ఉన్నావు బ్రదర్‌ నువ్వు.. పట్టు బ్రదర్‌ కట్టు కడతాను. ఎంటి బ్రదర్‌ నీకు బాధ ప్రస్టేషన్‌ ఏదైనా ఉంటే తర్వాత చూసుకోవచ్చు.

మను: ముందు నువ్వు ఇక్కణ్నుంచి వెళ్లు.

శైలేంద్ర: అదేంటి బ్రదర్‌ అలా అంటావు. నీకిలా దెబ్బ తగిలిందని నేనేదో ఓదార్పు కోసం వస్తే.. వెళ్లిపోమంటున్నావు.

మను: నన్నింకా రెచ్చగొట్టాలని చూడకు నేనేం చేస్తానో నాకే తెలియదు.  

శైలేంద్ర: అంతలా రెచ్చిపోవద్దు బ్రదర్‌ మీ అమ్మగారు అనుపమ. మరి మీ నాన్న ఎవరు? సన్నాఫ్‌ అని ఎవరి పేరు రాయాలి. చెప్పు బ్రదర్‌ మీ నాన్న ఎవరు?

ఇంతలో మహేంద్ర, వసుధార అక్కడకు వస్తారు.

మహేంద్ర: శైలేంద్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు..

శైలేంద్ర: నేను వీళ్ల డాడీ గురించి మాట్లాడుతుంటే మీరొచ్చారేంటి? బాబాయ్‌. వసుధార ఫస్ట్‌ ఎయిడ్‌ బాక్స్‌ తీసుకొచ్చావా? నేను తీసుకొస్తేనే కట్టు కట్టుకోవడం లేదు.

మహేంద్ర: మను ముందు బ్లడ్‌ పోకుండా కట్టు కట్టుకో..

మను: అక్కర్లేదు.

అనగానే మహేంద్ర వెళ్లి మనుకు కట్టు కడతాడు. దీంతో శైలేంద్ర.. మను పార్సియాలిటీ చూపిస్తున్నారు. నేను ఇవి తీసుకొస్తే కట్టు కట్టుకోలేదు. నువ్వు తీసుకొస్తే కట్టుకున్నాడు. అంటూ వెటకారంగా మాట్లాడతాడు. మళ్లీ మనును మీ నాన్న గారు ఎవరు? మీకు ఎలా దూరం అయ్యారు అంటూ అడుగుతాడు. దీంతో మహేంద్ర కోపంగా ఎందుకు మనును విసిగిస్తున్నావు. తన తండ్రి ఎవరో తెలియకపోవడం తన లోపమే అంతమాత్రాన నువ్వు తనని అంటూ నేను కావాలని అనలేదు అంటూ మనును అంటాడు. దీంతో మను కోపంగా లోపం కాదు సార్‌ అంటాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: మే 3న ప్రేక్ష‌కుల ముందుకు ‘జితేందర్ రెడ్డి’

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ కోసం అడవిలోకి వెళ్లిపోయిన పిల్లలు..! విహారికి కొత్త తలనొప్పి!
Godavari Serial Today August 5th: 'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
'గోదావరి' సీరియల్: కల్యాణ్ ప్లాన్‌కి గౌతమి బలి..? సింహాద్రి వార్నింగ్ నిజమైందా! షాకింగ్ ట్విస్ట్!
Nindu Manasulu Serial Today August 5th: నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
నిండు మనసులు: ప్రాణాపాయంలో సిద్ధూ! పక్కాప్లాన్‌తో పొడిచేసిన ఎమ్మెల్యే కొడుకు!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 5th:వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?
నువ్వులేక నేను లేను: వర్షం అంటే ఇష్టమన్న రాధను చూసి...అసలు వర్షం అంటేనే ఇష్టం లేదన్న చిట్టిని చూసి విక్కీకి ఏం అనుమానం వచ్చింది..?

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PV Sindhu Sports Academy Visakhapatnam: విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా? 
విశాఖలో పీవీ సింధు స్పోర్ట్స్ అకాడమీకి రెండోసారి శంకుస్థాపన జరిగిందా?
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
Breaking News: ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఈ నెల 17 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
Amritsar Police:జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
జంతర్ మంతర్‌లో ఐఎస్ఐ ముఠాల రెక్కీ! దాడులకు పాకిస్తాన్‌ కుట్ర! 9 మంది అరెస్టు! నిందితుల్లో నలుగురు మైనర్లు!
కలుషిత E20 ఇంధనంతో జాగ్రత్త! వెహికల్‌ ఓనర్లకు SIAM హెచ్చరిక - కేంద్రం కీలక ఆదేశాలు
E20 పెట్రోల్‌పై కొత్త ఆందోళన.. దెబ్బతింటున్న ఇంజిన్ పార్ట్స్, పెరుగుతున్న రిపేర్లు!
PM Modi Praises Nara Lokesh: నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
నారా లోకేష్‌కు మోదీ ప్రశంసలు - ఒక్క సారి కాదు చాలా సార్లు - భవిష్యత్ నేతల్లో ఒకరిగా చూస్తున్నారా?
Telangana Cabinet Expansion 2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
2026: కర్ణాటక కేబినెట్ అలకల సీన్‌తో రేవంత్ రెడ్డి ప్లాన్ బీ - తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై కొత్త వ్యూహం!?
Donald Trump: అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర! భగ్నం చేసిన భద్రతా బలగాలు! నిందితుడి ఇంట్లో తూటాల డంప్!
Embed widget