Jitendar Reddy : Jitendar Reddy : మే 3న ప్రేక్షకుల ముందుకు ‘జితేందర్ రెడ్డి’
Jitendar Reddy : తెలంగాణలో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా తీసిన సినిమా ‘జితెందర్ రెడ్డి’. పొలిటికల్, యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.
Jitendar Reddy Movie Release Date: ‘బాహుబలి’ సినిమాతో ప్రేక్షకుల దగ్గరైన నటుడు రాకేశ్ వర్రే. ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ సినిమాతో పరిచయం అయిన ఆయన.. ‘పేకమేడలు’ సినిమా ద్వారా ప్రడ్యూసర్ గా మారారు. చిన్న సినిమాలను ప్రొత్సహిస్తున్న ఈ నటుడు.. ఇక ఇప్పుడు ‘జితేందర్ రెడ్డి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇది యదార్థ సంఘటన ఆధారంగా చిత్రీకరించినట్లు మేకర్స్ ప్రకటించారు.
పోస్టర్ కి మంచి రెస్పాన్స్..
ఈ సినిమాకి సంబంధించి గతంలో రిలీజ్ చేసిన ప్రోమో, పోస్టర్ అందరినీ ఆకట్టుకున్నాయి. జనాల్లో క్యూరియాసిటీ పెంచేందుకు హీరో ఫేస్ రివీల్ చేయకుండా పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో ఎవరీ జితేందర్ రెడ్డి అని అందరిలో ఆసక్తి నెలకొంది. దీంతో రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది. కాగా.. ఈసినిమాని మే 3న రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ఈ రోజు ప్రకటించింది.
ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ, "ఈ సినిమా 1st లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా క్యూరియాసిటీని పెంచాయి. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరోగా ‘ఎవ్వరికీ చెప్పొద్దు’ లాంటి లవ్ స్టొరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చెయ్యడం చాలా గొప్ప విషయం. ‘జితేందర్ రెడ్డి’ జగిత్యాలలో 1980లలో యదార్ధంగా జరిగిన కథ. రియల్ స్టొరీని బాగా తియ్యడానికి చాలా రీసెర్చ్ అవసరమైంది, దాని కోసం నేను మా టీం వర్క్ ఔట్స్ చేసి, రెఫెరెన్సులు తీసుకుని, పెద్ద వారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్ గా చేసిన సినిమా ఇది. ఆరోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర, దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులకి అందించాలని చేసే ప్రయత్నమే ఈ 'జితేందర్ రెడ్డి" అని అన్నారు.
ఈ సినిమాని ముదుగంటి క్రియేషన్స్ అధినేత ముదుగంటి రవీందర్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఉయ్యాలా జంపాలా, మజ్ను లాంటి ప్రేమకథా చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ, మా 'జితేందర్ రెడ్డి' లాంటి యాక్షన్ స్టొరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఈ సినిమా టైటిల్ చాలా పవర్ఫుల్ గా ఉంది. 1980లో నేను చూసిన, నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి, అప్పటి లొకేషన్స్ గాని, అప్పటి అంబియన్స్ ని గాని చాలా చక్కగా తెరకేక్కించాము. హీరో రాకేష్ వర్రే గతంలో లవ్ స్టొరీ చేసి ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామా ని కూడా చాలా బాగా హేండిల్ చేశాడు. అప్పటి సన్నివేశాలని, జరిగిన కథని యదార్ధంగా చూపించాము తప్ప, ఎవరిని కించ పరిచే విధంగా మాత్రం చెయ్యలేదు. సుబ్బరాజు గారి లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అధ్బుతంగా ఈ కథ కోసం పని చేశారు".
ఈ సినిమాలో రియా రియా సుమన్ హీరోయిన్. సాంకేతిక నిపుణులు విషయానికి వస్తే ఎన్నో .ఎస్ జ్ఞాన శేఖర్ ఈ సినిమాకి కెమెరామెన్ గా పని చేశారు. అలాగే ఎన్నో లవ్ స్టోరీస్ కు మ్యూజికల్ హిట్స్ అందించిన మలయాళ సంగీత దర్శకుడు గోపీసుందర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. నాగేంద్రకుమార్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ముదుగంటి క్రియేషన్స్ బ్యానర్‌పై ముదుగంటి రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.
Also Read: ‘ఓపెన్‌హైమర్’ ఒక ప్రాపగాండా సినిమా - సంచలన కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరో!