Guppedanta Manasu September 19th: వసుకి థ్యాంక్స్ చెప్పిన రిషి, తన కుట్రను మరోసారి బయటపెట్టిన శైలేంద్ర!
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలకు రిషి చెక్ పెట్టాడు....ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు సెప్టెంబరు 19 ఎపిసోడ్
ఇంటికి రమ్మని అందరూ పిలిచినా కానీ రాను అని చెప్పేసి వెళ్లిపోయిన రిషి...మురుగన్ కి కాల్ చేసి థ్యాంక్స్ చెబుతాడు. ఆ తర్వాత కారు డోర్ తీసి కూర్చోగానే పక్క సీట్లో అప్పటికే కూర్చున్న వసుధారని చూసి ఆశ్చర్యపోతాడు. మీరంటి మేడం ఇక్కడ అని అడుగుతాడు. మీతో వస్తానంటుంది. కాసేపు ఇద్దర వాదించుకున్నాక సరే అంటాడు రిషి..
జగతి: రిషి అక్కడ తనకు భార్య ఉందని నిశ్చితార్థం ఆపేశాడు..ఇక్కడ కాలేజీ విషయంలోనూ ఆగలేదు
మహేంద్ర: రిషి క్రమంగా ఒక్కో నిజం తెలుసుకుంటాడు..వాళ్లిద్దరూ రిషిధారలు ఎప్పుడూ విడిపోలేరు..
అటు వసుధార...రిషిని చూస్తూ మురిసిపోతుంటుంది..రిషి ఇబ్బందిపడుతుంటాడు..
రిషి: రోడ్డు ముందుంది మేడం
వసు: డ్రైవ్ చేసేవారు రోడ్డు చూస్తే చాలు
రిషి: మీ చూపులు నన్ను డిస్ట్రబ్ చేస్తున్నాయి
వసు: మిమ్మల్ని ఎవ్వరూ డిస్ట్రబ్ చేయలేరు. ఆఖరి నిముషంలో కాలేజీ దూరం అయిపోతున్న టైమ్ లో మీరు తప్పకుండా వస్తారనే నమ్మకం, సీరియస్ సింహం కదా రారేమో అనే డౌట్.. అయినా మీరు అడుగుపెట్టకుండానే భలే సాధించారు.. మీరు నన్ను క్షమించానని చెప్పలేదు, జగతి మేడంని క్షమించానని చెప్పేలేదు, నన్ను ప్రేమిస్తానని చెప్పలేదు..కానీ ఇదివరికటిలా నా స్థానం నాదే అని చెప్పారు, కాలేజీలో మీ స్థానం నిలబెట్టుకున్నారు
రిషి: విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించానంతే..మీరు చేసిన గాయం మరిచిపోలేను
వసు: కలసి ప్రయాణిస్తున్నాం ఇది చాలు...
రిషి: మన గమ్యస్థానాలు వేరు
వసు: అని మీరనుకుంటున్నారు..నేను అనుకోవడం లేదు
రిషి: పొగరు..మాటకు మాట అంటుంది అనుకుంటాడు. అయినా చుట్టుముట్టిన సమస్య తీరింది కానీ అసలు సమస్య అలాగే ఉంది. కాలేజీ సమస్య తీర్చాను కానీ మనసుని చుట్టుముట్టుకున్న బంధం దగ్గరకాలేదు కదా..అంతవరకూ సంతోషం ఉండదు
వసు: మీ అంతట మీరే దూరం చేసుకుంటున్నారు
రిషి: ఎప్పటికీ నేను సంతోషంగా ఉండలేను..
వసు; నేను ఉంటున్నా
రిషి: మీకు ధైర్యం, తెగువ ఎక్కువ..ఏమీ లేకుండా ఉండగలరు, ఎలా అనుకుంటే అలా ఉండగరు..నాకు అసాధ్యం
వసు: నేను అలా ఉండగలిగింది మిమ్మల్ని చూసుకునే..ఏంజెల్ మిమ్మల్ని పెళ్లిచేసుకుంటానన్నా సైలెంట్ గా ఎందుకు ఉన్నానో తెలుసా..మీపై నమ్మకం
రిషి: నమ్మకం రెండు వైపులా ఉండాలి
వసు: తప్పు జరిగింది..ముల్లును తీసేసి పువ్వును మెచ్చుకోవడం గొప్ప వాళ్ల లక్షణం.. మీరు కూడా నా ప్రేమను గుర్తించండి
రిషి: ముల్లు చేసిన గాయమే వేధిస్తోంది..నేను మర్చిపోలేను..
వసు: 15 రోజులు గడువు ఇచ్చిన ఏంజెల్ కి ఏం సమాధానం చెప్పబోతున్నారు..
ఈ లోగా రిషి కారును సడెన్ బ్రేక్ వేసి ఆపుతాడు...ఎదురుగా శలైంద్ర ఉంటాడు
Also Read: బాలయ్య స్టైల్ లో ఏంఎస్ఆర్ కి రిషి అదిరే వార్నింగ్- శైలేంద్ర గురించి జగతి నిజం బయటపెడుతుందా?
నువ్వెంటి ఇలా వచ్చావ్ అన్నయ్యా అంటే నీకోసమే అని డ్రామా స్టార్ట్ చేస్తాడు శైలేంద్ర
శైలేంద్ర: నువ్వు ఎక్కడికీ వెళ్లొద్దు మాతో పాటే ఉండాలి
రిషి: నేను ఒంటరివాడిని నాకు ఏ బంధాలు వద్దు
శైలేంద్ర: నీకోసం డాడీ కన్నీళ్లు పెట్టుకున్నాడు..అయినా కరగవా.నాతో వచ్చెయ్..
రిషి: సారీ అన్నయ్యా ఈ విషయంలో నా నిర్ణయం మారదు
శైలేంద్ర: నేను నిన్ను వెళ్లనివ్వను రిషి..నువ్వు నాతో పాటూ ఇంటికి రావాల్సిందే అని రిషి చేయి పట్టుకుంటాడు శైలేంద్ర...
ఇంతలో జగతి-మహేంద్ర అక్కడకు వస్తారు...
శైలేంద్ర: రిషిని ఇంటికి తీసుకొస్తుంటే ఆపుదామని వచ్చారా..రిషి లేకుండా మీరుంటారు కానీ నేను ఉండలేను..
ఎవ్వరు పిల్చినా నేను రాదలుచుకోలేదని క్లారిటీ ఇస్తాడు రిషి.. నా మనసుకి గాయం అయింది అది మానేవరకూ నన్ను ఇబ్బంది పెట్టొద్దు అనేస్తాడు
శైలేంద్ర: రిషిని జాగ్రత్తగా చూసుకో..నువ్వు రిషికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పినా తన వెంటే ఉన్నావ్..రిషి కాలేజీ నుంచి బయట అడుగుపెట్టడానికి కారణం నువ్వే..ఈ రోజు కాలేజీ సమస్య తీర్చడానికి కారణం నువ్వే..రిషి మా మధ్య లేడని బాధగా ఉంది కానీ ఎక్కడున్నా ఇద్దరూ కలసే ఉంటారని మనసు కుదుటపడింది...ఎప్పటికైనా రిషిని నువ్వే తీసుకురావాలి
వసు: ఇలా మాట్లాడుతున్నారంటే ఏదో ప్లాన్ చేశారని అర్థమవుతోంది అనుకుంటుంది వసుధార
మహేంద్ర: అవును శైలేంద్ర..దొంగలు బయటపడే సమయం దగ్గరపడింది..
నేను వెళుతున్నా అని రిషి..ఆ వెనుకే వసు వెళ్లిపోతారు...
Also Read: రాజు ఎక్కడున్నా రాజే, మురుగన్ ని పంపించి శైలేంద్ర కుట్రకు చెక్ పెట్టిన రిషి!
మహేంద్ర-జగతి-శైలేంద్ర
క్రూరంగా నవ్వుకుంటాడు శైలేంద్ర... ఎన్నాళ్లిలా ముసుగువేసుకుని నటిస్తావ్..ఏదో ఒకనాటికి ముసుగు తొలగిపోతుందని మహేంద్ర అంటే.. అది మీ భ్రమ అంటాడు. నిజం తెలిసిన మరుక్షణమే అన్నయ్య నిన్ను చంపేస్తాడని మహేంద్ర అంటే.. అది జరగదు బాబాయ్ అని ధీమాగా ఉంటాడు. మీరు చాలా మంచివాళ్లు బాబాయ్..మా డాడీని బాధపెట్టలేరు, మీ మంచి తనమే నా బలం, అదృష్టం అంటాడు. రోజులు ఎదురు తిరిగే రోజులు వస్తాయంటున్న జగతి..నువ్వు ఇన్నాళ్లూ ఏం చేయాలని చూసినా సక్సెస్ అవడం లేదు అయినా నీకు అర్థం కాలేదంటుంది. ఎన్నిసార్లు ఓడిపోయినా పదే పదే యుద్ధం చేస్తే గెలిచి తీరుతాం కాస్త ఓపిక పట్టాలంతే అంటాడు శైలేంద్ర. డీబీఎస్టీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకునేవరకూ తగ్గేదే లే అంటాడు శైలేంద్ర. నేను ఎండీసీట్లో కూర్చోవాలన్నది మా అమ్మ కోర్కె..అది నెరవేర్చుకుంటాను... MSR కాకపోతే మరొకడు దొరుకుతాడు చివరికి మేం అనుకున్నది సాధించుకుంటానంటాడు. ఛీఛీ అనుకున్న జగతి-మహేంద్ర..వాడి గొయ్యి వాడే తవ్వుకుంటున్నాడు అందులో పడతాడు అనేసి వెళ్లిపోతారు...
రిషి-వసుధార
అటు రిషి..వసుధారని ఇంటి దగ్గర దించేస్తాడు. ఇంట్లోకి రమ్మని అడుగుతుంది కానీ ఎప్పటిలా నో అంటాడు. బాధగా కారు దిగుతుంది వసు. థ్యాంక్స్ అంటాడు...ఎందుకు కారు దిగినందుకా అని అడిగితే.. ఏంజెల్ విషంలో నన్ను నమ్మినందుకు అని చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటారు. చక్రపాణి బయటకు వచ్చి చూస్తాడు... ఇంతకీ మీరిప్పుడు ఎక్కడకు వెళతారని వసుధార అడుగుతుంది... మనసుకి నచ్చిన ప్రదేశానికి వెళతాను, ఏం చేయాలి అనిపిస్తే చేస్తాను అనేసి వెళ్లిపోతాడు. అల్లుడుగారు లోపలకు రాలేదేంటమ్మా అని చక్రపాణి అడిగితే.. ఆయన వస్తానంటే నేను వద్దంటానా నాన్నా...జరిగిన సంఘటన వల్ల విశ్వనాథంగారింట్లో ఉండలేరు..దానిగురించే అడిగాను కానీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు అంటుంది...