Guppedanta Manasu September 18th: బాలయ్య స్టైల్ లో ఏంఎస్ఆర్ కి రిషి అదిరే వార్నింగ్- శైలేంద్ర గురించి జగతి నిజం బయటపెడుతుందా?
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలకు రిషి చెక్ పెట్టాడు....ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
జగతి సంతకాలు పెట్టె టైమ్ కి మురుగన్ ఎంట్రీ ఇస్తాడు. డబ్బులు తీసుకుని వెళ్లకపోతే బాగోదని తన స్టైల్ లో ఏంఎస్ఆర్ కి వార్నింగ్ ఇస్తాడు. శైలేంద్ర కోపంగా వెళ్లకపోతే ఏం చేస్తావ్ అంటాడు.
మురుగన్: వెళ్లకపోతే నాకు కావాల్సిన వాళ్ళు బాధపడతారు. వాళ్ళు బాధపడితే నాకు ఒంట్లో కోపం వస్తుంది. కోపం వస్తే ఏమవుతాదో తెలుసా చెయ్యి కత్తి పడుతుంది అది ఎవరిని వేటు వేస్తుందో నాకే తెలియదు
శైలేంద్ర: అసలు నిన్ను ఎవరు పంపించారు
మురుగన్: పాండ్యన్ మనకి ఈ సీన్ లో డైలాగ్ లు ఇంతవరకే కదా ఇచ్చింది అని జరిగిన విషయం గుర్తు చేసుకుంటాడు. రిషి మురుగన్ ని కలిసి కోటి రూపాయలు కావాలని అడుగుతాడు. నా కొడుకుని దారిలో పెట్టావ్ అందుకోసం కోటి కాదు పది కోట్లు అయినా ఇస్తానని అంటాడు. అవి తనకి కాదని డీబీఎస్టీ కాలేజ్ తీసుకెళ్ళి ఇవ్వమని అంటాడు. ఆ డబ్బు తనే ఇచ్చినట్టు ఎవరికీ చెప్పొద్దని రిషి మాట తీసుకుంటాడు. వసుని ఏం చేయమంటావ్ అని అడుగుతాడు. మురుగన్ ఎంట్రీ అవగానే రిషి దగ్గర నుంచి నేనే పంపించాను అని మెసేజ్ వచ్చిన విషయం వసు గుర్తు చేసుకుంటుంది. వచ్చిన పని అయిపోయిందని మురుగన్ వాళ్ళు వెళ్లిపోతారు. తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు శైలేంద్ర రగిలిపోతాడు.
Also Read: రాజు ఎక్కడున్నా రాజే, మురుగన్ ని పంపించి శైలేంద్ర కుట్రకు చెక్ పెట్టిన రిషి!
ఎవరు ఇతను? అతని వెనుక ఎవరు ఉన్నారని ఏంఎస్ఆర్ సీరియస్ గా అడుగుతాడు. ఇప్పుడే కదా వార్నింగ్ తీసుకున్నావ్ మళ్ళీ ఇంకొక వార్నింగ్ కావాలా? సరే అయితే ఉండు ఇప్పుడే చూపిస్తానని వసు అంటుంది. టీవీ ఆన్ చేయగానే రిషి కనిపిస్తాడు. తనని చూసి ఫణీంద్ర చాలా సంతోషపడతాడు.
రిషి: నేను కాలేజ్ కి, ఫ్యామిలీకి దూరమయ్యా అంటే దాని అర్థం నేను వాళ్ళకి సమస్య వస్తే చూస్తూ ఊరుకుంటానని కాదు. డీబీఎస్టీ కాలేజ్ జోలికి వస్తే ఏం జరుగుతుందో మీకు ఇది వరకే తెలుసు. అయినా నువ్వు మళ్ళీ వచ్చావంటే నీకు బుద్ది లేదు ఎంఎస్ఆర్. జిత్తుల మారి నక్కలా ఎప్పుడు కాలేజ్ ని చేజిక్కించుకుందామని అనుకునే నీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఈ రిషి ఉండగా కాలేజ్ జోలికి రావాలని ఆలోచన చేస్తే ఈసారి నువ్వు నన్ను చూడాల్సి వస్తుంది. నేను నిన్ను చూడాల్సిన పరిస్థితి వస్తే కొబ్బరి బోండాం ప్లేస్ లో నీ తల ఉంటుంది. అవుట్.. కలలో కూడా ఈ కాలేజ్ ని తలుచుకోకు
మహేంద్ర: ఇందాక ఏదో చేస్తానని అన్నావ్ కదా. వాడు ఎవడో తెలుసా ది కింగ్ ఆఫ్ డీబీఎస్టీ కాలేజ్. రాజు ఎక్కడున్నా రాజే. అది వాడి కోటలో అయినా అజ్ఞాత వాసంలో అయినా అనేసి డాక్యుమెంట్స్ చింపేస్తాడు
ఫణీంద్ర రిషి ఎక్కడ ఉన్నాడు తనని చూడాలని అనిపిస్తుందని అనేసరికి వసు తనతో రమ్మని చెప్తుంది. వసు అందరినీ రిషి దగ్గరకి తీసుకొస్తుంది. కొడుకుని చూడగానే ఫణీంద్ర ప్రేమగా రిషిని కౌగలించుకుని ఎమోషనల్ అవుతాడు. వాళ్ళని చూసి రిషి షాక్ అవుతాడు. లేనిపోని ప్రేమ నటిస్తూ దేవయాని రిషిని హగ్ చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఏమైపోయావ్ ఈ పెద్దమ్మని చూడాలని అనిపించలేదా అని డ్రామా మొదలుపెడుతుంది. శైలేంద్ర కూడా వెళ్ళి రిషిని హగ్ చేసుకుని ప్రేమ ఉన్నట్టు నటిస్తాడు.
ఫణీంద్ర: ఇన్నాళ్ళూ నువ్వు ఎక్కడ ఉన్నావో తెలియదు. ఈరోజే నీ గురించి తెలిసింది
దేవయాని: నీ గురించి ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు ఎక్కడ ఉన్నావో అనే ఆలోచనతో నరకం అనుభవించాను
ఫణీంద్ర: జగతి, మహేంద్రకి నీ గురించి తెలిసి కూడా మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. నీ గురించి మేము ఎంత బాధపడుతున్నామో తెలిసి కూడా ఎందుకు దాచారో అర్థం కావడం లేదు
శైలేంద్ర: నువ్వు ఇక్కడ ఉండటం ఏంటి మన కాలేజ్ కి వెళ్లిపోదాం పద
రిషి: సోరి అన్నయ్య నేను రాలేను. కాలేజ్ లో అడుగుపెట్టే అర్హత నాకు లేదు. నేను మోసగాడిని
ఫణీంద్ర: ఎందుకు అంత మొండితనం
రిషి: నా ఆత్మాభిమానం చంపుకుని నేను కాలేజ్ లో అడుగుపెట్టలేను
Also Read: కావ్య రాక్స్.. రుద్రాణి షాక్- తెలివిగా అత్త మనసు మార్చిన కళావతి
ఫణీంద్ర; నువ్వు తప్పు చేశావంటే ఎవరు నమ్మరు ఇందులో ఏదో కుట్ర ఉంది
శైలేంద్ర: నువ్వు లేకపోతే ఈరోజు మన కాలేజ్ ఉండేది కాదు ఏంఎస్ఆర్ సొంతం అయ్యేది. అప్పటికీ ఎప్పటికీ డీబీఎస్టీ కాలేజ్ ఎండీ నువ్వే. ఈ అన్నయ్యగా నిన్ను ఆ సీట్ లో కూర్చోబెడతాను
రిషి: క్షమించు అన్నయ్య నేను ఇక్కడికి పదవులు ఆశించి రాలేదు. డీబీఎస్టీ కాలేజ్ కష్టం తీర్చడానికి వచ్చాను
ఫణీంద్ర: నీ నిర్ణయం కరెక్ట్ కాదు. నువ్వు కాలేజ్ లో లేకపోయేసరికి ఈ కాలేజ్ కళ తప్పిపోయింది. మళ్ళీ ఈ కాలేజ్ కి నువ్వు రావాలంటే మేం ఏం చేయాలి
రిషి: పెదనాన్న భూషణ్ రక్తం గురించి అందరికీ తెలుసు. నేను మోసగాడిగా దోషిగా నేను కాలేజ్ లో అడుగుపెట్టలేను
శైలేంద్ర: దీనికి కారణం పిన్ని, వసుధార
రిషి: అది తప్పు వాళ్ళిద్దరూ నిమిత్తమాత్రులని నాకు తెలుసు. కానీ అందరి ముందు నా ప్రాణమైన కాలేజ్ విషయంలో నన్ను దోషిని చేశారు. అందుకే పెదనాన్న వాళ్ళంటే నాకు కోపం అది ఎప్పటికీ పోదు
ఫణీంద్ర: నీమీద పడిన నింద ఆరోజునే నిరూపించుకోవచ్చు కదా
రిషి: నిరూపించుకోవచ్చు కానీ వాళ్ళిద్దరినీ దోషులని చేయడం నాకు ఇష్టం లేదు
వసు: దీనికి కారణం శైలేంద్ర అని చెప్పెద్దాం
జగతి; ఆ విషయం ఇప్పుడు చెప్పినా రిషి నమ్మడు. శైలేంద్ర రివర్స్ గేమ్ మొదలు పెట్టాడు
మహేంద్ర: నీమీద నింద వేసిన వాడు మన అందరి ముందుకు రావాలి. జగతి అప్పుడు అసలు ఏం జరిగింది
ఫణీంద్ర: చెప్పు జగతి మేం అడిగితే రిషి రావాలని అంటావ్ కదా. ఇప్పుడు రిషి వచ్చాడు నిజం చెప్పు మీరు ఎందుకు ఆ పని చేశారు
జగతి: చెప్తాను ఇంతవరకు వచ్చిన తర్వాత దాచి పెట్టి ప్రయోజనం ఏమి ఉండదు. నిజాలు చెప్పేసి ఈరోజుతో నేను మోస్తున్న భారం దించేసుకుంటా
రిషి: మేడమ్ ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు. డీబీఎస్టీ ఎండీ సీట్ మీదే. మనసులో బాధ ఉందని బాధ్యత వదిలి పెట్టకూడదు. పెదనాన్న నేను వెళ్తున్నా అందరూ జాగ్రత్తగా ఉండండి
ఫణీంద్ర: నువ్వు వెళ్లొద్దు రిషి