Guppedanta Manasu September 16th: రాజు ఎక్కడున్నా రాజే, మురుగన్ ని పంపించి శైలేంద్ర కుట్రకు చెక్ పెట్టిన రిషి!
కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలకు రిషి చెక్ పెట్టాడు....ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు సెప్టెంబరు 16 ఎపిసోడ్
DBST కాలేజీ కుట్రను తిప్పికొట్టడం ఎలా అని ఫణీంద్ర బాధపడతాడు... నువ్వు రిషి దగ్గర్నుంచి వచ్చావు కదా తనకు కాల్ చేసి చెప్పు ఈ విషయం తెలిస్తే రిషి తప్పనిసరిగా వస్తాడని ఫణీంద్ర అంటాడు.
మహేంద్ర: రిషి రాడు
ఫణీంద్ర: రాకపోతే ఎలా..ఈ కాలేజీ కుప్పకూలిపోతే నా గుండె తట్టుకోలేదు
మరోవైపు వసుధార రిషికి ఫోన్ చేస్తుంది. కాల్ లిఫ్ట్ చేసిన రిషి నాకు కాల్ చేయొద్దంటూ కట్ చేస్తాడు. కాలేజీ చేజారి పోయేలాగా ఉంది రెస్పాండ్ అవ్వండి అని మెసేజ్ పెడుతుంది వసుధార. నన్ను డిస్టర్బ్ చేయకండి అని మెసేజ్ పెడతాడు రిషి. రిషి ని తిట్టుకుంటుంది వసుధార. మరోవైపు జగతి డబ్బుల కోసం మినిస్టర్ కి ఫోన్ చేస్తుంది కానీ ఆయన అందుబాటులో ఉండరు.
Also Read: ఆఖరి అరగంట ఏం జరగబోతోంది - రిషి రీ ఎంట్రీతో శైలేంద్రకు చుక్కలే!
శైలేంద్ర-దేవయాని
వాళ్ల పతనానికి కొన్ని క్షణాలు మాత్రమే ఉందని దేవయాని అంటూ కొడుకుని మెచ్చుకుంటుంది దేవయాని. గడువు పూర్తయ్యలోగా వాళ్ళకి అస్సలు డబ్బు పుట్టదు. కాలేజీ తప్పకుండా మన చేతికి వస్తుందని ఫిక్సైపోతాడు శైలేంద్ర. ఇక కాలేజీ మన చేతికే అని సంతోషపడుతుంది.
బాధపడుతున్న జగతి దగ్గరికి వచ్చి ఓదారుస్తాడు మహేంద్ర. ఈ కాలేజీ చేజారి పోతుందంటే చాలా బాధగా ఉంది. ఈ కాలేజీ అంటే రిషికి ప్రాణం ఇప్పుడు ఆ ప్రాణం పోయేలాగా ఉంది అంటూ ఏడుస్తుంది. మరోవైపు భర్త దగ్గరికి వచ్చిన దేవయాని ఇప్పుడు ఏం చేయటం.. పోనీ మన బంగారం తాకట్టు పెట్టి ప్రాబ్లం సాల్వ్ చేద్దామా అని అమాయకంగా మొహం పెట్టి భర్తని అడుగుతుంది. మన దగ్గర ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టినా అంత అమౌంట్ రాదు. అంతా మంచే జరగాలని ఆ దేవుడిని కోరుకోవడం తప్ప మనం ఏమి చేయలేము అంటాడు ఫణీంద్ర.
వసు-రిషి
మళ్ళీ, మళ్ళీ రిషి కి ఫోన్ చేస్తూనే ఉంటుంది వసుధార. ఫోన్ లిఫ్ట్ చేసిన రిషి డిస్టర్బ్ చేయొద్దు అంటే ఎందుకు పదే పదే ఫోన్ చేస్తున్నారని ఫైర్ అవుతాడు. MSR మీ కాలేజీని లాగేసుకుంటున్నాడు మీరు రావాల్సిందే అని అడుగుతుంది. అయినా రుణం తీర్చుకుంటానని వెళ్లారు కదా మీకు చేతనైతే ఆ పని చేయండి లేదంటే వదిలేయండి ఇలా కాల్స్ చేసి మెసేజెస్ చేసి నా పనని డిస్ట్రబ్ చేయొద్దని ఫోన్ పెట్టేస్తాడు రిషి. ఇంత మొండిగా ఎలా ఉండగలుగుతున్నారు అని అనుకుంటుంది వసుధార.
Also Read: హ్యాట్సాఫ్ ఏంజెల్, రిషిని కాలేజీకి రమ్మని ఆహ్వానించిన జగతి-మహేంద్ర!
అందరి టార్గెట్ జగతి
గడువు ముగియటానికి కాస్త సమయం ముందు అందరూ మీటింగులో కూర్చుంటారు. ఇక మీకుఇచ్చిన టైమ్ అయిపోతోంది... నేను అడిగిన డబ్బు మీరు ఇవ్వలేదు కాబట్టి ఈ కాలేజ్ నాకు రాసి ఇచ్చేయండి అంటాడు MSR. అందుకు ఒప్పుకుంటున్నట్లుగా బోర్డు మెంబర్స్ అందరూ సంతకం పెట్టండి అని జగతి ఎదురుగా ఫైల్ పెడతాడు ఎమ్మెస్సార్. సంతకం పెట్టడానికి చాలా ఇబ్బంది పెడుతుంది జగతి.
శైలేంద్ర: ఇదంతా నీ వల్లే పిన్ని, కాలేజీని హ్యాండిల్ చేయలేవు అంటే వినిపించుకోలేదు. ఈరోజు కాలేజీని చేజార్చే పరిస్థితికి తీసుకువచ్చావు అంటూ కావాలని హడావుడి చేస్తారు
దేవయాని: దేవయాని కూడా జగతిని తప్పుపడుతుంది
ఫణీంద్ర: నీ నిర్లక్ష్యం వల్లే కాలేజీ ఈ దుస్థితికి వచ్చింది
అందరూ కలసి జగతిని టార్గెట్ చేయడంతో ఆమె బాధపడుతుంది..వసుధార కూడా దేవయాని-శైలేంద్రపై రగిలిపోతుంది.
కావాలంటే ఇల్లు రాసిస్తాం అంటూ కొత్త డ్రామా వేస్తాడు శైలేంద్ర..కానీ నాకు కావాల్సింది కాలేజీ మాత్రమే ఇల్లుకాదంటాడు MSR
జగతి: రిషి..నువ్వు లేని సమయం చూసి వీళ్ళందరూ ఆడుకుంటున్నారు. నీకు ఆ రోజే నిజం చెప్పవలసింది తప్పు చేశాను. అందుకు మూల్యం ఇప్పుడు చెల్లించుకుంటున్నాను అనుకుంటూ ఏడుస్తూ ఫైల్ మీద సంతకం పెట్టే సమయానికి కరెక్ట్ గా మురుగన్ వస్తాడు.
మురుగన్ ఇచ్చి పడేశాడు
శైలేంద్ర: నువ్వెవరు...ఇక్కడికి ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు
మురుగన్: నేను ఎవరినో పక్కన పెట్టు, నాకేం కావాలో కాదు మీకు కావాల్సింది ఇవ్వడానికి వచ్చాను. ఇక్కడ ఎవరికో డబ్బులు కావాలంట కదా అని అంటాడు మురుగన్. నాకే అంటాడు ఎమ్మెస్సార్. కోటి రూపాయలు పెట్టి ఈ డబ్బులు తీసుకుని మీ దగ్గర ఉన్న పత్రాలు ఇచ్చేయ్ అంటాడు మురుగన్. ఈడబ్బిచ్చి కాలేజీ నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా అని కావాలని శైలేంద్ర క్వశ్చన్ చేస్తాడు... నాకు అలాంటి అలాట్లు లేవంటాడు మురగన్. నేను ఎవరో, ఎవరు పంపితో వచ్చానో తెలిస్తే బావోదు... అయినా మూసుకుని డబ్బు తీసుకుని పో అంటాడు మరుగన్. అప్పుడు శైలేంద్ర సైగ చేయడంతో తన వాచ్ లో టైం ఫాస్ట్ గా పెట్టి మీకు ఇచ్చిన గడువు అయిపోయింది. ఇప్పుడు నాకు డబ్బు వద్దు కాలేజీ కావాలి అంటాడు. అలాగా అని మురుగన్...MSR పీక మీద కత్తి పెట్టి తన వాచ్ కూడా చూపించి ఎవరిది కరెక్ట్ టైం అని అడుగుతాడు. భయపడిన ఎమ్మెస్సార్ మీదే కరెక్ట్ టైం అంటాడు. మర్యాదగా డబ్బులు తీసుకుని పో అని మరుగన్ అనడంతో...వెళ్లకపోతే అని క్వశ్చన్ చేస్తాడు శైలేంద్ర . వెళ్లకపోతే నాకు కావాల్సిన వాళ్లు బాధపడతారు వాళ్లు బాధపడితే నాకు కోపం వస్తుందంటాడు మురుగన్....అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావ్, నిన్ను ఎవరు పంపించారని అడుగుతాడు శైలేంద్ర.
ఎపిసోడ్ ముగిసింది...