News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Guppedanta Manasu September 15th: ఆఖరి అరగంట ఏం జరగబోతోంది - రిషి రీ ఎంట్రీతో శైలేంద్రకు చుక్కలే!

ఏంజెల్ పెళ్లిగోల ఓ వైపు...అటు కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు మరోవైపు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు సెప్టెంబరు 15 ఎపిసోడ్

నీ బాధ అర్థం చేసుకున్నాం అందుకే ఇంతకుముందుకన్నా కఠినమైన పరిస్థితులు ఎదురైనా బంధం బయటపెట్టలేదు...మాతో రా అని మహేంద్ర, జగతి పిలుస్తారు కానీ రిషి ఆలోచన మాత్రం మారదు
వసు: అక్కడ కాలేజీని ఎవరో స్వాధీనం చేసుకుంటున్నారు..మీరు ఎండీగా ఉన్నప్పుడు కాలేజీని సమర్థవంతంగా నడిపారు. మీరు బయటకు వచ్చాక కూడా కాలేజీ అంతే సమర్థవంతంగా ఉండాలి అనుకోవాలి
మహేంద్ర: మాకోసం కాదు..తాతయ్య కోసం ఆలోచించు.. దేవేంద్రభూషణ్ స్థాపించిన కాలేజిని రిషీంద్ర భూషణ్ విస్తరించాడు.. ఇప్పుడు రాకపోతే కాలేజీని పూర్తిగా కోల్పోతాం...
రిషి: నేను రిషీంద్రభూషణ్ కాదు..సాదాసీదా లెక్చరర్ ని..అక్కడకు వచ్చేందుకు నా మనసు అంగీకరించడం లేదు
వసు: మిమ్మల్ని ఎండిగా బాధ్యతలు తీసుకోమనలేదు..అక్కడ సమస్య పరిష్కరించమని అడుగుతున్నాం. మీరు అవునన్నా కాదన్నా మీరు రిషీంద్ర భూషణ్...మీరు డీబీఎస్టీ కాలేజీ ఎండీలా ఆలోచించండి..కోల్పోబోతున్న మీ సామ్రాజ్యాన్ని కాపాడ్డం మీ బాధ్యత
రిషి: నా బాధ్యత నాకు తెలుసు..మీరు గుర్తుచేయాల్సిన అవసరం లేదంటూ ఫైర్ అవుతాడు. మీరు చేసిన పనికి నేను ఆ కాలేజీలో అడుగుపెట్టనని చెప్పాను కదా.
మహేంద్ర: ఆ సమస్యను నువ్వు మాత్రమే తీర్చగలవు
రిషి: సమస్య ఏదైనా నేను ఆ కాలేజీలోకి అడుగుపెట్టను...నేను రిషిని మాత్రమే..రిషీంద్రభూషణ్ కాదు..మీ కాలేజీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎండీ జగతి మేడం సమర్థవంతురాలు..తనకి సహాయం చేసేందుకు శిష్యురాలున్నారు కదా..ఈ సమస్యను మీ మేడం  సాల్వ్ చేస్తారు కావాలంటే వాళ్లతో పాటూ మీరూ వెళ్లి చూడండని వసుతో అంటాడు
వసు: నన్ను భవిష్యత్ ఇచ్చిన కాలేజీ కష్టాల్లో ఉంది..కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను..రుణం తీర్చుకుంటాను
జగతి: ఓసారి ఆలోచించు రిషి అని కన్నీళ్లతో అడుగుతుంది జగతి
నన్ను ఇబ్బందిపెట్టొద్దని రిషి క్లియర్ గా చెప్పేయడంతో జగతి, మహేంద్ర, వసుధార వెళ్లిపోతారు...

Also Read: హ్యాట్సాఫ్ ఏంజెల్, రిషిని కాలేజీకి రమ్మని ఆహ్వానించిన జగతి-మహేంద్ర!

అక్కడ కాలేజీలో MSR హడావుడి మొదలవుతుంది..సర్దిచెప్పేందుకు ఫణీంద్ర ట్రై చేస్తాడు..ఆజ్యం పోస్తుంటాడు శైలేంద్ర...
MSR: మీరు ఇప్పటికిప్పుడు అమౌంట్ ఇవ్వండి లేదంటే అగ్రిమెంట్ ప్రకారం కాలేజీ అప్పగించండి...
ఫణీంద్ర: జగతి వాళ్లు వస్తారు కదా ఎందుకు తొందరపడుతున్నావ్
MSR: ఎవరొచ్చినా చేయాల్సింది సంతకాలు మాత్రమే..
శైలేంద్ర: ఆ రోజు మన అవసరం తీరుతుందని అలా చేశాను..కానీ ఈ రోజు ఈ పరిస్థితి వస్తుందనుకోలేదంటూ..డ్రామా స్టార్ట్ చేస్తాడు
MSR: అది మీ సమస్య..నాకేంటి..నాకు కావాల్సింది ఈ కాలేజీ...
ఫణీంద్ర: జగతి వచ్చాక తెలుస్తుంది..కాలేజీ సొంతం చేసుకుని వెళతావో అవమానంతో వెళతావా అని...
MSR: చూద్దాం అదీ చూద్దాం...
దేవయాని: వాళ్లకి యాక్సిడెంట్ అయిందన్నావ్ కదా..మరి జగతి ఫోన్లో ఎలా మాట్లాడింది
శైలేంద్ర: వాళ్లు రారు..వచ్చేలోగా సంతకాలు పూర్తవ్వాలి.. 
ఫణీంద్ర: జగతి వస్తుంది..సమస్య పరిష్కరిస్తుందని నమ్మకంగా చెబుతాడు ఫణీంద్ర
తనెలా వస్తుందని దేవాయని డౌట్ పడుతుంది...ఈ లోగా కాలేజీలోకి ఎంట్రీ ఇస్తారు జగతి, మహేంద్ర, వసుధార..... వసుధార రావడం చూసిన దేవయాని అంటే రిషి కూడా వస్తాడా అని టెన్షన్ పడుతుంది.... వాడికి తెలిసి ఉంటే వచ్చేవాడు కదా అని శైలేంద్ర అంటాడు... ఎన్ని ప్లాన్స్ తో వచ్చినా చివరకు గెలిచేది మనమే...
శైలేంద్ర-దేవయాని మాట్లాడుకోవడం చూసి..ఏం మాట్లాడుకుంటున్నారని ఫణీంద్ర అడుగుతాడు... ఇదే అవకాశంగా తీసుకుని శైలేంద్ర... రిషి దగ్గరకు వెళ్లి వస్తున్నారని ఆధారంగా ఫొటోలు చూపిస్తాడు...( పైగా రిషితో కలసి ఉన్న ఫొటో చూపించి ఇరికించేస్తాడు)

Also Read: DBST కాలేజీలోకి రిషి రీ ఎంట్రీ , శైలేంద్ర కుట్రకు జగతి చెప్పే సమాధానం ఇదేనా!

నా తమ్ముడు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచాడా అని ఫణీంద్ర బాధపడతాడు... మహేంద్ర వాళ్లు రావడంతో ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగితే..రిషి దగ్గర్నుంచే కదా అని శైలేంద్ర చెబుతాడు... 
ఫణీంద్ర: మీకు రిషి ఎక్కడున్నాడో తెలుసు..మీరు తనని కలుస్తూనే ఉన్నారు..నా దగ్గర దాచారని బాధపడతాడు. మీరు మీరు కలసిపోయి నన్నెందుకు ఒంటరివాడిని చేశారు..నేను మీ మనిషిని కాదనుకున్నారా అందుకే ఇలా చేశారా..మీరింత ద్రోహం చేస్తారని అనుకోలేదు మహేంద్ర
మహేంద్ర: అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం
ఫణీంద్ర: ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి
జగతి: నేను ఏం చేసినా నా స్వార్థం కోసం చేయనని మీకు తెలుసు..ముందు ఈ సమస్య సాల్వ్ చేద్దాం పదండి
ఫణీంద్ర: సరే అంటాడు...
ఏంటిదంతా అసలేం జరుగుతోందని దేవాయని అంటే కూల్ మమ్మీ..టెన్షన్ పడకంటాడు శైలేంద్ర
జగతి: ఏంటి మీ ప్రాబ్లెమ్
MSR: మీరు నన్ను కాదని వెళ్లలేరు
వసు: మీ నక్కజిత్తులకు ఎండీగారు భయపడరు..
MSR: ఇప్పుడు టైమ్ నాకు ఫేవర్ గా ఉంది..ఇందులో కుట్రలు కుతంత్రాలు లేవు..ఇచ్చిన మాట నిలబెట్టుకోమంటున్నాను. చూడండి మీకే అర్థమవుతుందంటూ డాక్యుమెంట్స్ ఇస్తాడు...
జగతి: నీ చేతిలో కాలేజీ పెడతామని ఎలా అనుకుంటున్నావ్..
మహేంద్ర: రేయ్ శైలేంద్ర ఎందుకిలా చేశావ్
దేవయాని: ఆ రోజు ఆ కష్టం తీరాలని ఆశపడ్డాడు
శైలేంద్ర: డాడ్ పెట్టమన్న తర్వాతే అగ్రిమెంట్ పై సంతకం పెట్టాను
జగతి: కావాలని వాళ్లిద్దరూ కలసే నాటకం ఆడుతున్నారని మహేంద్రతో అంటుంది
ఫణీంద్ర: నావల్లే ఇది జరిగింది..తప్పంతా నేనే చేశానని బాధపడతాడు ఫణీంద్ర
జగతి: మీ తప్పేం లేదు బావగారు అన్న జగతి..సంతకం పెట్టేముందు అందులో ఏముందో చూడాలి కదా
శైలేంద్ర: డబ్బు అవసరం అని హడావుడిగా వచ్చేశానని కవర్ చేస్తాడు
ఫణీంద్ర: సమస్య ఎదురైనప్పుడు ఏమీ తోచదుకదా
మహేంద్ర: ఇందులో MSR ఉన్నాడని ముందునుంచీ శైలేంద్రకి తెలుసు.. 
ఫణీంద్ర: రిషి తెలివైనవాడు MSR ఆట కట్టించాడు..కానీ శైలేంద్ర అమాయకుడు అని వెనకేసుకొస్తాడు
మహేంద్ర: నీ ముందు నీకు తెలిసే కదా జరిగింది
శైలేంద్ర: కావాలనే మీరు మా డాడీ ముందు నన్ను ఇరికిస్తున్నారు... రిషి గురించి తెలిసి కూడా చెప్పకుండా మోసం చేశారు..ఇలా ఇంకెన్ని విషయాలు దాచిపెట్టారో మాకేం తెలుసు
MSR: నాకు కాబోయే ఆఫీసులో మీ గొడవేంటి చెప్పండి..ముందు సంతకాలు పెట్టి కాలేజీ అప్పగించండి.. 
మహేంద్ర: నువ్వు పిలవగానే వచ్చింది సంతకాలు పెట్టి కాలేజీ అప్పగించడానికి కాదు
ఏం తేలుస్తారో తేల్చండని ధీమాగా అంటాడు MSR... ఈ ఇష్యూ మినిస్టర్ గారి ముందు పెడదాం అని జగతి అంటే..నాకు సెంట్రల్ మినిస్టర్ తెలుసు..ఈ అగ్రిమెంట్ కి ఎవ్వరూ పరిష్కారం చెప్పలేరని ధీమాగా ఉంటాడు...
ఫణీంద్ర బాధగా వెళ్లిపోతాడు...మహేంద్ర జగతి ఫాలో అవుతారు... ఈ విషయం అర్జెంటుగా రిషి సార్ కి చెప్పాలి అనుకుంటుంది వసుధార...

 

Published at : 15 Sep 2023 07:40 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial September 15th Episode

ఇవి కూడా చూడండి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్‌లో నాలుగో వారం ఎలిమినేషన్స్ - డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు, ఈసారి కూడా లేడీ కంటెస్టెంట్ ఔట్?

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Gundeninda Gudi Gantalu Serial : మదర్ సెంటిమెంట్‌తో 'స్టార్ మా' సరికొత్త సీరియల్ 'గుండె నిండా గుడిగంటలు'

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Telugu 7: సిగ్గు లేదా నీకు? ఇంట్లో నిన్ను ఇలాగే పెంచారా? ప్రశాంత్‌‌పై రతిక చెత్త కామెంట్స్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు- చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

Bigg Boss Gala Event: బిగ్ బాస్ గాలా ఈవెంట్, ఫుల్ ఎంటర్ టైన్మెంట్ ఇచ్చిన ఇంటి సభ్యులు-  చివర్లో ట్విస్ట్ ఇచ్చిన అమర్

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం

ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం