Guppedanta Manasu September 13th: DBST కాలేజీలోకి రిషి రీ ఎంట్రీ , శైలేంద్ర కుట్రకు జగతి చెప్పే సమాధానం ఇదేనా!
ఏంజెల్ పెళ్లిగోల ఓ వైపు...అటు కాలేజీని దక్కించుకునేందుకు శైలేంద్ర కుట్రలు మరోవైపు... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు సెప్టెంబరు 13 ఎపిసోడ్
ఈ పెళ్లి ఇష్టంలేదని రిషి ఆపేస్తాడు..షాక్ అయిన విశ్వనాథం, ఏంజెల్ ఇద్దరూ అసలు ఏంటని నిలదీస్తారు. మహేంద్ర చెప్పేలోగా ... ఇది నా సమస్య నేను పరిష్కరించుకుంటానని మధ్యలోనే ఆపేస్తాడు. నా భారాన్ని నన్ను దించుకోనీయండి అని రిషి అంటే.. మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో చెప్పండని అడుగుతాడు విశ్వనాథం. నువ్వు ఏం చెప్పాలి అనుకున్నావో చెప్పు కానీ ముందు నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టుకుందాం అని విశ్వనాథం అనడంతో..అవసరం లేదని తేల్చి చెప్పేస్తాడు రిషి.
ఏంజెల్: ఎందుకు
రిషి: నువ్వు నా ఫ్రెండ్ వి నిన్ను బాధపెట్టలేను..నా మనసు వద్దని చెప్పే ఈ పెళ్లికి సరే అనలేను
విశ్వనాథం: నువ్వు ఒప్పుకున్నాకే కదా నేనిదంతా చేశాను
రిషి: నేను ఒప్పుకోలేదు సర్..అలాగని మీరు అనుకున్నారు. నేను చెప్పాను కానీ మీరు వినలేదు నిద్రపోయారు..మర్నాడు కూడా నా మనసులో మాట చెప్పబోతుంటే మీరు వేరేలా అర్థం చేసుకున్నారు. నేను సరే అన్నాను అనుకున్నారు. అప్పుడు కూడా మీకు చెప్పాలి అనుకున్నాను మీ ఆరోగ్యం గురించి ఆలోచించి ఆగిపోయాను. నేను ఈ పెళ్లి చేసుకోనని ఎలా చెప్పాలో తెలియక రాత్రంతా ఇంటికి కూడా రాలేదు. ఈ లోగా వీళ్ల రాక యాక్సిడెంట్ చివరకు ఇక్కడికొచ్చింది. నా పట్ల మీకు ఆశలు రేగి ఉంటే అందుకు నేను బాధ్యుడిని కాదు.. నేను ఈ పెళ్లి చేసుకోలేను...
వసు, మహేంద్ర,జగతి సంతోషిస్తారు...రిషి-విశ్వనాథం షాక్ లో ఉంటారు... విశ్వనాథం అలాగే సోఫాలో కూర్చుండిపోతాడు...
విశ్వనాథం: పెళ్లి చేసుకోవా
ఏంజెల్: నువ్వు కంగారుపడకు..రిషిని ఎలా అడగాలో నాకు తెలుసు..తను నాకు కొత్తకాదంటూ.. ఎందుకు చేసుకోవు..అందుకు కారణం ఏంటో చెప్పు..నీకు తగ్గదాన్ని కాదా..
రిషి: పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు..నేనే నీకు తగను
ఏంజెల్: అందుకు నేను ఒప్పుకోను రిషి..నువ్వు తగవు అంటే అది వాళ్ల అవివేకం మూర్ఖత్వం..నేను నమ్మను రిషి నిజం చెప్పు..పెళ్లి చేసుకోమని నోరు తెరిచి అడుగినందుకు ఈ స్నేహితురాలు లోకువైపోయిందా..నా మనసు తెలుసుకుని విశ్వం ఒప్పుకున్నందుకు లోకువయ్యాడా అందుకే సాకులు చెప్పి తప్పించుకుంటున్నావ్...
రిషి: ఏంజెల్ అని గట్టిగా అరుస్తాడు రిషి..(వసు మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే జగతి ఆపేస్తుంది.. నీ భవిష్యత్ తేలే సమయం ఇది రిషిని మాట్లాడని అని చెబుతుంది...)
Also Read: ఏంజెల్ కి షాక్ ఇచ్చిన రిషి, టెన్షన్లో వసు - కొడుకు నిజస్వరూపం తెలుసుకున్న ఫణీంద్ర!
అటు కాలేజీని సొంతం చేసుకునే పనిలో ఉంటాడు MSR.. కోటి రూపాయల కోసం కాలేజీ అడగడం ఏంటని ఫణీంద్ర తరపు లాయర్ చెబుతాడు. అడిగినప్పుడు డబ్బు ఇవ్వకపోతే కాలేజీ నా సొంతం అని సంతకం చేశారుకదా అని నిలదీస్తాడు. ఆ కోటి నేను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేస్తే మంచి ఆఫర్ రెడీగా ఉంది అందుకే అడుగుతున్నా..మీరు ఇప్పుడు ఇవ్వలేరు కదా అందుకే కాలేజీ రాసిమ్మంటున్నానంటాడు. మీరు ఆరు గంటలు సమయం ఇస్తున్నా అని ఫణీంద్రకి గడువు విధిస్తాడు. ( ఇదంతా శైలేంద్ర ప్లాన్...).. ఈ లోగా కోటి రూపాయలు ఇస్తే సరే లేదంటే కాలేజీని తీసుకుంటాను...అవి కోటి రూపాయలే కానీ మీ కాలేజీ పేరు, ఇంటి పరువు కాపాడాయి..అంత సింపుల్ గా కోటిని తీసేయ్యకండి. కాలేజీ వాల్యూని బట్టి ధర్మంగానే ఇచ్చేస్తాను...ఇవేం ఫేక్ డాక్యుమెంట్స్ కాదు...మీకు టైమ్ కూడా ఇచ్చాను కదా ఆలోచించుకోండి అంటాడు MSR...
Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి
ఏంజెల్: ఎంతసేపు మౌనంగా ఉంటావ్ సమాధానం చెప్పు..నీ మౌనం తప్పులా కనిపిస్తోంది..బయటకు చెప్పుకోకూడని అంతపెద్ద కారణం ఏంటని నిలదీస్తుంది...నువ్వు చెప్పకపోతే మన స్నేహం మీద ఒట్టు....
రిషి: కొన్నిటికి కారణాలు చెప్పలేం అంటాడు...అయినా వాళ్లు పట్టుబట్టడంతో... నాకు ఆల్రెడీ పెళ్లైందని గట్టిగా అరుస్తాడు...నా భార్య కూడా ఇంకా బతికే ఉంది.
ఏంజెల్: ఇది అబద్ధం..నిజం అయితే ఇన్నాళ్లూ ఎందుకు చెప్పలేదు..నీ గతం ఏంటి తల్లిదండ్రులు ఎవరని ఎన్నిసార్లు అడిగినా ఎందుకు దాచావు, ఈ పెళ్లి విషయంలో కూడా నీతో చాలా మాట్లాడాం కానీ అప్పుడు చెప్పనివాడివి ఇప్పుడెందుకు చెబుతున్నావ్.. ఈ సాకు చెప్పి పెళ్లి ఆపేద్దాం అనుకుంటున్నావా..
రిషి: సాకులతో సమస్య పరిష్కారం అవదు..నేను చెబుతున్నది వాస్తవం
ఏంజెల్: నీ భార్య ఉంటే ఎక్కడుంది.... వసుధారా..రిషికి పెళ్లైంది అంటున్నాడు నీకు తెలుసా... చెప్పు అని గట్టిగా అడుగుతుంది.. వసు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది...అయినా నాకే తెలీదు నీకేం తెలుస్తుందిలే అంటూ..సార్ మీకు కచ్చితంగా తెలిసే ఉంటుందని మహేంద్ర, జగతిని అడుగుతుంది... అందరూ రిషి వంక చూస్తుండిపోతారు కానీ నోరు మెదపరు... రిషి భార్య ఎక్కడుందని గట్టిగా అడుగుతుంది ఏంజెల్... మీకు తెలిసినా చెప్పరని నాకు తెలుసు..రిషి దీనికి సమాధానం నువ్వు మాత్రమే చెప్పగలవు..ఇంకెవరూ చెప్పలేరు..నీ భార్య ఎవరు.. తన పేరేంటి..మూడేళ్లుగా తన దగ్గరకు ఎందుకు వెళ్లడం లేదు...తనెందుకు నీ దగ్గరకు రావడం లేదు చెప్పు..నువ్వు విడిపోయావా, తనని వద్దనుకున్నావా...వదిలేశావా..లేకపోతే తనే నిన్ను వదిలేసిందా అని అడుగుతూనే ఉంటుంది..
రిషి: అన్నీ పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకు..
Also Read: ఈ రోజు ఈ 6 రాశులవారికి లక్కు కలిసొస్తుంది, సెప్టెంబరు 13 రాశిఫలాలు
ఎంతసేపు ఇలా మాట్లాడకుంటా ఉంటారని MSR నిలదీస్తాడు.. కాలేజీ ఎండీ జగతి తనే ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెబుతాడు ఫణీంద్ర. ముందు జగతి మేడంని పిలవండి అంటాడు ( వాళ్లు లేని టైమ్ చూసి శైలేంద్ర స్కెచ్ వేసిన సంగతి ఫణీంద్రకు తెలియదు)...
శైలేంద్ర: మీరు అనుకున్నట్టు పిన్ని, బాబాయ్ రారు..వాళ్లు గాల్లో కలసి పోయాయని అనుకుంటాడు
ఇంతలో దేవయాని ఎంట్రీ ఇచ్చి..ఇక్కడ ఏదో జరుగుతోందంట అంటూ డ్రామా స్టార్ట్ చేస్తుంది.. నీకెవరు చెప్పారని అడిగితే..శైలేంద్ర చెప్పాడంటుంది...మన అవసరాన్ని, శైలేంద్ర ఆత్రాన్ని MSR వాడుకున్నాడని ఫణీంద్ర చెబుతాడు. అసలు ఈ ప్రాబ్లెమ్ నుంచి బయటపడడం ఎలా అని లేనిపోని కంగారు నటిస్తుంది దేవయాని... ఆ అగ్రిమెంట్ కి సమాధానం ఎవరు చెబతారని మరింత ఇరికించే ప్రయత్నం చేస్తుంది దేవయాని... జగతి చెబుతుందని స్ట్రాంగ్ గా రిప్లై ఇస్తాడు ఫణీంద్ర... జగతి వల్ల ఏదైనా సాధ్యం అవుతుంది. డీబీఎస్టీ కాలేజీ గురించి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేస్తుందని పక్కాగా చెబుతాడు ఫణింద్ర... నీకు కాలేజీ అప్పగించడం కాదు కదా నిన్ను ఇంకోసారి DBST కాలేజీ పరిసరాల్లోకి రాకుండా చేస్తాం అని చెప్పి..జగతికి కాల్ చేస్తాడు ఫణీంద్ర... ( టైమ్ వేస్ట్ ఎందుకు డాడ్...పిన్ని వాళ్లు రారు అనుకుంటాడు శైలేంద్ర)