Prime Minister Modi Puttaparthi tour: ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన - ఏపీ బీజేపీ నేతల్లో జోష్
PM Modi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలకు పుట్టపర్తి రావడంతో రాయలసీమ బీజేపీ నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు విష్ణువర్ధన్ రెడ్డి స్వాగతం పలికారు.

Prime Minister Modi visit to Puttaparthi: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టపర్తి పర్యటన ఏపీ బీజేపీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపింది. ప్రోటోకాల్ స్వాగతం చెప్పేందుకు జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కొద్ది సేపు ముచ్చటించారు. సత్యసాయిబాబా ఆశీర్వాదం ప్రధాని మోదీపై ఉంటుందని విష్ణువర్దన్ రెడ్డి. ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి ..జాతీయ స్థాయిలో మోదీ టీమ్ లో పలు మార్లు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినప్పుడు కీలక బాద్యతలు అప్పగించేవారు. ఈ క్రమంలో ప్రదాని మోదీకి విష్ణువర్ధన్ రెడ్డిపై ప్రత్యేక అభిమానం ఉంది.
ప్రధాని మోదీ సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రత్యేకంగా వచ్చారు. మరే ఇతర రాజకీయ కార్యక్రమాలు పెట్టుకోలేదు. తాను బయలుదేరే ముందే సోషల్ మీడియాలో సత్యసాయితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు.
పుట్టపర్తి, శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. కార్యక్రమంలోని కొన్ని దృశ్యాలను మీతో పంచుకుంటున్నాను. pic.twitter.com/zVwL6FOHTe
— Narendra Modi (@narendramodi) November 19, 2025
పుట్టపర్తిలో జరిగిన శతజయంతి వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆయనను సత్కరించారు. మాజీ క్రికెట్ స్టార్ సచిన్ టెండూల్కర్, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్, కేంద్ర మంత్రులు రామ్ మోహన్ నాయుడు కిన్జరాపు, జి. కిషన్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విష్ణువర్ధన్ రెడ్డి సహా అనేక మంది ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీ పుట్టపర్తికి చేరే మార్గంలో రోడ్ షో నిర్వహించారు. రహదారులు రెండు పాళ్లలా ప్రజలు ఉండి, "మోదీజీ కి జై" అను నినాదాలతో ఆయనకు అభివాదాలు చేశారు.
ప్రధాని మోదీ పుట్టపర్తికి వచ్చినందుకు మేమంతా సంతోషిస్తున్నాం. సత్యసాయిబాబా ఆశీస్సులు ఆయనతో ఉండాలని, దేశ ప్రగతికి ఆయన నాయకత్వం మరింత బలపడాలని కోరుకుంటున్నామని విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు. బీజేపీ నేతగా ఆయన గతంలోనూ ప్రధాని మోదీని ఆంధ్రప్రదేశ్‌కు ఆహ్వానించిన సందర్భాలు ఉన్నాయి. 2023 మేలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభానికి, పబ్లిక్ మీటింగ్‌లకు ఆయనను ఆహ్వానించారు. ఈసారి సత్యసాయిబాబా శతజయంతి సందర్భంగా స్వాగతం పలికడం బీజేపీలో ఆయన పాత్రను మరింత హైలైట్ చేసింది. సత్యసాయి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు సత్యసాయిబాబా సందేశాలను ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలని, ఆయన ఆదర్శాలను అమలు చేయాలని పిలుపునిచ్చారు.






















