అన్వేషించండి

Bandi Sanjay About Naxalism: నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే... అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారు: బండి సంజయ్

అమాయక నక్సలైట్లను రెచ్చగొట్టి వాళ్ల చావులకు అర్బన్ నక్సల్స్ కారకులవుతున్నారని.. నక్సలైట్లు చనిపోతే వాళ్ల తల్లిదండ్రుల, భార్య, భర్తల గుండె కోత మీకేం తెలుసు అని బండి సంజయ్ ప్రశ్నించారు.

దళిత, గిరిజన, ఆదివాసీల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని వారిని రెచ్చగొట్టి నక్సలైట్లుగా మార్చిన అర్బన్ నక్సలైట్లే వారి చావులకు కూడా బాధ్యత వహించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. అమాయక నక్సలైట్లు అడవుల్లో ప్రాణాలు కోల్పోతుంటే, మరోవైపు ఈ అర్బన్ నక్సలైట్లు మాత్రం ఆస్తులు కూడగట్టుకుని, ప్రభుత్వ నామినేటెడ్, కమిషన్ పదవుల్లో కొనసాగుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడటమే తమ సిద్ధాంతమని పదేపదే చెప్పుకునే అర్బన్ నక్సలైట్లు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు పదవుల్లో కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

అర్బన్ నక్సల్స్‌కు వారి గుండెకోత తెలియదా.. 
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పోలింగ్ బూత్ అధ్యక్షులు, కార్యదర్శులు ఆపై స్థాయి నాయకుల సమావేశంలో పాల్గొనేందుకు హుజురాబాద్ విచ్చేసిన సందర్భంగా నక్సలిజం, అర్బన్ నక్సలైట్లపై తీవ్రంగా స్పందించారు. మావోయిజంపై బీజేపీ వైఖరిని స్పష్టం చేస్తూ, అధికారంలో ఉన్నా లేకున్నా మావోయిజానికి బీజేపీ వ్యతిరేకమని, తుపాకీ ద్వారా రాజ్యాధికారం అసాధ్యం. ప్రజలు దాన్ని హర్షించబోరని తాము మొదటి నుంచీ చెబుతూ వస్తున్నామని, నేడు అదే నిజమైందని అన్నారు. మావోయిస్టుల పేరుతో అమాయకులను బలి తీసుకున్నారని, అమాయక పిల్లలను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారణం అర్బన్ నక్సల్స్ మాత్రమేనని ఆయన నొక్కి చెప్పారు. ఈరోజు చనిపోయిన కుటుంబాలకు ఈ అర్బన్ నక్సల్స్ ఏం జవాబు చెబుతారని ప్రశ్నించారు. పిల్లలు చనిపోతే తల్లిదండ్రుల గుండె ఎంతగా శోకిస్తుందో, భర్త చనిపోతే భార్య, భార్య చనిపోతే భర్త ఎంత దు:ఖానికి గురవుతారో ఈ అర్బన్ నక్సల్స్‌కు తెలియదా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నక్సలైట్ల మృతికి అర్బన్ నక్సల్స్ బాధ్యత వహించాలి
తాను అర్బన్ నక్సలైట్ల విషయంలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. మీడియా, సోషల్ మీడియా ద్వారా రెచ్చగొడుతున్న అర్బన్ నక్సల్స్ అమాయక మావోయిస్టుల చావుకు మీరే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. పౌర హక్కుల సంఘం నాయకులతో సహా ఈ అర్బన్ నక్సల్స్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, పాలకులు ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపడితే, ప్రజలకు నష్టం జరిగితే ఉద్యమాలు చేయాలనేది మీ సిద్ధాంతం అయినప్పుడు, అట్లాంటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవుల్లో, కమిషన్ పోస్టుల్లో ఎలా భాగస్వాములయ్యారని ప్రశ్నించారు. మహిళలకు నెలకు రూ.2500లు ఇస్తామన్న హామీ, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్ హామీ, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన అనేక హామీలు ఇచ్చారా అని నిలదీశారు. అందుకే అర్బన్ నక్సల్స్ పైరవీలు చేస్తూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆస్తులు కూడగట్టుకుంటున్నారని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ భారతదేశాన్ని ఆర్థిక ప్రగతిలో 4వ స్థానానికి చేర్చిందని, విదేశాధి నేతలే మోదీకి సాష్టాంగ పడుతుంటే ఈ అర్బన్ నక్సల్స్‌కు కన్పించదా అని ప్రశ్నించారు. అడవుల్లోని అన్నలకు ఆయన విజ్ఞప్తి చేస్తూ, అర్బన్ నక్సల్స్ మిమ్ముల్ని రెచ్చగొడుతున్నారని, వాళ్లు ఆస్తులు కూడగడుతూ పదవులు అనుభవిస్తున్నారని, వారి మాటలు నమ్మి మోసపోవద్దని కోరారు. 

2026 మార్చి నాటికి మావోయిస్టులు అంతం..
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క మాట ఇస్తే తప్పరని, వచ్చే మార్చి నాటికి మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని బండి సంజయ్ హెచ్చరించారు. దయచేసి నక్సలైట్లంతా లొంగిపోవాలని, వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి సాయం అందిస్తామని, వారు సంతోషంగా జీవించవచ్చని హామీ ఇచ్చారు. నక్సలిజాన్ని ఎవరు సమర్థించినా వాళ్లు కూడా నేరస్తులేనని, మావోయిస్టులే తుపాకులు వదిలి జన జీవన స్రవంతిలో కలుస్తుంటే, అందుకు భిన్నంగా అర్బన్ నక్సల్స్ తుపాకులు పట్టండి, మావోయిస్టుల్లో చేరండి అంటే ఊరుకుంటామా, అది సమర్థనీయమా అని ప్రశ్నించి, వారి విజ్ఞతకే ఆ నిర్ణయాన్ని వదిలేస్తున్నానని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP COVID Cases: ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
ఏపీలో కరోనా మరణాలు కలకలం.. ఒమిక్రాన్ RF.5 వేరియంట్‌గా గుర్తింపు, ఇది అంత ప్రమాదకరమో ?
Irans Fattah Missiles: ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
ఇరాన్ మిస్సైల్స్ ఫతా-1, ఫతా-2 ఎంత ప్రమాదకరం.. వీటి ప్రత్యేకతలు, దాడి టెక్నిక్ వివరాలివే
PM Modi: స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
స్కైరూట్‌ విజయంపై హర్షం.. 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడనంటూ ప్రతిపక్షనేతపై ప్రధాని మోదీ సెటైర్లు
AP Local Body Elections Coalition Conflict: ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
ఏపీ లోకల్ పోల్స్ - కూటమికి కూటమితోనే పోటీ! టీడీపీ, జనసేన ద్వితీయ శ్రేణి నేతల టగ్ ఆఫ్ వార్ తప్పదా?
కొత్త రెనాల్ట్ డస్టర్ రోడ్‌ టెస్ట్‌ రివ్యూ - డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌, సేఫ్టీ, మైలేజ్‌ పూర్తి సమీక్ష
కొత్త రెనాల్ట్ డస్టర్ రియల్‌ రోడ్ టెస్ట్ - స్టైలిష్ లుక్‌ అదిరింది, కానీ మైలేజ్‌లో నిరాశ!
This Week OTT Movies : ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
ఒకే రోజు ఓటీటీల్లో 12 మూవీస్ - ఈ వారం ఈ సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో ట్రైనీ మహిళా ఐపీఎస్‌‌కు లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Varun Tej : చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
చేతికర్రతో ఈవెంట్‌కు వచ్చిన మెగా హీరో - వరుణ్ తేజ్ డెడికేషన్‌కు ఫిదా... వీడియో వైరల్
Embed widget