Guppedanta Manasu March 17th: పొద్దున్నే ఏంటిది రిషి సార్, ఎండీ ఎప్పటికైనా నావాడే అని దేవయానితో వసు సవాల్!
Guppedantha Manasu March 17th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు మార్చి 17 ఎపిసోడ్
వసుధారని బుక్ చేద్దామని దేవయాని ప్లాన్ చేసి సత్యనారాయణ వ్రతం ప్లాన్ చేస్తుంది.. రిషి మాత్రం మహేంద్ర-జగతిని పీటలపై కూర్చోమంటాడు. ఆ తర్వాత వసు-రిషి ఇద్దరూ రూమ్ లో ఇద్దరి మధ్యా జరిగిన సంభాషణ గుర్తుచేసుకుంటారు. ఈ వ్రతం మనం చేయడం లేదు.. నేను పెద్దమ్మకి చెబుతానంటాడు రిషి. ఎట్టకేలకు వ్రతం పూర్తవుతుంది
వసు: అన్నింటా నాకు తోడుగా ఉండే రిషి సార్ ఈ తాళి విషయంలో కష్టపెడుతున్నారు..న్యాయం చేయి స్వామి
రిషి: తాళి విషయంలో వసు తొందరపడింది..ఈ దూరం ఎన్నాళ్లు
మహేంద్ర: వసు-రిషిని తొందరగా కలుపు దేవుడా
జగతి: వసు-రిషి వాళ్లకు వాళ్లే సమస్యగా మారారు...ఆ సమస్యను నువ్వే తీర్చాలి
ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు అందరికీ ఎంతో పుణ్యం..ప్రసాదం అందరికీ పంచండి అని చెప్పడంతో ధరణి అందరకీ ప్రసాదం పెడుతుంది.. ధరణి ఇస్తుంటే దేవయాని ప్రసాదం తీసుకోపోవడంతో రిషి బతిమలాడతాడు...
దేవయాని: నా ప్లాన్లు తల్లకిందులు చేశావు కదా అని మనసులో అనుకుంటూ.. నా బాధ ఏంటో తెలిసి కూడా నువ్విలా చేస్తావనుకోలేదు.. నిన్ను వసుధారని పీటలపై కూర్చోబెట్టాలని కోరుకున్నాను నా కోరిక తీరకుండా చేశావుకదా.. నేను నీతో మాట్లాడను
రిషి: మీరు అలా అనొద్దు..నా కారణంగా నీకు నిరాశ కలిగినందుకు బాధగా ఉంది.. ఇంకోసారి నన్ను అడగకుండా ఇలాంటివి చేయొద్దంటూ ప్రసాదం ఇస్తాడు...
Also Read: వసుధారకి క్లారిటీ ఇచ్చి దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, వ్రతం పీటపై జగతి-మహేంద్ర
ఆ తర్వాత వసుధార రూమ్ కి వెళుతుంది దేవయాని
దేవయాని: నువ్వింకా పడుకోలేదా.. జరిగింది తలుచుకుంటే నాకే ఎలాగో ఉంది..ఇక నీకు నిద్ర ఎలా పడుతుందిలే
వసు: ఏమంటున్నారు మీరు
దేవయాని: ఇంకా ఎందుకు నటిస్తున్నావ్..నువ్వేంటో నీ స్థాయి, స్థానం ఏంటో స్పష్టంగా అర్థమైంది అనుకుంటా.. లోకం దృష్టిలో మాత్రమే రిషికి భార్యవి.. ఈ ఇంట్లో నువ్వొక అతిథివి మాత్రమే..అర్థమైందా.. క్లారిటీ వచ్చిందా.. ఈ ఇంట్లో నీ ప్లేసేంటో... సప్తసముద్రాలు ఈది వచ్చి మురికి గుంటలో పడిపోయాడంట..అలా ఉంది నీ పరిస్థితి.. తెలివైనదానివని గర్వం కదా..నీ తెలివి ఎక్కడుంది.. పూజలో కూర్చోలేదు కదా
వసు: నవ్వుతుంటుంది
దేవయాని: ఎందుకు నువ్వుతున్నావ్
వసు: చిటెకె వేయడం నాక్కూడా వచ్చు..పెద్దవారు నేను అలా చేయలేను.. మీరు ఏదో ఊహించుకుని సంబరపడుతున్నారు.. రిషి -వసు బంధం ఎప్పటికీ చెక్కు చెదరదు.. అయినా మేడం ఒకరు సంతోషంగా ఉంటే సంతోషించాలి.. ఒకరికన్నీటితో దాహం తీర్చుకోవాలని ఆలోచించకూడదు..
దేవయాని: నేను అలా ఆలోచించను
వసు: మీరేంటో మీ ఆలోచనలేంటో నాకు తెలుసు మీకు తెలుసు. మీరేదో ఊహించుకుని, నాకు అవమానం జరిగిందని ఏడుస్తుంటానని ఊహించారు కదా.. బాధపడుతుంటే చూసి ఓదార్చి వెళదామని వచ్చారు కదా మేడం.. నా పేరు వసుధార.. చిన్న చిన్న వాటికే కుంగిపోతానా.. రిషి సార్ నా గుండెల్లో ఉన్నారు.. మా ఇద్దరి మధ్యా ఉన్న అభిప్రాయ బేధాలు త్వరలోనే పోతాయి
దేవయాని: ఎప్పటికైనా ఈ ఇంటి గడప దాటతావు..గుమ్మం బయటే నీ బతుకు
వసు: అంత అత్యాశ పనికికాదు... అదే గడపలో ఈ అమ్మాయిని పెళ్లిచేసుకుంటానని రిషి సార్ చెప్పారు.. అందరి ముందు తాళి విషయంలో జగతి మేడం చెప్పారని రిషి ఒప్పుకున్నాడు.. అయినా గుమ్మం బయటకు నేనెందుకు వెళతాను... నిద్ర వస్తోంది మేడం.. గుడ్ నైట్.. అయినా మీకు నిద్ర పడుతుందో లేదో.. ట్రై చేయండి.. వెళ్లండి మేడం... రిషి సార్ మనసులో ఒకటి సమస్యగా మిగిలిపోయింది అది పరిష్కారం కాకపోదు అంతమాత్రాన నేనెందుకు భయపడతాను.. నా ప్రిన్స్ నా ఎండీ నావాడే కదా..మీరు వెళ్లండి మేడం వెళ్లి పడుకోండి...
Also Read: మార్చి 17 రాశిఫలాలు, ఈ రాశివారి కొంచెం కష్టపడినా మంచి ఫలితం పొందుతారు
రిషి సార్ ఇంకా నిద్రలేవలేదు.. కాలేజీకి టైమ్ అవుతోంది.. లోపలకు వెళ్లాలా వద్దా అని తిరుగుతుంటుంది.. ఇంతలో జగతి వచ్చి అది రిషి గది.. లోపలకు వెళితేనే అది మీ ఇద్దరి గది అవుతుంది అంటుంది..ఆలోచనలో పడిన వసుధారకు జగతి సర్దిచెప్పి గదిలోకి నెట్టేసి వెళ్లిపోతుంది. రిషి మంచి నిద్రలో ఉంటాడు..వెళ్లి అలా చూస్తూ కూర్చుంటుంది..నిద్రలేచి పక్కనే వసుధారని చూసి నువ్వేంటి ఇక్కడ అని ఉలిక్కి పడి కూర్చుంటాడు..
రిషి: నువ్వేంటి ఇక్కడ
వసు: మీరు నిద్రలేవలేదు.. కాలేజీకి టైమ్ అవుతోందని...
రిషి మంచంపైనుంచి లేచి.. కుర్చీలో కూర్చున్న వసు దగ్గరకు వెళ్లి...కాసేపూ చూస్తూ ఉండిపోయి.. ఆ తర్వాత తన జుట్టుకి పెట్టుకున్న దువ్వెన తీస్తాడు.. వసు తీసుకుంటుండగా దువ్వెన కింద పడుతుంది..కిందకు వంగి అది తీస్తుండగా వసు మెడలో తాళి బయట పడుతుంది. వీఆర్ ఉంగరం చూసిన రిషి.. ఈ అక్షరాలు రెండూ పక్కపక్కనే..మనిద్దరం ఎదురెదురుగానే..నేను రెడీ అవుతాను నువ్వెళ్లు అని పంపించేస్తాడు..
ధరణి వంటచేస్తుంటే.. వసుధార వెళుతుంది.. అత్తయ్యగారూ కాఫీ ఇమ్మంటారా అంటుంది ధరణి. వచ్చింది నేను అంటుంది వసుధార. అందర్నీ మేడం అంటే ఎలా..వరసలు పెట్టి పిలిస్తే కదా బంధం దగ్గరవుతుందని చెబుతుంది. కోడలిగా ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి కదా అని ధరణి అంటే.. ఇలా పిలిచే రోజు త్వరలోనే వస్తుందనుకుంటున్నా అని రిప్లై ఇస్తుంది వసు. మిమ్మల్ని అలా పిలవాలంటే రిషి సార్ అనుమతి కావాలి.. ఆయన నాకు భర్తే కానీ నేను తనకి భార్యను కాదు.. మరి ఎలా అవుతానో తెలియాని అనేసి వెళ్లిపోతుంది..
రిషి-వసు ఎవరి రూమ్ లో వాళ్లు అద్దంలో చూసుకుని మాట్లాడుకుంటారు....