Guppedanta Manasu March 16th: వసుధారకి క్లారిటీ ఇచ్చి దేవయానికి షాక్ ఇచ్చిన రిషి, వ్రతం పీటపై జగతి-మహేంద్ర
Guppedantha Manasu March 16th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు మార్చి 16 ఎపిసోడ్
వ్రతం పేరుతో వసు-రిషిని బుక్ చేయాలని స్కెచ్ వేస్తుంది దేవయాని. జగతితో మాట్లాడి తన రూమ్ లోకి తీసుకెళుతుంది..జగతి మనసులో ఏదో అనుమానం మొదలవుతుంది
దేవయాని: ఏంటి జగతి నిన్న మొన్నటి వరకు ధైర్యంగా కనిపించావు ఈరోజు టెన్షన్ పడుతున్నావు
జగతి: అదేం లేదు అక్కయ్య
దేవయాని: పళ్లెంలో చీర, పంచె తీసుకొచ్చి ఇచ్చి నువ్వు-మహేంద్ర కలసి కొత్తదంపతులకు ఇవి ఇవ్వండి... వారితో వ్రతం చేయించాలని అనుకుంటున్నానని అంటుంది. నీకంటే ఎలాగూ ఈ ఆచారాలు సంప్రదాయాలు పెద్దగా పట్టించుకోవు కదా అందుకే నేను చూసుకుంటున్నాను ఈ వ్రత ఫలితం వాళ్లకు మాత్రమే కాకుండా మన కుటుంబం మొత్తానికి కలుగుతుంది
జగతి: ఇలా చేస్తే రిషికి వసుపై కోపం వస్తుంది..వాళ్లిద్దరి మధ్యా దూరం పెంచాలన్నది అక్కయ్య ప్లాన్ అనుకుంటూ ఆ బట్టలు తీసుకుంటుంది
దేవయాని: ఇప్పుడుంటుంది జగతి అసలు కథ అని నవ్వుకుంటుంది దేవయాని
అక్కడి నుంచి జగతి..రూమ్ కి వెళ్లి మహేంద్రకి చెబుతుంది...
మహేంద్ర: వదినగారు కావాలనే మనల్ని ఇరికించారు...ఇలా చేయడం కుదరదని చెప్పేద్దాం...
జగతి: ఇలాంటప్పుడు ఈ విషయంలో గొడవ చేయడం కరెక్ట్ కాదు..అక్కయ్య ఆలోచనకు మనం భయపడొద్దు..అడుగు వెనక్కు వేయొద్దు
మహేంద్ర-జగతి ఇద్దరూ వసుధార రూమ్ కి వెళతారు...
Also Read: వ్రతం పేరుతో దేవయాని కొత్త స్కెచ్, రిషి-వసు ఏం సమాధానం చెబుతారు!
చేతిలో బట్టలు చూసి ఇవేంటని అడుగుతుంది వసుధార
జగతి: తీసుకో వసు అక్కయ్య గారు ఇచ్చారు...నువ్వు రిషి ఇద్దరు దంపతుల్లా పీటల మీద కూర్చోవాలి
వసు: ఇది ఎలా సాధ్యం . మేడం మేం దగ్గరగా ఉన్నామన్న మాటే కానీ ఇద్దరి మధ్య తెలియకుండానే దూరం ఉంది. రిషి సార్ కూడా మనసులో ఏదో తెలియని విషయంలో బాధపడుతున్నారు. రిషి సార్ కోపం గురించి మీకు తెలుసు. ఇప్పుడు మేం ఇద్దరం ఇలా భార్యాభర్తలు గా కూర్చోవాలి అంటే మా మధ్య ఉన్న దూరం అమాంతం పెరిగిపోతుంది
జగతి: ఇలా అయినా మీ మధ్య దూరం తగ్గుతుందని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు. రిషి ఒప్పుకోడని ఎందుకు అనుకుంటున్నావు
దేవయాని అక్కయ్య మీద ఉన్న ప్రేమతో కాదనడేమో. భయపడకుండా ఇది ఒక మంచి అవకాశంగా భావించి ముందడుగు వేయి వసు ఏది జరిగితే అది జరుగుతుంది
వసుధార చేతిలో ఆ బట్టలు పెట్టేసి వెళ్లిపోతారు. ఆ తర్వాత వసుధార...రిషి ఎదురుగా నిలబడి ఆ బట్టల వైపు చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది.
రిషి: ఏం మాట్లాడుతున్నావ్ వసుధారా
వసు: దేవయాని మేడం అంటుండగా
రిషి: లోకం దృష్టిలో మనం భార్యాభర్తలమే కానీ అసలు నిజం ఏంటో మనిద్దరికీ తెలుసు నువ్వే చెప్పు వసుధార మనిద్దరం ఆ పీటల మీద ఎలా కూర్చుంటాము .నువ్వే మనస్ఫూర్తిగా చెప్పు వసుధార మనం భార్యా భర్తలము అయ్యామా
వసుధార ఆలోచనలో పడుతుంది.
రిషి: ఈ ఆలోచన నిజంగా పెద్దమ్మదేనా. ఒకసారి నువ్వే ఆలోచించు మనిద్దరం దంపతుల్లా పక్క పక్కన కూర్చుందామా ?నువ్వు సిద్ధంగా ఉన్నావా ?
ఇలా చేయడానికి మనకు నిజంగా అర్హత ఉందని నువ్వు భావిస్తున్నావా?
వసుధార ఏం మాట్లాడాలో తెలియక ఆలోచనలో పడుతుంది.
Also Read: మార్చి 16 రాశిఫలాలు, ఈ రోజు ఈ రాశివారికి సంపద, ప్రతిష్ట పెరుగుతాయి
రిషి-వసు
రిషి:ప్రేమకు రెండు మనసులు ఉంటే చాలు కానీ పెళ్లికి రెండు కుటుంబాలు ఉంటేచాలు.. ప్రేమకి సంప్రదాయం అవసరం లేదు కానీ పెళ్లికి కావాలి. నువ్వొకటి నమ్మావు ఆ నమ్మకాన్ని నేను గౌరవించాను..అది నీపై, మనప్రేమపై ఉన్న గౌరవం..నమ్మకం నిలబెట్టడం ఇంత కష్టమా అనిపిస్తోంది. నమ్మకాన్ని గౌరవించడమే బాధ
వసు: ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు
రిషి; సమస్య నీది నాది అనే పరిధి దాటి ఎక్కడికో వెళ్తోంది..ఎంతమందికి అబద్ధాన్ని నిజంగా చూపిద్దాం..ఆఖరికి దేవుడి పూజలో కూడా అయితే ఎలా చెప్పు
వసు: ఈ తాళి నా మెడలో మనస్ఫూర్తిగా పడింది..
రిషి: నేను కోపంతో ఈ మాట చెప్పలేదు..బాధతో చెబుతున్నాను
వసు: ఇది దేవయాని మేడంగారు ఇచ్చారుకదా
రిషి: నేను పెద్దమ్మతో చెబుతాను..ఈ పూజ మనం చేయడం లేదు...
అలా ఇద్దరూ నిర్ణయం తీసుకుని..దేవయానికి రివర్స్ షాక్ ఇచ్చారన్నమాట....