అన్వేషించండి

Guppedanta Manasu June 30th: వసు మదిలో ఉన్నా గదిలోకి వెళ్లలేకపోతున్న రిషి, దేవయాని - శైలేంద్రకి షాకిచ్చిన మహేంద్ర

Guppedantha Manasu June 30th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి ఇంట్లోంచి వెళ్లిపోయాడు, జగతిపై మహేంద్ర కోపం కంటిన్యూ అవుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..

గుప్పెడంతమనసు జూన్ 30 ఎపిసోడ్

ఇంట్లో ఏం జరిగిందో మొత్తం జగతి నుంచి తెలుసుకున్న మహేంద్ర అన్నీ అడిగేస్తానంటాడు. కానీ జగతి మాత్రం వద్దని ఆపుతుంది. రిషి ఇంటికి వచ్చేవరకూ ఈ సమస్యకు పరిష్కారం దొరకదు ప్రస్తుతం మనం బావగారి పరిస్థితి గురించి ఆలోచించాలి. ఆయన ఆరోగ్యం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే జరగరాని అనర్థాలు జరుగుతాయి.. నా మాట విను.. ఈ విషయం గురించి నీ అంతట నువ్వు బయటపెడితే రిషి మీద ఒట్టే.. గుర్తుపెట్టుకో’ అంటూ మహేంద్రను ఆపేస్తుంది. వసు కనిపించింది అన్నావ్ కానీ.. ఎక్కడుందో చెప్పలేదు. చెప్పు ప్లీజ్.. వసు ఎక్కడుంటుంది? తనకు రిషి గురించి కచ్చితంగా తెలిసే ఉంటుంది. ప్లీజ్ ఈ విషయం చెప్పు’ అంటూ వేడుకుంటుంది. 
మహేంద్ర: రిషి ఎక్కడున్నాడో తెలిసింది జగతి  
జగతి: ‘అవునా ఎక్కడున్నాడు? నీకు ఎలా తెలిసింది? కలిశావా? మాట్లాడావా? తన కోపం తగ్గిందా? నా గురించి అడిగాడా? చెప్పు మహేంద్ర ప్లీజ్’ అంటూ కంగారు కంగారు కళ్లనిండా నీళ్లతో అడుగుతుంది.
మహేంద్ర: కలవలేదు జగతి. కలిసే ధైర్యం చెయ్యలేదు. రిషికి ఇంకా కోపం అలానే ఉంది. అదే బాధలో ఉన్నాడు. నేను కలిస్తే అటు నుంచి ఎటు పారిపోతాడో అనే భయంతో కలవకుండా ఆగిపోయాను. వాడు గొంతు మాత్రం విన్నాను జగతి. తన మాట వినగానే నా మనసు కొంచెం కుదుటపడింది. స్వార్థం వల్ల నిందలు పాలైన మన కొడుకు ఒంటరి వాడు అయిపోయాడు. మన రిషి మన దగ్గరకు రావాలి. తన మీద పడిన నింద తొలగిపోయి రాజకుమారుడిగా ఈ ఇంటికి రావాలి’ అంటాడు మహేంద్ర. 
జగతి: వస్తాడు మహేంద్ర. మనమే తీసుకొద్దాం

Also Read: జూన్ 30 'వాసుదేవ ద్వాదశి', తొలి ఏకాదశి మర్నాడు వచ్చే ఈ రోజు ప్రత్యేకత ఇదే!

ఇక ఏంజెల్ ఇంట్లో వసు ఓ గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. రిషి మరో గదిలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ‘నేను ఇక్కడున్నానని రిషి సార్‌కి తెలిస్తే ఏం అనుకుంటారో?’ అని వసు అనుకుంటుంది. ఇంతలో రిషికి ఆసుపత్రిలో వసు చేతి బ్రాస్లెట్ తన చేతి బ్రాస్లెట్‌కి చిక్కుకున్నసీన్ గుర్తొస్తుంది. ఇంతలో ఏంజెల్ వసు దగ్గరకు వచ్చి ‘వసు టాబ్లెట్ వేసుకున్నావా? అయ్యో వేసుకోలేదుగా? ఇదిగో వేసుకో’ అని ఇస్తుంది. టాబ్లెట్ వేసుకున్నాక.. ‘నీ నవ్వు భలే ఉంటుంది వసు’ అంటుంది ఏంజెల్. నవ్వుతుంది వసు ‘నా దగ్గర ఎప్పుడూ ఇలానే ఉండాలి మరి ఇప్పుడే వస్తాను’ అంటూ రిషి రూమ్‌కి వెళ్తుంది ఏంజెల్. రిషి పుస్తకం ముందు పెట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడూ ఇలానే మూడీగా ఉంటావా? కనీసం ఇంట్లోకి ఎవరొస్తున్నారు ఎవరు వెళ్తున్నారు కూడా చూడవా నువ్వు? సరే నాతో రా’ అంటూ రిషి చేయి పట్టుకుని వసు రూమ్‌కి తీసుకెళుతుంది. రూమ్‌లోకి అడుగుపెట్టగానే వసుని చూసి రిషి షాక్ అవుతాడు. 
ఏంజెల్: తనని నేనే తీసుకొచ్చాను. అంత దూరంలో ఉన్న తన ఇంటికి ఎందుకులే అని వాళ్ల నాన్నకు చెప్పి తీసుకొచ్చాను. తను మాత్రం నువ్వు ఏం ఫీల్ అవుతావోనని ఇక్కడ ఉండటానికి ఇబ్బంది పడుతోంది.
రిషి: ఎవరో ఈ ఇంట్లో ఉంటే నేనెందుకు ఫీలవుతాను ఏంజెల్? ఎవరి రూమ్ వారిది కదా మధ్యలో గోడలున్నాయి
ఏంజెల్: అదేంటి రిషి అలా అంటావ్ మీ కాలేజ్ లెక్చరరే కదా తను. రేపు తనకు సమస్య వస్తే అలానే వదిలేసి వెళ్తావా. 
వసు: సార్ అలా వదిలేసే రకం కాదు ఏంజెల్. అలా వదిలేసే వారే అయితే నన్ను ఆసుపత్రికి ఎందుకు తీసుకుని వెళ్తారు. నా బిల్ ఎందుకు కడతారు
ఏంజెల్: ఏంటయ్యా బాబు నువ్వు ఇంత సాయం చేసి మళ్లీ ఏం తెలియనట్లు సైలెంట్‌గా ఉంటావ్. అయినా ఇంత ట్విస్ట్ ఇచ్చావేంటీ రిషీ.
రిషి: తనే కాదు తన స్థానంలో ఎవరున్నా సరే నేను ఇలాగే చేసి ఉండేవాడ్ని
ఏంజెల్: ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారు. గోరంత సాయం చేసి కొండత చెప్పుకుంటారు. కానీ మాత్రం మాటైనా చెప్పవ్ రిషి’ అంటూనే.. ‘ఎతైనా రిషి జెంటిల్‌మెన్ కదా వసుధార’ అంటుంది ఏంజెల్. వెంటనే వసు,రిషిలకు జెంటిల్‌మెన్ అని గతంలో వసు అన్న మాటలే గుర్తొస్తాయి. ‘సర్లే ఆసుపత్రిలో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ చేయిస్తే సరిపోదు.. తను పూర్తిగా తగ్గేదాకా కొంచెం గమనిస్తూ ఉండు అంటుంది. బహుశా నా అవసరం ఉండకపోవచ్చు’ అనేసి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. వసు మనసులో చాలా ఆవేదన చెందుతుంది.

Also Read: జూన్ 30 రాశిఫలాలు, ఈ శుక్రవారం ఈ రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది!

జగతితో మాట్లాడిన మహేంద్ర
మహేంద్ర, జగతి, దేవయాని, శైలేంద్ర, ఫణేంద్ర, ధరణీ అంతా అక్కడే ఉంటారు. మహేంద్ర జగతతో మాట్లాడడం చూసి ఫణీంద్ర, ధరణి హ్యాపీగా ఫీలవుతారు. దేవయాని, శైలేంద్ర షాక్ అవుతారు.అన్నయ్య మీకోసం,మీరంతా బాధపడుతున్నారని నేను మాట్లాడుతున్నాని దేవయాని వాళ్లకి అనుమానం రాకుండా క్లారిటీ ఇస్తాడు మహేంద్ర. దేవయాని హమ్మయ్య ఇంకా ప్రేమ పెరిగిందో, నిజం తెలిసిపోయిందో అని మనసులోనే ఆలోచిస్తుంది. ఇకపై మీ ఇద్దరి మధ్యా పంతావు పట్టింపులు వద్దని ఫణీంద్ర చెప్పడంతో సరే అంటారు జగతి-మహేంద్ర. 

రిషి-వసుధార
ఉదయాన్నే ఏంజెల్ వసుకి.. టాబ్లెట్స్ ఇస్తుంటే రిషి వచ్చి గుమ్మం దగ్గర నిలబడతాడు. ‘గుడ్ మార్నింగ్ రిషీ.. లేచావా? 2 మినిట్స్.. కాఫీ తాగుతావ్ కదా పెట్టిస్తా’ అంటూ వసుకి టాబ్లెట్ ఇచ్చి రిషి వెనుకే వెళ్తుంది ఏంజెల్. ఆ సమయంలో కాఫీ అనగానే ఇద్దరికీ గతంలో కాఫీ పెట్టడం, వసు తాగి సూపర్ అనడం అంతా గుర్తొస్తుంది. కిందకు వెళ్లిన రిషి.. వసు గురించే ఆలోచిస్తాడు. వసుధారని పలకరించాల్సిందా? అని అనుకుంటాడు. 

వసుధార-చక్రపాణి
వసుకి కాల్ చేసిన చక్రపాణి వసు క్షేమ సమాచారం అడగడంతో పాటు మహేంద్ర వచ్చి వెళ్లిన సంగతి చెబుతాడు. షాక్ అవుతుంది వసు. ‘ఏం నిజం చెప్పలేదు కదా నాన్నా?’ అంటూ అనుమానంగా అడుగుతుంది. ‘క్షమించమ్మా.. అంతా చెప్పేశాను. కానీ ఆయన వల్ల ఏ సమస్యా రాదు’ అంటాడు చక్రపాణి. ‘అయ్యో నాన్నా.. అసలే రిషి సార్‌కి నా మీద చాలా కోపం ఉంది. ఇప్పుడు ఇది కూడా నేనే చెప్పానని అనుకుంటారు.. ఇలా ఎందుకు చేశారు’ అంటూ బాధగా అంటుంది. ‘లేదమ్మా.. ఆయన చాటుగానే చూస్తానని చెప్పారు. కలవరట.. కంగారు పడొద్దు’ అంటూ చక్రపాణి చెబుతాడు. 

ఇంతలో రిషి వసు ఉన్న రూమ్ వరకూ అయినా తనతో నేనెందుకు మాట్లాడాలి’ అనుకుంటూ వెనక్కి వెళ్లిపోతాడు. వసుకి ఏదో అలికిడిగా అనిపించి చూసేసరికే రిషి అక్కడ ఉండదు. మరోవైపు మహేంద్ర ఒక్కడూ నిల్చుని జగతిని అన్న మాటలు గుర్తుచేసుకని గతంలో అన్న మాటలు తలుచుకుని బాధపడతాడు. మహేంద్ర రూమ్ లో లేడేంటి ఎక్కడున్నాడు అని వెతుక్కుంటూ బయటకు వెళుతుంది. జగతిని ప్రేమగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర.
ఎపిసోడ్ ముగిసింది

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Indiramma Houses: అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు, రైతుల నుంచి ప్రతి గింజ కొంటాం: మంత్రి పొంగులేటి
Rohit Sharma: మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
మరోసారి తండ్రైన రోహిత్ శర్మ, బాబుకు జన్మనిచ్చిన రితికా - ఆస్ట్రేలియాకు హిట్ మ్యాన్ !
Jhansi Fire Accident: యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం
యూపీలోని ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది చిన్నారులు సజీవదహనం -
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
Embed widget