Guppedanta Manasu August 3rd: అమ్మకావాలన్న రిషి, అల్లాడిపోయిన వసు - నిజం చెప్పేయాలా వద్దా అనే డైలమాలో మహేంద్ర!
Guppedantha Manasu August 3rd: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 3 ఎపిసోడ్ (Guppedanta Manasu August 3rd Written Update)
రిషిని కిడ్నాప్ చేసేందుకు పురమాయించిన వాళ్లనుంచి వసుధార, మహేంద్ర సహాయంతో తప్పించుకుంటాడు రిషి. స్పృహలో లేని రిషిని వసుధార ఇంటికి తీసుకొస్తారు. మెలుకువ రాగానే రిషి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారని మండిపడతాడు.
మహేంద్ర: నిన్ను కాపాడినవాళ్ల ఇల్లు ఇది..నిన్ను కాపాడిందా ఆ వసుధారే
రిషి: తను తన గురువు కలసి మచ్చవేయడం వల్లే మహారాజులా బతికినవాడిని అజ్ఞాతంలో బతుకుతున్నా..ఇలాంటి చోట అస్సలు ఉండలేను
మహేంద్ర: తనవల్లే నువ్వు సేఫ్ అయ్యావు..పరువు, ప్రాణం కాపాడింది
రిషి: మరి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు..అవకాశం దొరికిందని ఇలా తీసుకొస్తే మనసు మారిపోతుంది అనుకుంటున్నారా
వసు: విశ్వనాథం గారికి ఈ విషయం తెలిస్తే బావోదని ఇక్కడకు తీసుకొచ్చాను
రిషి: ప్రెస్ దగ్గర నిశ్చితార్థం ఫొటో గుర్తుచేసుకుని...అసలు కాలేజీలో మనగతాన్ని తవ్వుతున్నదెవరు, పెద్దమ్మ నీడలో సంతోషంగా బతికాను, ఇప్పుడు నా శత్రువులెవరని మండిపడతాడు. డాడ్ మీరు వస్తారో రారా అనేసి బయటకు వెళ్లిపోతూ చక్రపాణి వైపు తిరిగి మీ అమ్మాయికి నా కృతజ్ఞతలు చెప్పండి అనేసి వెళ్లిపోతాడు
మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా జెంటిల్మెన్ సార్ అనుకుంటుంది వసుధార
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్: రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు, కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?
రిషి ఎప్పటికీ రాలేదని కంగారుపడుతుంటారు విశ్వనాథం-ఏంజెల్. ఎక్కడికి వెళ్లి ఉంటాడని ఆలోచిస్తుంటారు ఇంతలో ఇంటిముందు కారు ఆగుతుంది. అందులోంచి మహేంద్ర, రిషి దిగుతారు. మహేంద్ర రిషిని జాగ్రత్తగా పట్టుకుని తీసుకుని రావడం చూసి విశ్వనాథం, ఏంజెల్ కంగారుపడతారు. ఏం జరిగిందని అడుగుతారు. ఏమీ జరగలేదనేస్తాడు రిషి...సార్ మీరైనా చెప్పండని అడుగుతుంది ఏంజెల్..
మహేంద్ర: రిషిపై అటాక్ జరిగింది..
ఏంజెల్: నిన్ను ఏదో పెద్ద ప్రమాదం వెంటాడుతోంది..అప్పుడు కూడా హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్లో కనిపించావు.. దీన్ని అంత తేలిగ్గా తేసుకోకూడదు
విశ్వనాథం: రిషి అందరకీ మంచి చేస్తాడు..అలాంటిది శత్రువులు ఎవరుంటారు
మహేంద్ర: చెడు కన్నా మంచి చేసేవారికే శత్రువులు ఎక్కువమంది ఉంటారు.. మొన్న మీ ఇంట్లో కూడా అటాక్ జరిగినట్టుంది కదా
విశ్వనాథం: ఆశ్చర్యపోయినా విశ్వనాథం మా ఇంట్లోనా అని అనేసరికి..అవునని చెబుతాడు మహేంద్ర.. అదేంటి నువ్వు చెప్పలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి, మనల్ని మనం కాపాడుకోవాలి
ఏంజెల్: ఇన్నిసార్లు అటాక్ చేశారంటే వాళ్లు నీ నుంచి ఏదో ఆశిస్తున్నారు..అంటే నీ గతమే నిన్ను వెంటాడుతోంది..గతంలో నీకు శత్రువులున్నారని తెలుస్తోంది... సార్ మీకు రిషి గతం తెలిసే ఉంటుంది కదా మీరైనా చెప్పండి సార్ అని మహేంద్రని అడుగుతుంది. రిషి ఏం చేసేవాడు, వాళ్ల అమ్మా నాన్న ఎవరు శత్రువులు ఎవరో చెప్పండి సార్
మహేంద్ర: ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్..జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది
విశ్వనాథం: చెప్పే విషయం అయితే రిషినే చెప్పేవాడు కదా తను చెప్పడం లేదంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.. రిషిని చెప్పనప్పడు మహేంద్ర సార్ ఎలా చెబుతారంటూ మీరు కూడా ఇక్కడే ఉండండి అని అడుగుతాడు...
Also Read: వసుకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, సై అంటే సై అనుకున్న మహేంద్ర-శైలేంద్ర!
మహేంద్ర-రిషి
మీరు ఈ ప్రమాదం గురించి విశ్వనాథం-ఏంజెల్ కి చెప్పకుండా ఉండాల్సింది..వాళ్లు భయపడతారని అంటాడు. ఇలాగే ప్రమాదాలు జరుగుతాయని చెప్పాల్సి వచ్చిందని రిప్లై ఇస్తాడు. పొద్దున్నే వెళ్లిపోండని రిషి కోరినా నన్ను అర్థం చేసుకో రిషి అని మహేంద్ర బతిమలాడుతాడు. అప్పటి వరకూ తండ్రికి దూరంగా ఉండిపోయిన రిషి ఒక్కసారిగా తండ్రి ఒడిలో చేరిపోతాడు.
రిషి: మన జీవితాలు ఇలా అయిపోయాయి ఏంటి..మనం గడిపిన మధుర క్షణాలు మళ్లీ వస్తాయా
మహేంద్ర: తప్పకుండా వస్తాయి
రిషి: పెద్దమ్మ, పెదనాన్న, అన్నయ్య, వదిన ఎలా ఉన్నారు
మహేంద్ర: అందరూ నీ గురించే ఆలోచిస్తున్నారని బాధపడుతూ చెబుతాడు
రిషి: అందరకీ నేనంటే ప్రేమ అని చెబుతూ పేరుపేరునా మాట్లాడుతూ..అందరికీ దూరంగా ఉండడం భారంగా ఉంది
మహేంద్ర: నీ శత్రువులు వాళ్లిద్దరే వాళ్లపై ఇంత ప్రేమ పెంచుకున్నావ్..నిజం తెలిస్తే గుండె పగిలిపోతుంది నీకు నిజం ఎలా చెప్పాలి అనుకుంటాడు
రిషి: మీకు ఓ విషయం చెప్పాలి..ఎవ్వరికీ చెప్పుకోవాలని లేదు కానీ మీతో చెప్పాలి అనిపిస్తోంది
ఏంటి రిషి అని మహేంద్ర అడగ్గానే.... అమ్మ.... అనే మాట అంటాడు... మహేంద్ర షాక్ అవుతాడు... తల్లి విలువ తెలియక జగతి మేడంని దూరం పెట్టి తన మనసు కష్టపెట్టాను..కానీ తల్లి విలువ తెలిశాక మేడం ఒళ్లో ఇలాగే తలవాల్చి కాసేపు కబుర్లు చెప్పుకోవాలి అనిపించింది డాడ్
( ఈ సీన్ అద్భుతం..చూసి తీరాల్సిందే)..కానీ నన్ను దోషిని చేసి ప్రాణం పోసిన తల్లే ప్రాణం తీసింది డాడ్. నేనంటే ఏంటో తెలిసేలా చేసిన వసుధార అలా చేసేసరికి నా మనసు ముక్కలైంది.అందుకే అందరకీ దూరమయ్యాను. వాళ్లిద్దరూ నా జీవితంలోకి రాకూడదని వాళ్లని ఒక్కో మాట అంటుంటే వాళ్లకంటే నాకు ఎక్కువగా ఉండేది
మహేంద్ర: బాధపడకు నాన్నా..నువ్వు పోగొట్టుకున్న ప్రేమ రెట్టింపు అయి దక్కుతుంది
రిషి: నా మనసుకి అయినా గాయం పోదు..ఆ రోజులు రావు
మహేంద్ర: వస్తాయి నాన్నా నేను తీసుకొస్తాను..మళ్లీ నిన్ను సంతోషంగా చూసుకుంటాను
నిద్రవస్తోందని పడుకుంటాడు రిషి...
రిషి సార్ ఎలా ఉన్నారో ఏమో అని తండ్రితో చెప్పుకుని బాధపడుతుంది. వెళ్లి చూసొద్దామా అంటే ఆ ఇంటికి ఏమని వెళ్తాం అంటుంది. అయినా సార్ కి మళ్లీ మళ్లీ కనిపించి నేను ఇబ్బంది పెట్టలేను అంటుంది. మరి ఇలాగే దిగులుగా కూర్చుంటావా అని తండ్రి అడిగితే మహేంద్ర సార్ కి కాల్ చేస్తానంటుంది
మహేంద్ర-వసు
కాల్ లిఫ్ట్ చేసిన మహేంద్రతో రిషి గురించి ఆరాతీస్తుంది. నీ గురించి-జగతి గురించి బాధపడి బాధపడి బాగా అలసిపోయాడు అని చెబుతాడు
ఎపిసోడ్ ముగిసింది...