Guppedanta Manasu July 31st: వసుకి గుడ్ న్యూస్ చెప్పిన రిషి, సై అంటే సై అనుకున్న మహేంద్ర-శైలేంద్ర!
Guppedantha Manasu July 31st: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు జూలై 31ఎపిసోడ్ (Guppedanta Manasu July 31st Written Update)
వసు-రిషి ఎంగేజ్మెంట్ ఫొటోస్ కాలేజీ అటెండర్ కి పంపించి అల్లరి చేయమని చెబుతాడు శైలేంద్ర. అదే సమయంలో అటొచ్చిన జగతికి శైలేంద్రరపై అనుమానం వచ్చి అంతా అబ్జర్వ్ చేస్తుంది. శైలేంద్ర దగ్గర రిషిధార ఆల్బమ్ చూసి షాక్ అవుతుంది. ఏదో జరగబోతోంది అడ్డుకోవాలి, నా బిడ్డకు ఏదైనా ప్రమాదం తలపెట్టేలా ఉన్నాడు అడ్డుకోవాలి అనుకుంటుంది.
కాలేజీలో పాండ్యన్ బ్యాచ్ ని పిలిచి మాట్లాడిన వసుధార..పవర్ ఆఫ్ స్టడీస్ బాధ్యతలు రిషిసార్ చేపట్టేలా చేయాలని కోరుకుంది. బస్తీ విజిట్ కి వెళ్లిన పని సక్సెస్ కాలేదని అందుకే రిషిసార్ ని ఒప్పించాలంటూ ఏదో ఐడియా చెబుతుంది. వాళ్లంతా రిషి కాలేజీలో ఎంట్రీకాగానే ప్లీజ్ సార్ పవర్ ఆఫ్ స్టడీస్ బాధ్యతలు చేపట్టండి అనే స్లిప్స్ ఇస్తారు.
శైలేంద్ర స్నానానికి వెళ్లాడని గమనించిన ధరణి..ఫోన్ తీసుకొచ్చి చెక్ చేయమని జగతికి ఇస్తుంది. జగతి ఆ పోన్ ఓపెన్ చేసేలోగా పిన్నీ అంటూ శైలేంద్ర వచ్చేస్తాడు.
శైలేంద్ర: మీరెంత గమనించినా మీకు ఏమీ తెలిసే ఛాన్స్ లేదు..మీరెన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారో అంతకుమించిన జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఓ పనైపోగానే దాని ఆనవాళ్లు లేకుండా చేసే అలవాటు నాకుంది. మీరు రీ సైకిల్ బిన్ లో వెతికినా ఏం దొరకదంటూ ఫోన్ తీసుకుని ధరణిని అక్కడినుంచి వెళ్లిపొమ్మని నెట్టేస్తాడు. నేను ఏం చేస్తానో తెలియక కంగారు పడుతున్నారా
జగతి: మళ్లీ ఏం కుట్ర చేశావ్..నా కొడుక్కి ఏం ప్రమాదం తలపెడుతున్నావ్ చెప్పు...రిషి-వసు ఫొటోస్ ఎవరికి పంపించావ్
శైలేంద్ర: ఒక్కసారి వేటాడ్డం మొదలెడితే మళ్లీ వెనక్కు తగ్గే ప్రసక్తే ఉండదు..మీరంతా ఈ శైలేంద్ర అధీనంలో పనిచేయాలి
జగతి: అది జరగదు శైలేంద్ర
శైలేంద్ర: మీరేం చేస్తున్నారో నాకు తెలియదా, నువ్వు బాబాయ్ కలసి నిజం దాచితే దాగుతుందా.. రిషి ఎక్కడుననాడో నాకు మొత్తం తెలుసు పిన్ని..
మహేంద్ర: తెలిస్తే ఏం చేస్తావ్ రా...మళ్లీ కుట్ర చేస్తున్నావా...నా కొడుకుని చంపాలనుకుంటున్నావా
శైలేంద్ర: బాబాయ్ నేను...
మహేంద్ర: హేయ్..ఇక ఆపు నటించకు చూడలేకపోతున్నా...నువ్వు ఎంత మేకవన్నె పులివో నాకు మొత్తం తెలుసు..తెలిసిన మరుక్షణమే నీ అంతు చూడాలి అనుకున్నా..కానీ మా అన్నయ్య కోసం ఆగాను..నువ్వు బతికి బట్టకట్టావ్..ఛ...పదవి కోసం తమ్ముడిపై పగ పెంచుకుంటావా తనపై కక్ష సాధిస్తావా..మా కుటుంబంలో నువ్వు చెడబుట్టావ్ కదా..
శైలేంద్ర: బాబాయ్...
మహేంద్ర: నీకు నాకు మధ్య ఏ బంధం లేదు..ఏ రోజు నా కొడుకుని చంపాలనుకున్నావో ఆ రోజే నా మనసులో నీ స్థానం చచ్చిపోయింది. మేం నీకు ఏం పాపం చేశాం..ఎందుకిలా చేస్తున్నావ్. కొడుక్కి దూరమై బాధపడిన జగతి అన్నీ సర్దుకున్నాయని సంతోషించేలోగా ఇదంతా చేశావ్. నా కొడుకుని నైతికంగా దెబ్బకొట్టేలా చేశావ్...నా కొడుకుని నేనే దగ్గరుండి తిరిగి తీసుకొస్తాను... అప్పుడు నీ పరిస్థితేంటి... ఇకనైనా జాగ్రత్తగా ఉండు
శైలేంద్ర: నా జాగ్రత్తల్లో నేనున్నాను..రిషి తిరిగొచ్చినా నాకేం కాదు. డీబీఎస్టీ ఎండీ సీట్లో నేను కూర్చుని తీరుతాను..
మహేంద్ర:నీకంత సీన్ లేదు..
శైలేంద్ర: నా బలహీనత, మీ బలహీనత మా డాడీనే..కానీ చివరకు గెలిచేది నేను..అందుకు నేనే వేసే ఎత్తులు మీకర్థం కావు...
మహేంద్ర: అదీ చూద్దాం..తోడేలుకి అర్థంకావడం లేదు వేటాడాలి అనుకున్నది పులి అని...
Also Read: కాలేజీ గోడలపై రిషిధార ఎంగేజ్మెంట్ ఫొటోస్, ఈగోమాస్టర్ విశ్వరూపం!
శైలేంద్ర అక్కడకి నుంచి వెళ్లిపోతాడు...వెంటనే వసుధారకి కాల్ చేసిన మహేంద్ర.. శైలంద్రకి మీరెక్కడున్నారో తెలిసింది, మిమ్మల్ని అవమానించాలని ఏదో ప్లాన్ చేస్తున్నాడు..వాడు పక్కాగా ప్లాన్ చేసినట్టున్నాడు...మీ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని ఎవరికో పంపించాడు..జాగ్రత్తగా ఉండండి అని కాల్ కట్ చేస్తాడు.
వసు: అసలిక్కడ ఏం జరగబోతోంది..శైలేంద్ర ఏం చేస్తాడు..సార్ ని జాగ్రత్తగా ఉండమని చెప్పాలి కానీ ఈ విషయం ఎలా చెప్పాలి..నేను చెప్పినా వినరు కదా..పోనీ ఏంజెల్ ద్వారా చెప్పించాలి అనుకుంటే తనకి అనుమానం వస్తుంది..అందుకే నేరుగా రిషి సార్ కి చెప్పాలి అనుకుంటూ మీతో మాట్లాడాలి అంటూ మెసేజ్ చేస్తుంది...
ALso Read: రిషిని అల్లుడని పిలిచిన చక్రపాణి, షాకైన ఏంజెల్- మిస్టర్ ఈగో ఎంగిలి తాగి మురిసిన వసు
రిషి- ప్రిన్సిపాల్
అదే సమయంలో రిషి..ప్రిన్సిపాల్ తో మాట్లాడుతూ మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ ని టేకప్ చేద్దామని చెబుతాడు. వెంటనే డీబీఎస్టీ కాలేజీకి సమాచారం పంపించండి అంటాడు. మిషన్ ఎడ్యుకేషన్-పవర్ ఆఫ్ స్టడీస్ మెర్జ్ చేస్తే రెండూ కలపి కంటిన్యూ చేద్దాం అనే సలహా ఇస్తాడు. దానివల్ల ప్రయోజనాలను కాసేపు వివరిస్తాడు రిషి. ప్రిన్సిపాల్ రిషిని కాసేపు పొగిడేస్తాడు. దీనికి సంబంధించి కాలేజీలో ఫ్లెక్సీలు వేయిద్దాం అని సలహా ఇచ్చిన ప్రిన్సిపాల్ వాడిని పిలిపిస్తానంటాడు. కానీ వద్దు నేనే వెళతానంటాడు రిషి. బయటకు రాగానే ఎదురుగా పాండ్యన్ బ్యాచ్ ఎదురుచూస్తుంటారు..వాళ్లవైపు చూసి నవ్వుతాడు రిషి..అది చూసి పాండ్యన్ బ్యాచ్ సంతోషిస్తారు..మా నిర్ణయాన్ని అంగీకరించినందుకు థ్యాంక్స్ అంటారు.