Guppedanta Manasu July 28th: రిషిని అల్లుడని పిలిచిన చక్రపాణి, షాకైన ఏంజెల్- మిస్టర్ ఈగో ఎంగిలి తాగి మురిసిన వసు
Guppedantha Manasu July 28th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. రిషి బతికే ఉన్నాడని తెలిసి మళ్లీ కుట్రకు తెరతీశాడు శైలేంద్ర
రిషి వసు ఎక్కడ ఉందో కనుక్కోవడానికి మెసేజ్ చేస్తాడు. మీరేం టెన్షన్ పడొద్దు నేను మా ఇంట్లో ఉన్నాను. ఒకేనా బై అని వసు మెసేజ్ పెడుతుంది. అప్పుడే ఏంజెల్ వచ్చి వసు గురించి అడుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఉందని చెప్తాడు. కాలేజ్ లో జరిగిన గొడవకి బాగా హర్ట్ అయ్యి ఉంటుంది, పైగా తను మాట పడదు. నువ్వు ఏదేదో అనేశావ్. పద మనం ఇద్దరం వెళ్ళి మాట్లాడేసి వద్దామని అంటుంది. ముందు రిషి రానని చెప్పి తర్వాత వస్తానని ఏంజెల్ తో పాటు వసు ఇంటికి బయల్దేరతాడు.
ఏంజెల్: రిషి నువ్వు వసుధార కోసం వస్తున్నావ్ కదా. నేను రమ్మంటే రానని చెప్పి ఇప్పుడు మనసు మార్చుకుని వస్తున్నావ్
రిషి: అదేం లేదు నీకు తోడుగా వస్తున్నా.. రాత్రిపూట ఒంటరిగా వదిలేయడం ఇష్టం లేదు
ఏంజెల్: థాంక్స్ రిషి అన్నీ విషయాలు బాగా అర్థం చేసుకుంటావ్. కానీ వసుధార విషయంలో కొన్ని సార్లు వింతగా ప్రవర్తిస్తావ్. తను చాలా మంచిది తనని చూస్తుంటే జీవితంలో పెద్ద కష్టం ఎదుర్కొంటున్నట్టు చాలా బాధపడుతున్నట్టు ఎవరికో దూరం అయినట్టు ఉంటుంది. కానీ ఎప్పుడూ బయట పడదు. అందరి ముందు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. నేను కనిపెట్టేశాను అడిగితే ఏం లేదని చెప్తుంది. తన మనసులో మాట అసలు బయట పెట్టదు. తన కష్టం ఏంటో చెప్తే మనమైన సాల్వ్ చేస్తాం కదా. తనకి ఏమైందోనని టెన్షన్ గా ఉంది
Also Read: తెలివిగా పావులు కదుపుతున్న ముకుంద- భవానీకి నిజం చెప్పేసి కృష్ణ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందా?
రిషి: నువ్వేం కంగారు పడకు తనకి ఏం కాదు
ఏంజెల్: తను చాలా మంచిది. తనతో స్నేహం చేస్తే తను ఎప్పుడు నీ పక్కనే ఉండాలని కోరుకుంటావ్
ఆ మాటకి రిషి వసుతో గడిపిన క్షణాలు, బ్రేకప్ విషయం గుర్తు చేసుకుంటాడు. ఇద్దరూ వసు ఇంటికి చేరుకుంటారు. రిషి లోపలికి రానని చెప్పి కారు దగ్గరే ఆగిపోతాడు. ఏంజెల్ తనని బలవంతంగా ఇంట్లోకి తీసుకుని వెళ్తుంది. రిషిని చూసి చక్రపాణి అల్లుడు గారు అని పిలుస్తాడు. ఆ మాట విని ఏంజెల్ షాక్ అవుతుంది.
ఏంజెల్: అల్లుడు గారా? మీకు రిషి ముందే తెలుసా?
చక్రపాణి: అల్లుడు కాదమ్మా బాబు గారు అన్నాను
ఏంజెల్: కాదు మీరు రిషిని అల్లుడు అన్నారు నేను విన్నాను. మొన్న కూడా ఇంతే మహేంద్ర సర్ ని రిషి డాడ్ అన్నారు అడిగితే లేదన్నారు. ఏంటి ఇలా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది. మీరు ఊరు నుంచి ఎప్పుడు వచ్చారు
చక్రపాణి: వసుధార ఫోన్ చేసి రమ్మంటే వచ్చాను
ఏంజెల్: రిషి మీకు ఇంతక ముందే తెలుసా పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నారు
చక్రపాణి: తెలుసు వసుతో కలిసి పని చేస్తున్నారు కదా
వసు రాగానే రిషి మొహం చూసి మనసులో మాట్లాడుకుంటారు. వాళ్ళని ఏంజెల్ గమనిస్తుంది.
ఏంజెల్: నువ్వు ఇంటికి రాకుండా ఫోన్ లిఫ్ట్ చేయకపోయే సరికి కంగారుపడ్డాను. ఎందుకు ఇలా చేశావ్
వసు: మిమ్మల్ని ఎన్ని రోజులు శ్రమ పెడతాను అందుకే వచ్చేశాను
Also Read: రుద్రాణి ప్లాన్ అట్టర్ ఫ్లాప్, స్వప్న యాడ్ తీయించేసిన రాజ్ - అక్కా, చెల్లెళ్ల మధ్య వార్
రిషి ఇక వచ్చిన పని అయిపోయింది కదా వెళ్లిపోదాం పద అంటాడు. రాక రాక ఇంటికి వచ్చారు కనీసం కాఫీ అయినా తాగమని చక్రపాణి రిషిని అడుగుతాడు. అవసరం లేదని అంటాడు. వసు ఏంజెల్ ని కాఫీ అయినా తాగమంటే భోజనం చేస్తానని చెప్తుంది. రిషి తనకి ఆకలిగా లేదని వెళ్లిపోతుంటే కనీసం మజ్జిగ అయినా తాగమని అంటారు. దీంతో చేసేది లేక వసు మజ్జిగ తీసుకొచ్చి ఇస్తే కష్టంగా తాగుతాడు. వసుని జాగ్రత్తగా చూసుకున్నందుకు చక్రపాణి ఏంజెల్ కి థాంక్స్ చెప్తాడు. తనకి కాదని రిషికి చెప్పమని అంటుంది.
ఏంజెల్: రిషి గురించి ఒక్కటే కోరిక తను తన కుటుంబంతో కలిసి ఉండాలి అదొక్కటే నా కోరిక
రిషి వసుధార వాళ్ళ అమ్మ ఎక్కడ కనిపించడం లేదేంటని ఇల్లంతా చూస్తాడు. మేం వచ్చి ఇంత సేపు అయ్యింది కదా కనీసం చూడటానికి కూడా రాలేదు ఏంటి? తను ఇంట్లో లేదేమో అనుకుంటాడు. మళ్ళీ ఇంతలోనే ఈ ఇంట్లో ఆమె ఉంటే ఏంటి లేకపోతే నాకెంటని అనుకుంటాడు. ఏంజెల్ వచ్చి వెళ్దామని అంటుంది.
రిషి: మేడమ్ వాళ్ళ అమ్మ ఊర్లో లేనట్టు ఉన్నారు తనని కాస్త జాగ్రత్తగా చూసుకోండి అనేసి వెళ్లిపోతారు. ఆ మాటకి వసు బాధగా తల్లి ఫోటో వైపు చూస్తుంది. రిషి వదిలిపెట్టిన మజ్జిగ తాగుతుంది. అప్పుడే ఇంట్లోకి వచ్చిన రిషి అది చూసి గ్లాసు లాక్కోబోతుంటే వసు ఆపుతుంది. వేస్ట్ చేయడం ఎందుకని తాగుతున్నానని కవర్ చేస్తుంది. కాసేపు పెరుగు, పాలు, మజ్జిగ అని క్లాస్ పీకుతుంది.