(Source: ECI/ABP News/ABP Majha)
Guppedanta Manasu August 11th: వెళ్లిపోమన్న రిషి - ఉంటానని తేల్చి చెప్పిన వసు, ఫైర్ అయిన ఏంజెల్!
Guppedantha Manasu August 11th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 11 ఎపిసోడ్ (Guppedanta Manasu August 11th Written Update)
విశ్వనాథం ఆరోగ్య పరిస్థితి గురించి బాధపడుతున్న ఏంజెల్ ని ఓదార్చుతాడు రిషి. అమ్మా-నాన్న ఎవ్వరూ ఇన్నాళ్లూ గుర్తురాలేదు ఉంటే బావుండును అనుకున్నా కానీ..కానీ నాకు అన్నీ విశ్వమే అంటుంది.
రిషి: నువ్వు సాధ్యమైనంత వరకూ ఆయన పక్కనే ఉండు..ముఖ్యంగా ఆయన పక్కనే ఉండి బాధపడకు అని చెబుతాడు. కాలేజీకి వెళ్లనా ఇంట్లోనే ఉండనా
ఏంజెల్: నువ్వు వెళ్లు..ఏదైనా అవసరం ఉంటే అప్పుడు చెబుతాను వద్దువుగాని
అటు కాలేజీలో క్లాస్ రూమ్ లో క్లాస్ చెబుతున్న వసుధార..రిషి గురించి ఆలోచిస్తుంది. సార్ ఎందుకు రాలేదు మళ్లీ అటాక్ ఏమైనా జరిగిందా అని ఆలోచనలో పడుతుంది. కాల్ చేయాలా వద్దా అనుకుంటూ ఆగిపోతుంది. కాసేపు చూసి కాల్ చేద్దాం అని సర్దిచెప్పుకుంటుంది. క్లాస్ పూర్తైన తర్వాత బయటకు వచ్చేస్తుంది...ఇంతలో రిషి ఎదురుపడడంతో హమ్మయ్య అనుకుంటుంది
వసు: లేటు ఎందుకైందని అడిగితే చెబుతారా
రిషి: విశ్వనాథం సార్ పరిస్థితి చెప్పాలా వద్దా
వసు: అడిగినా చెప్పరు ఎందుకులే
రిషి: ఏంజెల్ కి వసు తోడుగా ఉంటే కొంత ధైర్యంగా ఉంటుంది కదా అనుకుంంటూనే మీరు ఎగ్జామ్స్ కి క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయండి
వసు:అంతేనా సార్
రిషి: మన మధ్య అంతకుమించి ఏముంటుందనేసి వెళ్లిపోతాడు
ఇంతలో ఏంజెల్ కాల్ చేసి విశ్వనాథం ఆరోగ్య పరిస్థితి గురించి చెబుతుంది. నువ్వు కాల్ చేశావు కానీ నేను లిఫ్ట్ చేసే స్థితిలో లేను ఇంతకీ ఎందుకు కాల్ చేశావ్ అని అడుగుతుంది. నేను ఇప్పుడే వస్తానంటుంది వసు
ఏంజెల్: నువ్వు క్లాసులు మానేసి వస్తే రిషి కోప్పడతాడు, విశ్వం కూడా అలా ఎందుకు చేశావ్ అంటాడు. కాలేజీ అయ్యాక రిషితో కలసి రా
వసు: కాల్ కట్ చేసిన తర్వాత రిషి సార్ ఇంత సీరియస్ విషయం కూడా ఎందుకు చెప్పలేదో అనుకుంటుంది. తండ్రికి కాల్ చేసి విశ్వనాథం ఆరోగ్యం గురించి చెప్పి..సాయంత్రం వాళ్లింటికి వెళ్లి వస్తానని చెబుతుంది
చక్రపాణి: నిన్ను సొంత మనిషిలా చూసుకున్నారు కదా..నేను కూడా వస్తానమ్మా అన్నా కానీ వసు వద్దంటుంది. నువ్వుంటే ఏంజెల్ కి తోడుగా ఉన్నట్టు ఉంటుందని చెప్పి కాల్ కట్ చేస్తాడు
Also Read: కాలేజీలో వసు ఎదురుచూపులు, ఏంజెల్ పెళ్లిగురించి రిషితో మాట్లాడిన విశ్వనాథం!
ఏంజెల్ కి కాల్ చేసిన రిషి..విశ్వం ఆరోగ్యపరిస్థితి గురించి అడుగుతాడు. ఇప్పుడే వస్తున్నా అంటాడు. వసుధారని తీసుకునిరా అంటుంది ఏంజెల్
రిషి చేసేది లేక సరే అంటాడు
నడిచి వెళుతున్న వసుని చూసి హారన్ కొడతాడు, కారు స్లో చేస్తాడు కానీ వసుధార కావాలనే పట్టించుకోదు. నన్ను పిలిచి కారెక్కమనే వరకూ వెళ్లకూడదు అనుకుంటుంది. ఇక చేసేది లేక వసుని పిలుస్తాడు రిషి..ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు. అయినా మీతోన నాకెందుకు డిస్కషన్..ఏంజెల్ మిమ్మల్ని తీసుకురమ్మంది కారెక్కండి అంటాడు. వసు అడిగినా కానీ రిషి సరిగా సమాధానం చెప్పడు. నేను మాట్లాడినా మాట్లాడనప్పుడు నేనెందుకు స్పందించాలి అనుకుంటుంది. ఇంతలో ఏంజెల్ కి ధైర్యం చెప్పాలి అన్న రిషితో అంతేనా ఇంకేమైనా చెప్పాలా అని కోపంగా అడుగుతుంది. ఇంటికి చేరుకుంటారు
వసు: మీరు హెల్త్ విషయంలో కేర్ తీసుకుంటారు ఎందుకిలా జరిగింది
విశ్వం: నాకు ఇలా జరిగేసరికి ఏంజెల్ ఏడుస్తోంది..నువ్వే కొంచెం ధైర్యం చెప్పాలి. తనది పసిపిల్లల మనస్తత్వం..నేను కూడా తన ఇష్టానుసారం పెంచాను. తనకి కష్టాలు బాధలు తెలియవు. ఇప్పుడు నాకిలా అయ్యేసరికి టెన్షన్ గా ఉంది. నువ్వు తనని తోబుట్టువులా చూసుకోవాలి
వసు: మీరు టెన్షన్ పడకండి సార్ ఏంజెల్ ని నేను చూసుకుంటాను.మీ ఆరోగ్యం బాగయ్యేవరకూ ఇక్కడే ఏంజెల్ కి తోడుగా ఉంటాను
రిషి: అవసరం లేదు మేడం..ఏంజెల్ కి తోడుగా పనిమనిషిని మాట్లాడాను
వసు: థ్యాంక్యూ సార్ నా గురించి బాగా ఆలోచించారు..మీరు చెప్పాక ఎందుకు ఉంటాను వెళ్లిపోతాను అని చెప్పి కిచెన్లో ఉన్న ఏంజెల్ దగ్గరకు వెళుతుంది.
ఏంజెల్: వసుధారా విశ్వంకి ఏమీ కాదు కదా తను ఎప్పటిలానే ఆరోగ్యంగా ఉంటారు కదా టెన్షన్ గా ఉంది
వసు: నువ్వు టెన్షన్ పడకు..నువ్వు కంగారుపడితే సార్ నీ గురించి దిగులుపడతారు. ఆయన ఆలోచనంతా నీగురించే. నువ్వు భయపడుతున్నట్టు సార్ ముందు ఉండొద్దని జాగ్రత్తలు చెబుతుంది. నేను ఇంటికి వెళుతున్నాను సార్ ని జాగ్రత్తగా చూసుకో
ఏంజెల్: వెళ్లాలా..ఉండొచ్చుకదా.. నువ్వు పక్కనే ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది..ప్లీజ్ వసుధారా ఉండవా
వసు: ఉంటే రిషి సార్ ఏమనుకుంటారో ఏమో అనుకుంటూనే.. సరే ఉంటాను అంటుంది కానీ రిషి గురించే ఆలోచిస్తుంటుంది..
విశ్వంకి జ్యూస్ ఇచ్చిన ఏంజెల్..కాఫీ తీసుకొచ్చాను రిషి ఎక్కడికి వెళ్లాడని అడిగితే తన రూమ్ కి వెళ్లాడని చెబుతాడు విశ్వం. నువ్వు తీసుకెళ్లి కాఫీ ఇచ్చేసిరా అని వసుని పంపిస్తుంది ఏంజెల్..
Also Read: నిశ్చితార్థం జరిగిన విషయం బయపెట్టిన వసు, మరింత ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్!
కాఫీ తీసుకెళ్లిన వసుని చూసి మీరెందుకు వచ్చారు మేడం అని అడుగుతాడు
వసు: ఏంజెల్ కాఫీ ఇమ్మని పంపించింది
రిషి: తను పంపించిందే అనుకోండి తీసుకురావడమేనా
వసు: తీసుకొస్తాను సార్..ఏంజెల్ కి తోడుగా ఉండమని మీరే చెప్పారు కదా అందుకే తీసుకొచ్చాను
రిషి: వచ్చిన పని అయింది కదా వెళ్లండి
వసు: మీరు కాఫీ తాగాక కప్పు తీసుకెళ్తాను అంటుంది
రిషి; నేనే తీసుకొస్తాను మీరు వెళ్లండి అంటాడు...ఇంకా అక్కడే నిల్చుని ఉండడం చూసి నాకేమైనా చెప్పాలా
వసు: చాలా విషయాలు చెప్పాలి అనిపిస్తోంది మీరు వినరని చెప్పడం లేదు కానీ ఓ విషయం చెప్పాలి అనిపిస్తోంది. మీరు ఓసారి మహేంద్ర సార్ తో మాట్లాడండి వాళ్లు సంతోషపడతారు
రిషి: నేను ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసంటాడు..
అయినా అందరి సంతోషాల గురించి మాట్లాడే మీరు నా సంతోషం గురించి ఎందుకు ఆలోచించలేదు..మీరు చెప్పే అబద్ధం నా సంతోషాన్ని మింగేస్తుందని మీకు తెలియదా అనుకుంటాడు మనసులో
ఎపిసోడ్ ముగిసింది...