Guppedanta Manasu August 9th: నిశ్చితార్థం జరిగిన విషయం బయపెట్టిన వసు, మరింత ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్!
Guppedantha Manasu August 9th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 9 ఎపిసోడ్ (Guppedanta Manasu August 9th Written Update)
శైలేంద్ర-దేవయాని గురించి మొత్తం చెబుతుంది వసుధార..కావాలంటే సాక్ష్యాలు చూపిస్తానంటుంది. కానీ ఈగోమాస్టర్ మాత్రం అస్సలు నమ్మడు, వినడు. మా పెద్దమ్మ-అన్నయ్య గురించి నువ్వేకాదు ఆ దేవుడు చెప్పినా కూడా నమ్మను అని అరుస్తాడు....( ఇదంతా వసుధార కల) మేడమ్ అని పోలీస్ ఆఫీసర్ అడగడంతో వాస్తవంలోకి వస్తుంది. ఆ వాయిస్ గుర్తుపట్టారా అని పోలీస్ అడిగుతాడు, ఎవరిది మేడం అని రిషి కూడా అడుగుతాడు కానీ వసుధార మాత్రం వాయిస్ తెలిసినట్టే ఉందని అంటుంది కానీ శైలేంద్ర అని మాత్రం చెప్పదు. ఫోన్ తీసుకుని వెళ్లిపోతాడు పోలీస్.
రిషి: నిన్న జరిగిన విషయం మీ మేడంకి, డాడ్ కి చెప్పారా..ఇక్కడ జరిగిన ప్రతి విషయం వాళ్లకి చెప్పి కంగారుపెట్టి ఇక్కడకు వచ్చేలా చేయొద్దు
వసు: మీ డాడ్, మా మేడం ఏంటి సార్
రిషి: గతం వద్దు ప్రస్తుతంలో ఉండండి.. మనం ఈ కాలేజీలో తోటి లెక్చరర్స్ మాత్రమే. మన మధ్య ఏ బంధం ఉండదు..ఇక మీరు వెళ్లొచ్చు
ALso Read: రిషికి నిజం చెప్పేసిన వసు, శైలేంద్రను హెచ్చరించిన ఫణీంద్ర!
శైలేంద్ర
రాత్రి ఆ వెధవలు ఏమీ చేయలేకపోయారు..ఫోన్ అక్కడే వదిలేశారు..అది రిషికి దొరికిపోయింది..ఇప్పుడు నా పరిస్థితి ఏంటి.. ఇంత పక్కాగా ప్లాన్ చేస్తున్నా ఎలా తప్పించుకుంటున్నాడు..లైఫ్ లో ఇంత టెన్షన్ ఎప్పుడూ పడలేదు. అసలు నిజం తెలిసే అవకాశం ఇవ్వకుండా ప్రాణాలు తీసేయాలి అనుకుంటాడు.
క్లాస్ రూమ్ లో ఉంటాడు రిషి.. వసుధార బయట కూర్చుని ఆలోచనలో పడుతుంది. సార్ నేను మీతో మాట్లాడాలి అని మెసేజ్ చేస్తుంది.
రిషి: ఏం మాట్లాడుతారు మేడం అయినా మీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు
వసు: అవసరం ఉంది..నేను వెయిట్ చేస్తూ ఉంటాను రండి
రిషి: క్లాసులో ఉన్నాను రాను..డోంట్ వెయిట్
వసు: మిమ్మల్ని ఇప్పుడు రమ్మనడం లేదు..క్లాస్ అయ్యాక ఇంటికి వెళ్లేముందు కలుద్దాం
రిషి: అయినా సరే మీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు..రాను అంతే
వసు: నేను మీతో మాట్లాడి తీరాలి..మీరు రాకపోతే ఇంటికొచ్చేస్తాను
రిషి: డామిట్ పొగరు తగ్గదుగా అని గట్టిగానే అనేస్తాడు ( క్లాస్ రూమ్ లో ఉన్న విషయం మర్చిపోయి)..స్టూడెంట్స్ సార్ అనడంతో అలెర్ట్ అవుతాడు. ఇప్పుడు నన్ను బెదిరిస్తోందా అయినా కానీ నేను వెళ్లను అనుకుంటాడు...
వసు: మాట్లాడడం ఇష్టం లేదంటారు కానీ మాట్లాడుతారు, రానంటారు కానీ వస్తారు అనుకుంటుంది
అటుగా వచ్చిన రిషి..వసుని పట్టించుకోకుండా వెళ్లిపోతుంటాడు... వసు పలిచినా కానీ పట్టించుకోకుండా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు.. చివరిసారిగా అడుగుతున్నా మీరు నాతో మాట్లాడుతారా లేదా అని రెట్టిస్తుంది... లేదు అంటూ వెళ్లిపోతాడు.
Also Read: 'గుప్పెడంత మనసు' సీరియల్ - రిషిని చంపటానికి ప్రయత్నించిన రౌడీలు.. కోపంతో రగిలిపోతున్న శైలేంద్ర?
చెప్పినట్టే ఇంటికి వచ్చేస్తుంది వసుధార...
హాల్లోనే ఉన్న ఏంజెల్, విశ్వనాథం ఇద్దరూ షాక్ అవుతారు.. ఈ పొగరు అన్నంత పని చేసిందనుకుంటూ హాల్లోకి వస్తాడు రిషి..
వసు: మీతో మాట్లాడాలని చెప్పాను కదా ఏమాత్రం పట్టించుకోకుండా ఇలా వచ్చేశారేంటి. మాట్లాడాలి అని అడిగినప్పుడు మాట్లాడాలి కదా
రిషి: నాతో మాట్లాడేదేముంది ముందు మీరు ఇంటికి వెళ్లండి సార్
వసు: నేను వెళ్లను
రిషి: మీరెవరు..నాతో పనేంటి
వసు: నేను ఎవరో మీకు తెలియదా
రిషి: మీతో నాకేం పనిలేదు
వసు: మీతో నాకు పని ఉంటుంది..మీరు మాట్లాడితేనే కదా తెలిసేది
విశ్వనాథం: ఎందుకమ్మా ఆవేశం
వసు: నేను ఎవరో తనకి తెలుసు కానీ తెలియదు అంటున్నారు
రిషి: ఏ హక్కుతో అజమాయిషీ చూపిస్తున్నారు
వసు: ఇదిగోండి సార్ అని చేయి చూపిస్తుంది...ఇది మా ఎంగేజ్మెంట్ రింగ్ సార్..
విశ్వనాథం, ఏంజెల్ షాక్ అవుతారు..
రిషి: నేను ఫోన్ చేసి మాట్లాడుతాను మీరు వెళ్లిపోండి
వసు: కాల్ చేస్తాను అన్నందుకు మీరే సాక్ష్యం, ఆయన కాల్ చేసి మాట్లాడకపోతే మీ నట్టింటికి వచ్చి రిషి సార్ ని పిలుస్తాను అని వెళ్లిపోతుంది వసుధార..
( వసుధార ఇంటికొచ్చినట్టు రిషి ఊహ...అమ్మో ఈ పొగరు వచ్చినా వస్తుంది అనుకుంటూ కారు వెనక్కు తిప్పి వసుధార ఇంటికెళ్లి కూర్చుంటాడు)
వసుధార రాక గమనించిన తండ్రి బయటకు వెళ్లి రిషి వచ్చినట్టు చెబుదాం అనుకుంటాడు..కానీ వసుధార మాత్రం రిషిపై రుసరుసలాడుతూ లోపలకు వెళ్లి రిషిని చూసి షాక్ అవుతుంది
వసు: ఏంటిలా వచ్చారు
రిషి: ప్రమాదాలు జరగకుండా నా జాగ్రత్తలు తీసుకోవాలి కదా. నేను అక్కడ మాట్లాడకపోతే విశ్వనాథం ఇంటికొచ్చి గతం మొత్తం బయటపెడతారు. అందుకే జరిగే గొడవేదే మన గతం తెలిసినవాళ్లమధ్యే జరిగితే మంచిదికదా. అయినా మీరేం నాతో మాట్లాడేది
వసు: నా గురించి మాట్లాడేందుకు కాదు..మీ గురించి మాట్లాడేందుకే
రిషి: నాతో మాట్లాడేందుకు ఓ కార్యక్రమం అయితే పెట్టుకున్నారు కదా. నా గురించి మాట్లాడే అవసరం లేదు. నాకు దూరంగా ఉండమని చెప్పాను కదా
వసు: మీకు దగ్గరగా ఉండమని వేరేవాళ్లు కొంతమంది చెప్పారు
రిషి: ఎవరో చెబితే నాకు ఇష్టంలేకపోయినా వచ్చేస్తారా..
వసు: మీకు కావాల్సిన వాళ్లే చెప్పారు అంటుంది..ఇంతలో రిషి పొలమారుతాడు..వసు కంగారుగా నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది..
ఇద్దరూ కాసేపు పోటాపోటీగా వాదించుకుంటారు... త్వరగా చెబితే వెళ్లిపోతాను అంటాడు
వసు: మహేంద్ర సార్ కాల్ చేశారు, వాళ్లు మీ గురించి భయపడుతున్నారు, తిండినిద్ర కూడా మానేశారు, ఇక్కడ జరిగింది చెబితే కంగారుపడతారని చెప్పలేదు వాళ్లకోసమైనా జాగ్రత్తపడాలి, మీకు ఫోన్ చేస్తే విసుక్కుంటారని కాల్ చేయకపోవచ్చు, మీ దృష్టిలో మీరు నేను వేరు కానీ వాళ్ల దృష్టిలో మీరు నేను ఒక్కటే. నాకు జాగ్రత్తలు చెబితే మీకు చెప్పినట్టే భావించి ఉంటారు. SI కి కాల్ చేసి ఆ ఫోన్ గురించి వివరాలు తెలుసుకోండి అని చెబుతుంది.