Guppedanta Manasu August 10th: కాలేజీలో వసు ఎదురుచూపులు, ఏంజెల్ పెళ్లిగురించి రిషితో మాట్లాడిన విశ్వనాథం!
Guppedantha Manasu August 10th: కాలేజీ ఎండీ సీటుకోసం శైలేంద్ర-దేవయాని ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. మహేంద్ర-జగతి కూడా తగ్గేలే అన్నట్టే ఢీ అంటే ఢీ కొడుతున్నారు
గుప్పెడంతమనసు ఆగష్టు 10 ఎపిసోడ్ (Guppedanta Manasu August 10th Written Update)
మహేంద్ర-జగతి కంగారుపడుతున్న విషయం రిషికి చెబుతుంది వసుధార. మీ దృష్టిలో మీరు నేను వేరు కానీ వాళ్ల దృష్టిలో మనం ఒక్కటే. నాకు జాగ్రత్తలు చెబితే మీకుచెప్పినట్టే అని భావించినట్టున్నారు అందుకే చెప్పారు. SI గారికి కాల్ చేసి మాట్లాడండి చెప్పేది మీకే అని రెట్టిస్తుంది. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలో నాకు తెలుసు. వాళ్లకి చెప్పండి నాకేమైనా జరిగితే చూసుకునేవాళ్లున్నారని అనేసి వెళ్లిపోతాడు రిషి...
Also Read: నిశ్చితార్థం జరిగిన విషయం బయపెట్టిన వసు, మరింత ముదిరిన టామ్ అండ్ జెర్రీ వార్!
కొంచెం ఉంటే ఆ రిషికి దొరికిపోయేవాడిని..అంటూ ఫోన్ రిషికి దొరికిపోయిన విషయం దేవయానికి చెబుతాడు.
దేవయాని: నువ్వు చేసినవన్నీ కరెక్టే కానీ ఎందుకు మిస్సవుతున్నాయో అర్థంకావడం లేదు
శైలేంద్ర: వాడు తిరిగొస్తే నా కల కలలానే ఉండిపోతుంది..
దేవయాని: వచ్చే వాడైతే ఈపాటికే వచ్చేవాడు. మళ్లీ కాలేజీకి రాడు నువ్వు టెన్షన్ పడకు. నీ టార్గెట్ కాలేజీ కదా ముందు దానిపై దృష్టి పెట్టు.. నువ్వు ఆవేశపడి మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తే దొరికిపోయే అవకాశం ఉంది. నువ్వు దొరికి పోతే నువ్వు ఇరుక్కుంటావు నేను ఇరుక్కుంటాను ఇవన్నీ మనకు అవసరమా చెప్పు. ఇప్పుడు ఇవన్నీ వదిలేసి కొన్ని రోజులు నేను చెప్పినట్టు చేయి...( ఫణీంద్ర రూమ్ వైపు వస్తుంటాడు) రిషిని ఏమీ చెయ్యకు వదిలెయ్
శైలేంద్ర: నువ్వు ఎన్ని చెప్పినా నేను చేసేదే చేస్తానని మనసులో అనుకుంటాడు
దేవయాని: నేను చేసేది చేస్తానని అనుకుంటున్నావు కదా..కానీ నేను చెప్పేది విను.. కాలేజీపై దృష్టి పెట్టు..
సరిగ్గా చెప్పావు దేవయాని అని ఎంట్రీ ఇస్తాడు ఫణీంద్ర.. నీ ప్రవర్తన నచ్చకే వద్దంటున్నాం కానీ నువ్వు కాలేజీ గురించి పట్టించుకుంటే మంచిదేకదా అంటాడు
శైలేంద్ర: ఇకనుంచి ఏదంటే అది మాట్లాడను..బుద్ధిగా వర్క్ చేస్తాను
ఫణీంద్ర: వచ్చి జగతి దగ్గర వర్క్ నేర్చుకో..జగతితో ఉంటూ పాజిటివ్ గా ఆలోచిస్తూ తనకు సహాయం చేయి
ఇంతలో మహేంద్ర వస్తాడు.. శైలేంద్ర కాలేజీకి వస్తానన్న విషయం చెబుతాడు ఫణీంద్ర...నువ్వేమంటావ్ అని మహేంద్రని అడుగుతాడు
మహేంద్ర: మీ ఇష్టం అన్నయ్యా
శైలేంద్ర: పిన్ని అభ్యంతరం పెడుతుందేమో
మహేంద్ర: నువ్వు భయపడకు శైలేంద్ర..నీకు నేర్పించాల్సినవి కూడా నేర్పిస్తా అంటాడు ( చిన్నవాడివైనా చాలా నేర్పిస్తున్నావ్ నాటకాలు నువ్వేకాదు మేం కూడా ఆడగడం అనుకుంటాడు మనసులో)
ALso Read: రిషికి నిజం చెప్పేసిన వసు, శైలేంద్రను హెచ్చరించిన ఫణీంద్ర!
రిషికి కాల్ చేసిన పోలీస్ ఆఫీసర్ .. ఆ ఫోన్ ఎవరిదో తెలియలేదు కేవలం ఆ రెండు నంబర్ల నుంచీ మాత్రమే కాల్స్ వెళ్తున్నాయి. ఆ నంబర్లు కూడా ఆల్రెడీ చనిపోయిన వాడి పేరుమీదున్నాయి. అయినా కానీ వాడెవడో కనుక్కుంటాను అంటాడు... సరే తొందరగా ట్రేస్ చేయండని చెబుతాడు రిషి. ఇంతలో ఏంజెల్ ఏడుపు విని బయటకు పరుగుతీస్తాడు..విశ్వనాథం గుండె పట్టుకుని కుప్పకూలిపోతాడు... వెంటనే డాక్టర్ కి కాల్ చేస్తాడు రిషి..
రిషి సార్ ఇంకారాలేదేంటని ఎదురుచూస్తుంటుంది వసుధార. పాండ్యన్ ను పిలిచి ఆరాతీస్తుంది. మరోవైపు రిషి విశ్వనాథం దగ్గరే ఉంటాడు. నాకు భయం వేస్తోంది రిషి నాకెవ్వరూ లేరు విశ్వం తప్ప అని ఏడుస్తుంది ఏంజెల్. ఇకపై మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వెళ్లిపోతాడు డాక్టర్. ఏంజెల్ కు ధైర్యం చెబుతాడు విశ్వనాథం. టెన్షన్ పడకు అని రిషి కూడా చెబుతాడు. జ్యూస్ తీసుకురమ్మని పంపిస్తాడు
విశ్వనాథం: ఏంజెల్ పసిపిల్లగా ఉన్నప్పుడు నా కొడుకు, కోడలకి ఫారెన్ వెళ్లే ఛాన్స్ వచ్చింది. మా ఆవిడ ఏంజెల్ ని ముద్దుగా పెంచింది. ఫారెన్ కి వెళ్లిన ఐదేళ్ల తర్వాత వాళ్లు ఇండియాకి తిరిగొస్తూ ఫ్లైట్ యాక్సిడెంట్ లో చనిపోయారు..ఆ బాధతో మా ఆవిడ చనిపోయింది. అప్పటి నుంచీ ఏంజెల్ ని కంటికిరెప్పలా చూసుకుంటున్నాను. తను పెళ్లిచేసుకుంటే వేరే ఇంటికి వెళ్లిపోతుందని పెళ్లికూడా దాటేస్తూ వస్తోంది. ఇది ప్రాణాపాయం కాదు హెచ్చరిక మాత్రమే..నాకు ఏంజెల్ విషయంలో భయం వేస్తోంది. తనని ఓ మంచి వ్యక్తి చేతిలో పెట్టాలి తనకు నేను లేని లోటుని తీర్చాలి నేను పోయేలోపు ఇది నేరవేరుతుందా రిషి
రిషి: మీరు అలా అనకండి సార్.. కచ్చితంగా మీరు అనుకున్నది జరుగుతుంది. మీక్కూడా ఏమీ కాదు.. ఆరోగ్యంగా ఉంటారు. మీరిప్పుడు ఏమీ ఆలోచించవద్దు ప్రశాంతంగా ఉండండి..ఇంకా ఏంజెల్ రాలేదు..వెళ్లి చూసొస్తానంటూ హాల్లోకి వెళతాడు...
ఏడుస్తున్న ఏంజెల్ ను ఓదార్చుతాడు...
ఏంజెల్: విశ్వంకి ఏంకాదుకదా..
రిషి: నువ్వు ఏడుస్తూ భయపడుతుంటే ఆయనింకా భయపడతారు. నువ్వు ధైర్యంగా ఉండాలికదా చెబుతాడు
ఏంజెల్: ఫస్ట్ టైమ్ బాధగా ఉందంటుంది ఏంజెల్. అమ్మా నాన్న లేరని ఏరోజూ బాధపడలేదు ఉండే బావుండు అనుకునేదాన్ని నా కళ్లలో ఏ రోజూ నీళ్లు రాకుండా పెంచాడు విశ్వం నన్ను. ఇప్పుడు విశ్వానికి అలా జరిగే సరికి కన్నీళ్లు ఆగడం లేదు
రిషి: ఏం కాలేదు కదా ఎందుకు ఏమోషన్ అవుతున్నావు..
నాకు అన్నీ తనే..అందుకే ఆయనతో అంత కలుపుగోలుగా ఉంటాను.. ఎప్పుడూ ఆటపట్టిస్తుంటా..తను మాత్రం నా ఆనందమే తన ఆనందం అనుకున్నాడని బాధపడుతుంది
ఎపిసోడ్ ముగిసింది