Gunde Ninda Gudi Gantalu October 7th Episode: బాలుపై శివ పోలీస్ కంప్లైంట్, ఇంటికి వచ్చి ట్విస్ట్ ఇచ్చిన మీనా - గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 07 ఎపిసోడ్!
Gundeninda GudiGantalu Today episode: కొత్త గొడవ తెచ్చిపెట్టాడు బాలు..ఇంట్లోంచి వెళ్లిపోయింది మీనా... ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

గుండె నిండా గుడి గంటలు అక్టోబర్ 07 ఎపిసోడ్ - Gunde Ninda Gudi Gantalu 2025 October 7th Episod
మీనా ఇంట్లోంచి వెళ్లిపోవడంతో సత్యం, బాలు టెన్షన్ పడుతుంటారు. ప్రభావతి మాత్రం అది ఇంట్లోంచి పోయింది మళ్లీ రాదు.. బాలుగాడిని భరించలేక వెళ్లిపోయింది అంటుంది. ఇక రాదంటారా అని అడుగుతుంది రోహిణి. మనోజ్ కూడా ఉత్సాహంగా వింటుటాడు. ఎప్పుడు ఇంట్లోంచి వెళ్లిపోతుందా అని చూశాను..ఇన్నాళ్లకు వెళ్లిందని సంబరపడుతుంది ప్రభావతి. గడ్డిపెట్టిన సత్యం నువ్వు అసలు అత్తవేనా అని క్లాస్ వేసి.. కామాక్షికి కాల్ చేసి అడుగు వాళ్లింటికి వెళ్లిందేమో అని చెబుతాడు. వెంటనే కామాక్షికి కాల్ చేస్తుంది ప్రభావతి..మీనా కనిపించలేదని తెలిసేసరికి వెంటనే పరిగెత్తుకొస్తుంది కామాక్షి. రావడంతోనే ప్రభావతిని భయపెట్టడం మొదలుపెడుతుంది. ఇంట్లోంచి వెళ్లిపోయిన మీనా ఏమైనా లెటర్ రాసిపెట్టిందా అనే అనుమానంతో రూమ్ మొత్తం వెతుకుతారు. రోహిణి, శ్రుతి కూడా వచ్చి వెతుకుతారు. శ్రుతికి లెటర్ దొరుకుతుంది. ఆ లెటర్ ఓపెన్ చేసిన కామాక్షి... నా చావుకి కారణం ఒక్కరే..ఆ ఒక్కరు మా అత్తగారు అని చదువుతుంది. ప్రభావతి హడలెత్తిపోతుంది. ఇంతలో అదంతా తన ఊహ అని తెలుసుకుని లెటర్లో ఏముందో చెప్పు అంటుంది. కూరగాయల లిస్ట్ ఉంటుంది. హమ్మయ్య అనుకుంటుంది ప్రభావతి.
మరోవైపు అక్క కనిపించడం లేదని శివ టెన్షన్ పడుతుంటాడు. గుణ దగ్గరకు అదే విషయం చెప్పడంతో.. ఇదే అవకాశంగా..తనను జైల్లో పెట్టించిన బాలుని వదలకూడదని ఫిక్సవుతాడు. మీ బావే ఏదో అని ఉంటాడు అని రెచ్చగొడతాడు. భార్య భర్త గొడవలు తేలిగ్గా తీసుకోకూడదు.. అసలే ఈ మధ్య భార్యల్ని హత్య చేస్తున్న భర్తలు ఎక్కువయ్యారని భయపెడతాడు. కంగారుపడిన శివ ఇక పోలీసులను ఆశ్రయించడమే మంచిది అనుకుంటాడు.
మీనాను వెతుకుతూ రోడ్లపై తిరుగుతుంటాడు బాలు. తన స్నేహితుడి రాజేష్ సహాయంతో మొత్తం వెతుకుతాడు.ఆ తర్వాత గుడి దగ్గరకు వచ్చి.. నేను నిన్ను ఎప్పుడూ నమ్మలేదు..కానీ నీపై నమ్మకం కలిగించింది నా మీనా. తను ఒక్కరోజు నా పక్కన లేకపోయినా ఏదో కోల్పోయినట్టుంది, ఒంటరిగా అనిపిస్తోంది..ఎంత వెతికినా కనిపించలేదు. మీనా ఎక్కడుందో నీకు మాత్రమే తెలుసు అని కన్నీళ్లతో భగవంతుడిని వేడుకుంటాడు. ఆ తర్వాత తండ్రి సలహా ఇవ్వడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం బెటర్ అని ఫిక్సవుతాడు. బాలు-రాజేష్ వెళ్లేసరికి శివ అక్కడే ఉంటాడు. ఇతనే మా బావ..మా అక్కను ఏం చేశాడో ఏమో.. వేధించిఉంటాడు..అందుకే ఇంట్లోంచి వెళ్లిపోయింది.. వెంటనే ఇతన్ని అరెస్ట్ చేయండి అంటాడు. శివ చొక్కా పట్టుకుని బాలు వార్నింగ్ ఇస్తాడు. కనిపించకుండా పోయి 24 గంటలు గడిస్తే కానీ కంప్లైంట్ తీసుకోం..మరికొన్ని గంటలు వెయిట్ చేయండి..అప్పటికీ రాకపోతే వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అని పోలీస్ చెప్పి పంపించేస్తాడు.
బాలు దీనంగా ఇంటికి వస్తాడు... అప్పటికే మీనా ఇంట్లో ఉంటుంది. చెప్పాపెట్టకుండా ఎక్కడికి వెళ్లావ్ అని బాలు ఫైర్ అవుతాడు. ఈలోగా ఇంట్లో అందరూ వస్తారు. ఆ వెంటనే హగ్ చేసుకుని..నేనెంత భయపడ్డానో తెలుసా అంటాడు. ఇంతకుముందు పూలవంకతో పని తప్పించుకుని వెళ్లింది..ఇప్పుడు తిట్టాడనే వంకతో రాత్రంతా తిరిగివచ్చింది అంటుంది ప్రభావతి. వాడు ఏదైనా అంటే నాకు చెప్పాలి కానీ ఇలా వెళ్లిపోతే ఎలా అంటాడు సత్యం. పెద్ద పెద్ద గొడవలున్నప్పుడే ఇంట్లోంచి బయటకు వెళ్లేదానివి కాదు ఇప్పుడెందుకు అలా చేశావ్ అని రవి అంటాడు. అందర్నీ బెదిరించాలనే వెళ్లింది అంటుంది ప్రభావతి. అంత రోషం ఉన్నదే అయితే మళ్లీ ఎందుకు తిరిగి వస్తుందని అంటుంది. నన్ను మాట్లాడనిస్తారా అని గట్టిగా చెబుతుంది మీనా. నేను చెప్పే వెళ్లాను అంటుంది. శ్రుతికి చెప్పాను అంటుంది. అప్పుడు గుర్తుచేసుకుంటుంది శ్రుతి. తాను ఫోన్ మాట్లాడుతుండగా మీనా వచ్చి వెళ్లిన సంగతి గుర్తుచేసుకుంటుంది. నేను ఫోన్లో సరే అని చెబితే..మీనా తనకే చెప్పాను అనుకుని వెళ్లిపోయింది అంటుంది. ఇప్పుడు అర్థమైందా అని ప్రభావతి వైపు చూస్తారంతా...






















