Gruhalakshmi December 18th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన దివ్య - విక్రమ్‌ను చంపేందుకు రాజ్యలక్ష్మీ ప్లాన్
Gruhalakshmi Serial Today Episode: విక్రమ్ ను చంపేందుకు రాజ్యలక్ష్మీ ప్లాన్ చేసిందని బసవయ్య, సంజయ్ మాట్లాడుకోవడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఇంట్రస్టింగ్గా జరిగింది.
![Gruhalakshmi December 18th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన దివ్య - విక్రమ్‌ను చంపేందుకు రాజ్యలక్ష్మీ ప్లాన్ Gruhalakshmi serial today December 18th episode written update Gruhalakshmi December 18th Episode: ‘గృహలక్ష్మీ’ సీరియల్: ఇంట్లోంచి వెళ్లిపోయిన దివ్య - విక్రమ్‌ను చంపేందుకు రాజ్యలక్ష్మీ ప్లాన్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/12/18/0b007809d3cf7af5d0a2732cba02b5371702863335212879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Gruhalakshmi Telugu Serial Today Episode: ఇంట్లో వాళ్లందరు కలిసి దివ్యను పిచ్చిదాన్ని చేసేందుకు ప్లాన్ చేస్తారు. అందులో భాగంగా అందరూ హాల్లో చేరి దివ్య రాగానే ఏవేవో మాట్లాడుతుంటే నా ప్రవర్తన వల్ల మీకు ఇబ్బంది కలుగుతే చెప్పండి నేను ఇంట్లోంచి వెళ్లిపోతానని దివ్య అంటుంది. దీంతో కోపంగా విక్రమ్ కూడా రాజ్యలక్ష్మీని తిడతాడు.
విక్రమ్: దివ్య ఎందుకంత ఆవేశం.
దివ్య: వాళ్లు కావాలనే రెచ్చగొడుతున్నారు.
విక్రమ్: అమ్మ దివ్య ప్రవర్తనలో తేడా ఉన్న మాట ఒప్పుకుంటాను. కానీ దాన్ని ఇంతలా భూతద్దంలో చూడక్కర్లేదు. పుట్టింటివాళ్లు సారే ఇవ్వడానికి వచ్చినప్పుడు వాళ్ల నాన్నకు అవమానం జరిగింది. అప్పటి నుంచి దివ్య డిఫ్రెషన్ మూడ్‌లో ఉంది. చాలా బాధపడతుంది.
అనగానే రాజ్యలక్ష్మీ, బసవయ్య తెలివిగా దివ్య బాధ మా బాధ కాదా అంటూ దివ్యను ఓదార్చినట్లు మాట్లాడతారు. తులసి డాబా మీద బట్టలు ఆరబెడుతుంది. ఇంతలో నంద అక్కడకు వస్తారు.
నంద: ఏం లేదు నాన్నగారి గురించి మాట్లాడదామని.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
తులసి: మీరేం చెప్పదలచుకున్నారో నాకర్థం కావడం లేదు.
నంద: ఆయన్ని మనం చూసుకోగలమా? పరిస్థితి ఆలోచిస్తే భయమేస్తుంది.
అనగానే ఈ విషయం పక్కకు పెట్టండి. నాతో జీవితం పంచుకోవాలనే ఆలోచన మీకెప్పుడు వచ్చింది. లాస్యతో విడాకులు తీసుకున్న తర్వాతే కదా. అప్పటి నుంచి ఆ విషయం నాకు చెప్పాలనే మీ సహనం, ఓపిక మీ నాన్నను చూసుకోవడంలో ఎక్కడికిపోయాయి. నాలుగు రోజులకే అలసిపోయారా? అంటూ ప్రశ్నిస్తుంది తులసి. మామయ్య విషయంలో నేను ఎంత కష్టమైనా భరిస్తాను. ఆయనను హ్యాపీగా చూసుకుంటాను అంటుంది తులసి. నిద్రమాత్రలు మింగిన పరంధామయ్య పడిపోయి ఉండటాన్ని గమనించిన అనసూయ కంగారుగా తులసి, నందాలను పిలుస్తుంది.
పై నుంచి తులసి, నందాలు వచ్చి బీపీ టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నాడని గమనించి పరంధామయ్యను హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. దివ్య డైనింగ్ టేబుల్ దగ్గర ప్లేట్లు తుడుస్తూ ఉంటుంది. వాళ్ల తాతయ్య వచ్చి నువ్వు ఈ పనులు చేయొద్దని అంటాడు. ఇంతలో విక్రమ్ హాస్పిటల్‌కు వెళ్తుంటే తాను వస్తానంటుంది దివ్య. రాజ్యలక్ష్మీ, బసవయ్య అక్కడకు వచ్చి దివ్య ఈ పరిస్థితుల్లో హాస్పిటల్‌కు వెళ్లొద్దని అసలే ఉత్తి మనిషి కాదని చెప్పడంతో విక్రమ్ కూడా దివ్యను ఇంట్లోనే ఉండమని చెప్పి వెళ్లిపోతాడు. పరంధామయ్యను పరిశీలించిన డాక్టర్ షాక్ అవుతాడు. బీపీ టాబ్లెట్స్ ఓవర్ డోస్ తీసుకున్నందుకు ఈ పరిస్థితి వచ్చిందంటాడు.
డాక్టర్: ఆయన అల్జీమర్ పేషెంట్ మీరు నిర్లక్ష్యంగా ఉంటే ప్రతిరోజు గండమే.. ఆ సంగతి ఎప్పటికి తెలుసుకుంటారు.
నంద: మామూలుగా ఆయన పక్కన ఎవరో ఒకరం ఉంటూనే ఉంటాం డాక్టర్.
డాక్టర్: మరెందుకు జరిగింది ఇలా.. ఇది చాలా ప్రమాదం. హర్ట్ ఎటాక్ వచ్చే చాన్సెన్స్ కూడా ఉన్నాయి.
అంటూ డాక్టర్ చెప్పడంతో తులసి, నంద షాక్ అవుతారు. మీరు కొద్దిగా నిర్లక్ష్యంగా ఉన్నా చాలా ప్రమాదం అని డాక్టర్ హెచ్చరిస్తాడు. దివ్య గార్డెన్‌లో కూర్చుని ధ్యానం చేసుకుంటుంది. దివ్యకు వినిపించేలా.. టెర్రస్ పై నుంచి బసవయ్య, సంజయ్ మాట్లాడుకుంటుంటారు. హాస్పిటల్‌కు వెళ్లిన విక్రమ్‌ను చంపడానికి రాజ్యలక్ష్మీ ప్లాన్ చేసిందని మాట్లాడుకుంటారు. దీంతో షాక్ అవుతుంది దివ్య. విక్రమ్‌కు ఫోన్ చేస్తుంది. విక్రమ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. దివ్య కంగారుగా బయటకు పరుగెడుతుంది. పరంధామయ్యను తీసుకుని నంద, తులసి ఇంటికి వస్తారు.
అనసూయ: ఏవండి వచ్చారా?
పరంధామయ్య: రాననుకున్నావా?
అనసూయ: ఇంకెప్పుడూ అలా అనకండి. తప్పు నావల్లే జరిగింది. అన్ని తెలిసి కూడా బీపీ టాబ్లెట్స్ మీ పక్కనే పెట్టేసి వెళ్లిపోయాను.
తులసి: అత్తయ్య అయిపోయింది కదా ఇక దాని గురించి వదిలేయండి. మామయ్య క్షేమంగా తిరిగొచ్చారు. నీరసంగా ఉన్నారు. గదిలోకి తీసుకెళ్లండి కాసేపు పడుకుంటారు.
అనసూయ: అలాగేనమ్మ పదండి.
తులసి: మీరు వెళ్లండి మామయ్య వేడివేడిగా పాలు తీసుకొస్తాను.
నంద: తులసి ఎందుకు నామీద నీకు అంత అనుమానం. ప్రతి విషయంలో తప్పు పడుతున్నావ్, ప్రతి విషయంలోనూ నన్ను అనుమానిస్తున్నావ్
అనగానే తులసి ప్రతి విషయానికి సమాధానం చెప్పే ఓపిక నాకు లేదు అంటుంది. అసలు ఎందుకు నా విషయంలో కలగజేసుకుంటున్నావు అంటూ ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read : విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)