అన్వేషించండి

Gruhalakhsmi November 2nd : ‘గృహలక్ష్మీ’ సీరియల్‌ : లాస్యకు వార్నింగ్‌ ఇచ్చిన నంద - తులసిపై కిడ్నాప్‌ కేసు పెట్టిన లాస్య

మనసు మార్చుకున్న నందగోపాల్‌ హనిని అప్పజెప్పనని లాస్యకు వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ఆసక్తికరంగా మారింది.

తులసి రోడ్డు మీద ఒంటరిగా నిలబడి ఎవ్వరూ తనను అర్థం చేసుకోవడం లేదని బాధపడుతుంది. అందరికి నేను  మంచి చేయాలనుకుంటే నాకు ఎప్పుడూ చెడే జరుగుతుంది. ఏదేమైనా సరే హనికి మంచి జీవితం ఇవ్వాలనుకుంటుంది తులసి. నందు తన ఫోన్  ఎందుకు లిఫ్ట్‌ చేయడం లేదోనని బాధపడుతుంది. ఇంతలో తులసికి వాళ్ల మామగారు ఫోన్‌ చేస్తారు.

తులసి : మామయ్య దారిలోనే ఉన్నాను వచ్చేస్తున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు. దివ్య కూడా క్షేమంగా ఉంది. అవును హని ఏం చేస్తుంది. ఒకసారి ఫోన్‌ ఇస్తారా? మాట్లడతాను. మాట్లాడరేంటి ? మామయ్య ఫోన్‌ హనికి ఇవ్వండి.

మామగారు : ఇవ్వడానికి హని ఇంట్లో లేదమ్మా.. నందు తీసుకెళ్లాడమ్మా నాకు చెప్పకుండా దొంగతనంగా తీసుకెళ్లాడమ్మా.. వాళ్లింట్లో అప్పజెప్పడానికే ఉండొచ్చు. కాల్‌ చేస్తుంటే లిఫ్ట్‌ చేయడం లేదమ్మా..

తులసి : అలా ఎలా తీసుకెళ్లనిచ్చారు మామయ్య. ఇంత రిస్క్‌ తీసుకుని నేను హనిని కాపాడింది దాన్ని ఆ నరకంలో పడేయడానికా? ఆయన హనిని అప్పజెప్తే దాని బ్రతుకు నాశనం అయినట్లే.. నా శ్రమంతా వృథా అయినట్లే..

అంటూ ఫోన్‌ కట్‌ చేసి నందుకు ఫోన్‌ చేస్తుంది. నందు ఫోన్‌ లిఫ్ట్‌ చేయకపోతే హని పక్కనే ఉంటుంది కదా హనికి కాల్‌ చేద్దాం అనుకుని కాల్‌ చేస్తుంది.

హని: అంకుల్‌ తులసి ఆంటీ ఫోన్‌ చేస్తుంది.

నందు : తను వచ్చిందంటే మనకు ప్రాబ్లమ్‌ అమ్మ.. నేను అనుకున్నది జరగదు.  అదే మనం ఫ్రీ గా ఎంజాయ్‌ చేయలేం. ప్రతి దానికి అడ్డుపడుతుంది. ఆంటీ కాల్‌ కట్‌ చేసేయ్‌.

హని : అలాగే అంకుల్‌

హని కాల్‌ కట్‌ చేస్తుంది. ఇంటి దగ్గర లాస్య, నందు కోసం ఎదురు చూస్తుంటుంది.

రత్న : ఒకసారి నందుకు కాల్‌ చేస్తే తెలుస్తుందిగా

లాస్య:  పక్కన హని ఉంటుంది ఫోన్  లిఫ్ట్‌ చేయడు.

అని మాట్లాడుకుంటుండగా నందు కారు లాస్య ఇంట్లోకి వస్తుంది. కారు ఆగగానే హని భయపడుతూ అంకుల్‌ మీరు నన్ను చీట్‌ చేశారు. నన్ను కొత్త ఆంటీకి అప్పగిస్తున్నారా? అంటూ నందుని తిడుతుంది. నందు, హనిని బలవంతంగా లాక్కుని లాస్య దగ్గరకు తీసుకెళ్తాడు. లాస్య హ్యాపీగా హనిని రత్నకు అప్పగిస్తుంది. హని హృదయవిదారకంగా బాధపడుతుంది. తనను తీసుకెళ్లమని బతిమాలుతుంది. రత్న చేతుల్లోంచి విడిపించుకొని వచ్చి నందు కాళ్లపై పడి ఏడుస్తుంది హని. రత్న, హనిని లాక్కెళ్లబోతుంటే.. నందు అడ్డుపడతాడు.

లాస్య: నందు ఏంటి నువ్వు చేస్తున్న పని హనిని రత్నకు అప్పజెప్పు..

నందు : అప్పజెప్పను

లాస్య: నిప్పుతో చెలగాటమాడుతున్నావ్‌

నందు : ఈ నిప్పుల కొలిమిలో హనిని వదిలేయలేను. ఇక్కడికి తీసుకొచ్చి తప్పు చేశాను. మీ ప్రవర్తన కళ్లారా చూసిన తర్వాత తప్పు తెలుసుకున్నాను.

రత్న: నష్టపోతావ్‌ అది తెలుసుకో..

నందు : సిద్దపడే ఉన్నాను.

లాస్య: అయితే దివ్య మీద ఆశ వదులుకో..

అనగానే తులసి అక్కడకు వస్తుంది.

తులసి : దివ్య క్షేమంగానే ఉంది. దివ్యను నేను విడిపించాను. తనిప్పుడు క్షేమంగా వాళ్లింట్లో ఉంది.

లాస్య: దివ్యను విడిపించుకున్నంత మాత్రాన కథ అయిపోదు. నీ కష్టాల కథ ముగిసిపోదు. అటు మీరు ఇటు మేము ప్రశాంతంగా ఉండము. మర్యాదగా హనిని అప్పగించి వెళ్లండి.

నందు : ఇక చాలు నీ బెదిరింపులకు ఎవ్వరూ భయపడరు. తులసికి అండగా నేనుంటాను.  

తులసి: నా కుటుంబానికి నేను శత్రువుగా మారతానన్నావుగా లాస్య. ఇప్పుడేమంటావ్‌ అన్యాయం కొద్ది రోజులు రాజ్యమేలొచ్చు. కానీ చివరికి గెలిచేది న్యాయం మాత్రమే.

అని లాస్యకు వార్నింగ్‌ ఇచ్చి నందు, తులసి, హనిని  తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. లాస్య, రత్న షాకింగ్‌ గా చూస్తుండిపోతారు.

దివ్య ఇంట్లో వాళ్లు అన్న మాటలు గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది.

విక్రమ్‌ : సారీ దివ్య.. నీ మనసు బాధపెట్టాను.  అమ్మ ఎవరికైనా అమ్మే మా అమ్మను నువ్వేమైనా అంటే కచ్చితంగా బాధనిపిస్తుంది. అలాగే నేను మీ అమ్మను అంటే నీకు బాధగానే అనిపిస్తుంది. ఇది చెప్పక్కర్లేదు దివ్య తెలిసిపోతుంది.

దివ్య: అమ్మ బాధపడుతూ వెళ్లింది.

అనగానే ఫోన్‌ చేసి సారీ చెప్తాను అంటాడు విక్రమ్‌. కిడ్నాపర్ల గురించి తలుచుకుంటేనే ఎంతో కోపం వచ్చిందని..  అందుకే అలా చేశానని ఆ కోపంలో ఏం మాట్లాడానో అర్థం కాలేదని చెప్తాడు విక్రమ్‌. అయితే ఇప్పటి నుంచి అన్నీ మరిచిపోయి హ్యాపీగా ఉందామని దివ్య చెప్పడంతో ఇవాళ్టి ఏపిసోడ్‌ ముగుస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget