Gruhalakshmi August 23rd: అత్తకి షాకిచ్చి మరిదిని మడతేట్టేసిన దివ్య- లక్కీ వంకతో నందు చుట్టూ తిరుగుతున్న లాస్య
lఆసియా నందుకి దగ్గర అవడం కోసం లక్కీని అడ్డం పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
దివ్య తన మావయ్యని ప్రకాశం గార్డెన్ లోకి తీసుకొస్తుంది. వీల్ చైర్ లో నుంచి లేచి నడవడం ప్రాక్టీస్ చేయాలని దివ్య చెప్తుంది. అదంతా విక్రమ్ చూస్తూనే ఉంటాడు. వద్దు మీ అత్తయ్యలాగా కాలు విరిగితే కష్టమని భయపడతాడు. కానీ దివ్య మాత్రం ప్రకాశాన్ని నెమ్మదిగా పైకి లేపి నడిపించేందుకు ప్రయత్నిస్తుంది. తండ్రి నడవడం చూసి విక్రమ్ ఎమోషనల్ అవుతాడు. ఎదురుగా కుంటుకుంటూ రాజ్యలక్ష్మి నడుస్తుంది. నువ్వు కుంటుతున్నావ్ నేను కుంటుతున్నా ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని ప్రకాశం సెటైర్ వేస్తాడు. సరిగా ప్రియ అప్పుడే పై నుంచి పూల కుండీ రాజ్యలక్ష్మికి కాస్త దూరంలో పడేలా చేస్తుంది. దీంతో దెబ్బకి భయపడిపోతుంది. అది చూసి విక్రమ్ కంగారుగా తల్లి దగ్గరకి వచ్చి ఏం కాలేదు కదా అని తనని పట్టుకుంటాడు.
ప్రకాశం: రాజ్యం నువ్వు అసలు బయటకి రాకు.. ఇంట్లోనే ఉండు
దివ్య: జాతకంలో ఏదో దోషం ఉంటేనే ఇలాంటి అరిష్టాలు జరుగుతూ ఉంటాయి. అది పోగొట్టేలా మనం చూడాలి. పంతుల్ని పిలిపించి అత్తయ్య జాతకం చూపిద్దాం
రాజ్యలక్ష్మి: వద్దని చెప్తున్నా కదా
Also Read: నిజం తెలిసి ఏంజెల్ మీద అరిచిన రిషి- మిస్టర్ ఇగోకి ప్రేమలేఖ రాసిన వసుధార
విక్రమ్: అమ్మ అంతే అంటుంది. నువ్వు పంతుల్ని పిలిపించి జాతకం చూపించు
లక్కీ తులసి వాళ్ళతో కలిసి కేఫ్ కి వస్తాడు. అక్కడ వాడి షూ లేస్ ఊడిపోతే నందు కట్టడం అటు నుంచి తులసి, ఇటు లాస్య ఇద్దరూ చూస్తారు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు లాస్య తెగ సంతోషపడిపోతుంది.
లాస్య: లక్కీ గురించి మాట్లాడదామని వచ్చాను
లక్కీ: ఇంట్లో ఉంటే లాక్కుని వెళ్తావాని డాడీతో కలిసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి కూడా వస్తావని అనుకోలేదు. ఇన్ని రోజులు నీ దగ్గరే ఉన్నా కదా మమ్మీ ఇప్పుడు డాడీ దగ్గర ఉంటాను. నాకు డాడీ దగ్గర బాగుంది ఆంటీ మమ్మీని వెళ్లిపొమ్మని చెప్పండి
లాస్య: అలా చెప్పే హక్కు వాళ్ళకి లేదు, ముచ్చట పడుతున్నావని ఉంచాను. కానీ అలా కుదరదు
తులసి: వాడిని ఏడిపించకుండా తీసుకెళ్లు
నందు; రేయ్ నువ్వు మీ అమ్మతో ఇంటికి వెళ్ళు
లక్కీ: నేను ఆ ఇంటికి వెళ్ళను. డాడీతో ఉంటాను. అదే నా ఇల్లు
లాస్య: నాకు డివోర్స్ ఇచ్చి అన్యాయం చేశావ్.. ఇప్పుడు నా కొడుకుని దూరం చేసి మరోసారి అన్యాయం చేస్తున్నారని దొంగ ఏడుపు నటించి వెళ్ళిపోతుంది.
పంతులు రాజ్యలక్ష్మి జాతకం చూస్తు ఉంటాడు. పంతులు ఏదో ఒకటి చెప్తాడని భయపడిన రాజ్యలక్ష్మి తమ్ముడిని ఉసిగొల్పుతుంది. దివ్య కల్పించుకుని అత్తయ్య మీద ప్రేమ ఒలకబోస్తుంది. మంగళ దోషం ఉందని అది పోవాలంటే కొడుకుతో పూజలు చేయించమని చెప్తాడు. విక్రమ్ కదా పూజలు చేసేదని బసవయ్య అంటాడు. కాదు రాజ్యలక్ష్మి కొడుకు సంజయ్ చేయాలని అనేసరికి దెబ్బకి అందరూ షాక్ అవుతారు.
విక్రమ్: నేను కదా పెద్ద కొడుకుని సంజయ్ చేయడం ఏంటి?
పంతులు: పెద్ద కొడుకే కానీ రక్తం పంచుకుని పుట్టిన కొడుకు కాదు కదా. పరిహారం చేయాల్సింది సంజయ్ బాబు
దివ్య: పరిహారం ఏం చేయాలి?
పంతులు: 101 రోజులు శివారాధన దీక్ష చేయాలి. ఆ నూటొక్క రోజులు శివుడు గుళ్ళు తిరిగి వస్తూ ఉండాలి
ప్రియ; అప్పుడు నాతో చేయించారు కదా ఇప్పుడు ఈయన రోగం కుదురుతుంది
పంతులు: అంతే కాదు రోజూ ఉదయం, సాయంత్రం చన్నీటి స్నానం చేయాలి. 101 బిందెలతో శివుడికి అభిషేకం చేయాలి. పళ్ళు, పచ్చి కూరలు తినాలి. అది కూడా నిష్టగా నేల మీద కూర్చుని తినాలి. దీక్ష సమయంలో ఎలాంటి భోగాలు అనుభవించకూడదు
విక్రమ్: మీరు చెప్పినట్టే చేస్తాడు
దివ్య నవ్వుతూ అత్తవైపు పొగరుగా చూస్తుంది.