Gruhalakshmi July 6th update: ప్రేమ్ ఇంటికి వెళ్ళిన తులసి, పాటల పోటీకి వెళ్ళనన్న ప్రేమ్
లాస్యని ముప్పుతిప్పలు పెట్టి తన దగ్గర కాజేసిన డబ్బుని తిరిగి తెచ్చుకుంటుంది తులసి. దీంతో బ్యాంక్ లోన్ తిరిగి ఇచ్చేసి రద్దు చేయించాలని అనుకుంటుంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
అత్తయ్య నేను బ్యాంక్ కి వెళ్ళి అటు నుంచి సంజన వాళ్ళ ఇంటికి సంగీతం నేర్పించడానికి వెళ్తానని అంటుంది తులసి. మ్యూజిక్ స్కూల్ లీజుకు తీసుకుని బ్యాంక్ వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది కదా మళ్ళీ బ్యాంక్ కి వెళ్ళడం దేనికి ఆంటీ అని అంకిత అంటుంది. కానీ తులసి బ్యాంక్ లోన్ తీరుస్తానని అంటుంది. లోన్ రావడమే కష్టమైతే నువ్వు వచ్చిన లోన్ తిరిగి ఇస్తాను అంటా వెంటీ అని పరంధామయ్య అడుగుతాడు. నా పక్కన భర్తగా ఉండే అర్హత లేదని అనిపించగానే మీ అబ్బాయికి విడాకులు ఇచ్చాను, అలాంటిది అర్హత లేని లోన్ ని నేను ఎలా ఒప్పుకుంటానని ప్రశ్నిస్తుంది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి తీసుకున్న లోన్ ని నేను ఎలా వాడుకుంటాను నేరమని చెప్పి బ్యాంక్ కి వెళ్లేందుకు బయటకి వస్తుంది. అప్పుడే బ్యాంక్ అధికారులు తులసి దగ్గరకి వస్తారు.
నామీద పోలీస్ కేస్ పెట్టి నన్ను అరెస్ట్ చేయించడానికి వచ్చారా అని తులసి అడగ్గా లేదండీ మీరు మోసపోయారని మాకు తెలుసని వాళ్ళు చెప్తారు. మీ బెదిరింపులకి నేను తట్టుకుని నిలబడ్డాను కాబట్టి సరిపోయింది అదే ఎవరైనా పిరికి వాళ్ళు అయితే గుండె ఆగి చచ్చిపోతారు. మా లాంటి బలహీనులని అయితే వెంటపడి వేధిస్తారు. అదే ఎవరైనా బడాబాబులైతే మాత్రం బ్రతిమలాడుకుంటారు కోర్టులు కేసులు అని కొన్నేళ్ళ పాటు గడిపేస్తారు. ఇప్పటికైనా మారండి సార్ అని వచ్చిన బ్యాంక్ అధికారులని తులసి దులిపేస్తుంది. తర్వాత చెక్ ఇస్తూ నా లోన్ ని సరిపెట్టుకుని దాన్ని రద్దు చెయ్యమని చెప్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించండి మేడమ్ అని వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు.
లోన్ అమౌంట్ కట్టడానికి మీ మమ్మీకి బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన టైమ్ ఈరోజుతో అయిపోయిందని గాయత్రి అభితో అంటుంది. నో డౌట్ ఆంటీ మమ్మీ లోన్ తీర్చాలంటే అంకిత డబ్బు వాడుకోవాలి వేరే దారి లేదు ఏదేమైనా మీతో మామ్ చేసిన ఛాలెంజ్ లో ఒడిపోతుందని అభి అంటాడు. ఒక్కసారి అంకితకి ఫోన్ చేసి విషయం కనుక్కోమని అభి చెప్తాడు. దీంతో గాయత్రి అంకితకి ఫోన్ చేస్తుంది. దాపరికం ఎందుకు నేను ఎందుకు ఫోన్ చేశానో నీకు తెలుసు అని గాయత్రి అంటుంది. బ్యాంక్ లోన్ పేమెంట్ ఆంటీ చేసిందా లేదా షూరిటీ సంతకం పెట్టిన నేను చేశానా అని తెలుసుకోవడానికి చేశావా అని అంకిత గాయత్రిని ప్రశ్నిస్తుంది. ఏం సమాధానం చెప్తే నువ్వు హ్యాపీ గా ఫీల్ అవుతావ్ మామ్ ఆంటీ కట్టింది అంటే నీ కూతురు డబ్బు ఖర్చు కాలేదని సంబర పడతావ్.. అదే నేను కట్టానని చెప్పిన సంతోషమే ఎందుకంటే ఆంటీ ఇచ్చిన మాట తప్పిందని నేను ఆ ఇంటికి వచ్చేస్తానని అనుకుంటావ్. నీతో పాటు నీ పక్కనే కూర్చుని నా మాటలు వింటున్న నీ అల్లుడిని అడుగు ఏం జరిగితే బాగుంటుందో అని అంకిత అంటుంది. మా ఆంటీ సింహం తన లోన్ అమౌంట్ తానే తీర్చుకుందని చెప్తుంది. ఇప్పటికైనా తన తల్లి విలువ తెలుసుకోమని అభికీ నా మాటగా చెప్పమని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది.
ఇక తులసి మా ప్రేమ్ కి కూడా పాటల పోటీల్లో పాల్గొనే అవకాశం ఇస్తారా అని సంజనని అడుగుతుంది. దానికి ఆమె ఒప్పుకుని రిజిస్ట్రేషన్ ఫామ్ ఇస్తుంది. దాన్ని తీసుకుని తులసి శ్రుతి దగ్గరకి వస్తుంది. ఇన్ని రోజులకి మమ్మల్ని చూడాలనిపించిందా అని శ్రుతి ఎమోషనల్ అవుతుంది. పాటల పోటీలకి సంబంధించిన ఎంట్రీ ఫామ్ వాడికి ఇచ్చి పోటీల మీద దృష్టి పెట్టమని చెప్తుంది. ప్రేమ్ కాంపిటీషన్ కి వెళ్ళను అంటున్నాడని శ్రుతి చెప్తుంది. వాడు వెళ్ళను అంటే నువ్వు వదిలేశావా ఎదగడానికి జీవితంలో ఇంతకంటే మంచి అవకాశం ఉంటుందా అని తులసి అంటుంది. కానీ నేను అన్నీ విధాలుగా ట్రై చేశాను కానీ ప్రేమ్ ఒప్పుకోవడం లేదని చెప్తుంది. అదే టైమ్ కి ప్రేమ్ రావడం గమనించిన తులసి తలుపు వెనుక దాక్కుంటుంది.
శ్రుతి చేతిలో కాగితం చూసి ఏంటి అది అని ప్రేమ్ అడుగుతాడు. ఇప్పుడే మా ఫ్రెండ్ వచ్చి వెళ్ళింది పాటల పోటీల్లో పాల్గొనడానికి ఎంట్రీ ఫామ్ ఇచ్చిందని చెప్తుంది. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను కదా మళ్ళీ ఇదంతా ఎందుకు అని ప్రేమ్ సీరియస్ అవతాడు. నేను చెప్పింది అర్థం కాదా లేకపోతే నన్ను లెక్క చేసేది ఏంటి అని అనుకున్నవా అని ప్రేమ్ తిడతాడు. ఇదంతా చాటుగా తులసి వింటూ ఉంటుంది. నాకు పాడాలని లేదు ఆ ఫామ్ ని చించేసి పారేయ్ నీ కొడుకు చేతకాని వాడిని, నేను ఒడిపోయాను అని మా అమ్మకి చెప్పమని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక తులసి “గాలి చిరుగాలి.. నిను చూసిందేవరమ్మ” అని పాటపడుతూ ప్రేమ్ మనసు కరిగించాలని ప్రయత్నిస్తుంది. ఆ పాట శ్రుతినే పాడిందని ప్రేమ్ అనుకుంటాడు. నిన్ను బాధ నుంచి బయట పడేయడానికి మీ అమ్మే నా చేత ఆ పాట పాడించిందని చెప్తుంది. నువ్వు పిరికివాడిలాగా ఉండిపోవడం మాకు నచ్చని విషయం నువ్వు కచ్చితంగా సాధించగలవ్ అని ప్రేమ్ ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ మాటలు విన్న ప్రేమ్ అమ్మ పాట నన్ను కరిగించింది, నేను తప్పకుండా ప్రయత్నిస్తానని అంటాడు. దాంతో ఇద్దరు సంతోషిస్తారు.
తరువాయి భాగంలో..
ఇక ప్రేమ్ నిస్సహాయంగా ఆలోచిస్తూ ఉంటాడు. శ్రుతి ఏడ్చుకుంటూ తులసికి ఫోన్ చేసి బాధపడుతుంది. ప్రేమ్ కాంపిటీషన్ లో పాల్గొంటాడని నాకు నమ్మకం లేదని ఏడుస్తుంది.