Janulyri: పదో తరగతిలోనే పెళ్లి, 'ఢీ'లో రిజెక్షన్... 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 2' విన్నర్ జాను ఇంటర్వ్వూ
Janulyri Interview On Marriage: ఢీ సెలబ్రిటీ స్పెషల్ 12' విన్నర్ జాను తాజాగా ఓ చిట్ చాట్ లో భాగంగా తన పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.
ఢీ సెలబ్రిటీ స్పెషల్ 12' ఎపిసోడ్ విన్నర్ జాను లిరి తాజాగా ఓ చిట్ చాట్ లో పాల్గొంది. అందులో భాగంగా ఆమె ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా అభి మాస్టర్ తనను కంటెస్టెంట్ గా తీసుకోవడానికి వెనకడుగు వేశాడని ఎవ్వరికీ తెలియని విషయాన్ని వెల్లడించింది. అలాగే నెగిటివ్ కామెంట్స్ చేసే వారిపై షాకింగ్ కామెంట్స్ చేసింది. జానపద పాటలకు డాన్స్ చేసి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన జాను, ఇప్పుడు 'ఢీ సెలబ్రిటీ స్పెషల్ 12' షో విన్నర్ గా నిలిచి అందరి మన్ననలు అందుకుంటుంది. ఈ షోలో అదిరిపోయే డాన్స్ చేసి శేఖర్ మాస్టర్ ను ఫిదా చేసిన ఈ అమ్మడు తాజాగా ఓ చిట్ చాట్ లో తన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను బయట పెట్టింది. అందులో భాగంగా తనకు ఎదురైన వరుస ప్రశ్నలకు జాను సమాధానాలు ఇచ్చింది.
1. మీకు పదవ తరగతిలోనే పెళ్లయిందట నిజమేనా? అయితే ఎందుకు?
జాను : అప్పట్లో మెచ్యూరిటీ లేకపోవడం వల్ల అలా పెళ్లి చేసుకున్నాను. దానికి పెద్దగా కారణమేమీ లేదు. తెలియని వయసులోనే పెళ్లి చేసుకోవాలని అనిపించి, అలా పదో తరగతిలో పెళ్లి చేసుకున్నాను.
2. మీ వీడియోలకు బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి?
జాను : అలా కామెంట్ చేసిన వారు కనిపిస్తే వాడి ఇంటికి వెళ్లి నరకాలనిపిస్తుంది.
3. ఢీ షోలో మిమ్మల్ని అభి మాస్టర్ వద్దు అనుకున్నారట. నిజమేనా?
జాను : అవును. నేను ఫోక్ సాంగ్స్ కి ఎక్కువగా డాన్స్ చేసేదాన్ని. అందుకే ఆయన నన్ను కంటెస్టెంట్ గా తీసుకోవాలి అన్నప్పుడు... అసలు అన్ని రకాల స్టైల్స్ లో డాన్స్ చేయగలనా అని అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఒక్కో విధంగా డాన్స్ చేస్తూ ఉంటే ఆయనకు నమ్మకం పెరిగింది.
4. మీ జీవితంలో ఇదే ఆఖరి రోజు అనుకుంటే ఏం చేస్తారు?
జాను : ఒకవేళ నా జీవితంలో ఇదే ఆఖరి రోజు అయితే మా అబ్బాయి లిరికి మంచి లైఫ్ ఇచ్చి పోతాను. వాడిని అన్ని రకాలుగా సెటిల్ చేసి, ఎలాంటి ప్రాబ్లం రాకుండా చేస్తాను.
5. ఢీ షోకి జడ్జిగా ఉన్న కొరియోగ్రాఫర్లలో ఎవరంటే ఎక్కువ ఇష్టం?
జాను : ముగ్గురూ ఇష్టమే.
6. శోభిత, చిట్టి, పండులలో ఎవరంటే ఎక్కువ కోపం?
జాను : పండునే. నా గురించి ఓ వీడియో చేసినప్పుడు దాన్ని చేసి మళ్లీ మళ్లీ చేసి బాగా ఏడిపించాడు. తప్పకుండా పండు అంటేనే కోపం.
7. డాన్స్ లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు?
జాను : ఇన్స్పిరేషన్ అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. శ్రియ అద్భుతంగా డాన్స్ చేస్తుంది. ఆమెను చూసి నేను డాన్స్ చేయడం మొదలు పెట్టాను.
8. మీ కెరీర్ మొదటి నుంచి ఇప్పటివరకు ఎలా అనిపిస్తోంది?
నేను ముందు వెల్కమ్ డాన్స్ నుంచి స్టార్ట్ చేసి ఫోక్ సాంగ్స్ వరకు ఎదిగాను. ఆ తర్వాత ఢీలో ఛాన్స్ వచ్చింది.
9. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్... ఈ హీరోలలో ఎవరంటే ఇష్టం?
జాను : ప్రభాస్ అంటే ఇష్టం.