Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today September 16th: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: అసలు జున్ను తండ్రి నువ్వేనా అని మిత్రని ప్రశ్నించి ఆలోచనలో పడేలా చేసిన మనీషా!
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Today Episode జున్ను కోసం మిత్ర సంతకం చేయడం లక్ష్మీ సంతోషంగా ఆ విషయం అందరికీ చెప్పడం మనీషా రగిలిపోయి మిత్రని ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode జున్ను ప్రోగ్రస్ కార్డు మీద సంతకం పెట్టిందని ఎవరని అందరూ ఒకర్ని అడుగుతారు. లక్ష్మీ పెట్టి ఉంటుందని అనుకొని లక్ష్మీని అడిగితే తాను పెట్టలేదని లక్ష్మీ చెప్తుంది. అందరూ షాక్ అవుతారు. ఆ మాటలు వింటున్న దేవయాని మనీషా షాక్ అయి మనీషా చేసిందేమో అని దేవయాని మనీషాని అడిగితే నేనెందకు చేస్తానని మనీషా అంటుంది. ఎవరూ చేయకపోతే ఇంకెవరు చేసుంటారని జయదేవ్ అడుగుతాడు.
లక్ష్మీ నవ్వుతూ సంతోషంగా మిత్ర చేశారని చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోతారు. రాత్రి గదిలో గదిలో తాను లక్కీ పడుకొని ఉంటే మిత్ర వచ్చి చూసి జున్ను పక్కనే ఉన్న ప్రోగ్రస్ కార్డు తీసుకొని సంతకం పెట్టారని లక్ష్మీ చెప్తుంది. ఆ సీన్ చూపిస్తారు. మిత్ర సంతకం పెడితే లక్ష్మీ అద్దంలో చూసి ఎమోషనల్ అవుతుంది. మిత్ర వెళ్లిపోయిన తర్వాత ఆ కార్డు చూసి ఏడుస్తూ దాన్ని చూస్తుంది.
అరవింద: ఎంత మంచి మాట చెప్పావ్ లక్ష్మీ నా మనసు అంతా సంతోషంతో నిండిపోయింది.
లక్ష్మీ: ఆ క్షణం నేను ఇంకా నమ్మలేదు ఏదో అద్భుతం జరిగిందని అనుకున్నా.
వివేక్: నిజంగా ఇది అద్భుతం వదినా. అన్నయ్య మనసు మారుతుందని నేను అనుకోలేదు.
జయదేవ్: మన ఈ సంతోషం క్షణికావేశమే శాశ్వతం కాదు. మిత్ర ఆ సంతకం అందరి ముందు చేసుంటే నేను సంతోషించేవాడిని. కానీ వాడు మనకు తెలీకుండా సంతకం చేశాడు.
అరవింద: ఎలా అయితే ఏంటి అండీ మిత్ర మనసులో జున్నుకి స్థానం ఇచ్చాడు కదా.
జయదేవ్: మిత్ర మనసులో ముందు లక్ష్మీకి స్థానం ఉండాలి. తనని భార్యగా మిత్ర ఒప్పుకోవాలి.
అరవింద: ఆ మంచి రోజులు కూడా త్వరలోనే వస్తాయి.
జాను: అదే జరిగితే మా అక్క కష్టాలు అన్నీ తీరిపోతాయి.
లక్ష్మీ తన గురించి తనకు ఆలోచన లేదు అని జున్ను గురించే తన ఆలోచన అని చెప్తుంది. మీ మంచి మనసే మీకు కాపాడుతుందని త్వరలోనే అన్నయ్య మిమల్ని భార్యగా ఒప్పుకుంటాడని వివేక్ అంటాడు. ఆ మాటలకు మనీషా రగిలి పోతుంది. మిత్రను ప్రశ్నించడానికి వెళ్లబోతే దేవయాని ఆపేస్తుంది. ఆలోచించి అడుగేయాలని అంటుంది.
జున్ను లక్కీతో కలిసి మిత్ర దగ్గరకు వెళ్లి థ్యాంక్స్ చెప్తాడు. స్కూల్‌కి వెళ్లి అందరికీ సంతకం చూపించి నువ్వే నాన్న అని చెప్తామని అంటాడు. ఇక దేవయాని, మనీషాలు చాటుగా వాళ్ల మాటలు వింటారు. ఇద్దరు పిల్లలు లక్ష్మీ, మిత్రలు మా తల్లిదండ్రులని అందరికీ చెప్తామని అంటారు. ఇక మిత్ర వాళ్లని వెళ్లి రెడీ అవ్వమని స్కూల్‌లో డ్రాప్ చేస్తానని చెప్తాడు.
సంతకం ఎందుకు పెట్టావని మనీషా మిత్రని ప్రశ్నిస్తుంది. ఈ రోజు జున్నుని అంగీకరించి రేపు లక్ష్మీని అంగీకరించి నన్ను బయటకు గెంటేస్తావని అంటుంది. మిత్ర లక్కీ కోసం మొత్తం చేశానని అంటే రేపు లక్కీ లక్ష్మీ కావాలి అంటే లక్ష్మీ కోసం బాధ పడితే లక్ష్మీని కూడా భార్యగా అంగీకరిస్తావా అని అంటుంది. అదే జరిగితే తాను చనిపోతానని మిత్రతో చెప్తుంది. కోపంతో మనీషా జున్ను నీ కొడుకో కాదో తెలీదని జున్ను నీకు పుట్టాడని గ్యారెంటీ ఏంటి అని పుల్ల పెట్టి వెళ్లిపోతుంది. మిత్ర ఆలోచనలో పడతాడు. దేవయాని మనీషాని పొగిడేస్తుంది.
లక్ష్మీ జున్ను, లక్కీలకు ప్రేమగా టిఫెన్ పెడుతుంది. అరవింద, జయదేవ్ వాళ్లు కూడా సంతోషిస్తారు. ఇక లక్ష్మీ అందరికీ టిఫెన్ ఒడ్డిస్తుంది. వివేక్ పక్కన జాను కూర్చొంటే దేవయాని వచ్చి పక్కనెందుకు వాడి ఒడిలో కూర్చొంటే ఇంకా బాగుంటుందని అంటుంది. జాను అత్తయ్య అని అంటే ఎవరే నీకు అత్తయ్య నా కొడుకు నీకు తాళి కట్టావా అని ప్రశ్నిస్తుంది. అందరూ వచ్చి ఇంట్లో దూరడానికి ఇదేమైనా ధర్మసత్రమా దిక్కులేని వాళ్లు అంతా వస్తున్నారని అంటుంది. దేవయానిపై అరవింద విరుచుకుపడుతుంది. జాను ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తని అడ్డంగా బుక్ చేసిన సీత.. అందాల అత్త ఫ్లెక్సీతో పబ్లిసిటీ!