Seethe Ramudi Katnam Serial Today September 16th: 'సీతే రాముడి కట్నం' సీరియల్: అత్తని అడ్డంగా బుక్ చేసిన సీత.. అందాల అత్త ఫ్లెక్సీతో పబ్లిసిటీ!
Seethe Ramudi Katnam Today Episode మహాలక్ష్మీని బొటిక్ ఓపినింగ్‌కి పిలిచిన సీత ఆమెకు చీప్ చీరలు వేలకు అమ్మడంతో రామ్ కోసం మహా సైలెంట్‌గా ఉండిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Seethe Ramudi Katnam Serial Today Episode బొటిక్‌కి సీత మహాలక్ష్మి గారి కోడలు అని పేరు పెడుతుంది. ఇంకో సర్‌ఫ్రైజ్ కూడా ఉందని బొటిక్ ముందు కప్పి ఉన్న క్లాత్ తీయమని జనార్థన్‌తో చెప్తుంది. అది తీయగానే అందంగా ఉన్న మహాలక్ష్మి కటౌట్ ఏర్పాటు చేసి ఉంటుంది. తన రెండో అత్త ఎంత అందంగా ఉందో చూడండని అందరికీ చెప్తుంది.
సీత: ఇప్పుడైనా ఒప్పుకుంటారా మా అత్తయ్య పెద్ద యాక్టర్ అని పెద్ద సెలబ్రిటీ అని అయితే చప్పట్లు కొట్టండి.
అర్చన: ఏంటి మహా సీత మనకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు పెడుతుంది. దాని దూకుడు మనం తట్టుకోగలమా.
గిరిధర్: షాప్‌కి సుమతి వదిన పేరు పెడుతుంది అనుకుంటే మీ పేరు పెట్టింది. పైగా మీ ఫ్లెక్సీ కూడా పెట్టింది.
మహాలక్ష్మి: నేను షాక్ లోనే ఉన్నా.
గిరిధర్: సీత తక్కువది కాదు వదిన.
ఇంతలో సీత జూస్‌లు పట్టుకొని మహాలక్ష్మి వాళ్ల దగ్గరకు వస్తుంది. మర్యాదలు బాగానే చేస్తున్నావ్ అని అర్చన అంటుంది. సీత మీరు గెస్ట్‌లుగా వచ్చారని అందుకే అని చెప్తుంది. ఇలాంటి ట్విస్ట్ ఇస్తానని అనుకోలేదు కదా అని అంటుంది. సీత ఇంగ్లీష్‌కి ముగ్గురు తల పట్టుకుంటారు. బొటిక్‌కి మంచి పేరు దొరికిందని ఈ దెబ్బతో సిటీ మొత్తానికి తాను మహాలక్ష్మి కోడలు అని తెలిసిపోతుందని అంటుంది.
మహాలక్ష్మి: నీకు ఇలాంటి పేరు పెట్టమని ఎవరు చెప్పారే
సీత: మీరే చెప్పారు అత్త మీ పేరు సిటీ మొత్తం తెలుసని నా పేరు ఎవరీకీ తెలీదని మీ పేరు పెట్టి క్రేజ్ తెచ్చుకోవాలని అనుకున్నా పనిలో పనిగా నాకు పబ్లిసిటీ కావాలి కాబట్టి చివరకు కోడలు అని తగిలించుకున్నా. నాకు పైసా ఖర్చు లేకుండా పబ్లిసిటీ ఇచ్చారు. మీరు చాలా అందంగా ఉంటారు అత్త మెరుపు తీగలా ఉన్నారు. ఇప్పుడు మీరు సినిమాల్లోకి వెళ్లినా స్టార్ హీరోయిన్ అవుతారు.
ఇంతలో రామ్ వచ్చి ఏర్పాట్లు అయ్యాయని షాప్ ఓపినింగ్‌కి రమ్మని పిలుస్తారు. మహాలక్ష్మి సీత బొటిక్‌కు రిబ్బన్ కటింగ్ చేస్తుంది. అందరూ సీతకు గుడ్ లక్ చేస్తారు. మహాలక్ష్మి కుడి కాలు పెట్టి లోపలకు వెళ్తుంది. ఇక సీత పూజ చేయమని అంటుంది. మహాలక్ష్మి దీపం పెట్టి కొబ్బరి కొట్టి దేవుడికి హారతి ఇస్తుంది. ఇక అందరూ షాప్ లోపలికి వెళ్లి షాపింగ్ మొదలు పెడతారు. ఇక జనర్థన్ వెళ్లిపోతాం అంటే సీత ఆపి బోనీ చేసి వెళ్లమని అంటుంది. ఓ చీర సీత తీసుకొచ్చి అత్తయ్య గారి కోసం స్పెషల్‌గా రెడీ చేయించానని తొలి చీరను మీరే కొనాలని అంటుంది. రామ్ కూడా మహాలక్ష్మికి బోనీ చేయమని అంటాడు. ఇక చీర కాస్ట్ ఎంత అని మహాలక్ష్మి అడిగితే సీత మీ రేంజ్‌కి తగ్గట్టు ఓన్లీ 60 వేలే అని అంటుంది. అందరూ నోరెళ్ల బెడతారు. మహాలక్ష్మి చీర తీసుకుంటుంది. అర్చన చీర తీసుకొని దీని రేటు అంత ఉండదని అంటుంది.
ఇక సీత చిన్నత్త మీకోసం 20 వేల రూపాయల చీర తీశానని అంటుంది. చీర చూసి అర్చన నోరెళ్లబెడుతుంది. చీప్ చీరలు ఇచ్చి ఇంత కాస్ట్ పెట్టడం ఏంటని అనుకుంటారు. ఇక మహాలక్ష్మి రెండు చీరలకు 80 వేలు ఇస్తుంది. సీత వ్యాపాం చేసినట్లు లేదు దోపిడీ చేసినట్లు ఉందని గిరిధర్ అర్చనతో అంటాడు. సీత చాలా తెలివిగా ప్లాన్ చేసిందని జనార్థన్ అంటాడు. విషయం ముందు చెప్పకుండా మనల్ని మోసం చేసిందని అనుకుంటాడు. తర్వాత సీత మీడియాతో మాట్లాడుతుంది. మహాలక్ష్మి అత్తయ్య తనకు ఆదర్శమని ఆమె తనని ప్రోత్సహిస్తుందని చెప్తుంది. అత్తని ఓ రేంజ్‌లో పొగిడేస్తుంది. ఇక మహాలక్ష్మిని మాట్లాడమని ఇరికించేస్తుంది. మహాలక్ష్మి తప్పని పరిస్థితుల్లో మాట్లాడి తప్పక సీతని పొడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: 'త్రినయని' సీరియల్: పాపని కిడ్నాప్ చేయనున్న గజగండ.. ఆ వాగుడుకి సుమన తల పగలగొట్టిన ఫొటో!