Chinni Serial Today November 24th: చిన్ని సీరియల్: మధునే చిన్ని అని నాగవల్లికి చెప్పేసిన లోహి! అదిరిపోయిన ట్విస్ట్!
Chinni Serial Today Episode November 24th నాగవల్లితో లోహిత మధునే చిన్ని అని చెప్పేయడం మధు మ్యాడీకి కూడా విషయం చెప్తేస్తుందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు, మ్యాడీల పేర్లు ఉన్న పేపర్‌ని నాగవల్లి కాల్చేస్తుంది. మ్యాడీ పక్కన ఉంటే శ్రేయ పేరే ఉండాలి.. ఇంకెవరి పేరు ఉన్నా నేను ఒప్పుకోను అఇన అంటుంది. ఇక కాలిపోతున్న పేపర్‌ని మధు ఆర్పుతుంది. మహేంద్ర వర్మ అన్న పేరు పట్టుకొని నా పేరు కాలిపోయినా పర్లేదు ఆంటీ మ్యాడీ పేరు మాత్రం కాలిపోకూడదు అని అంటుంది.
ప్రమీల అందరితో స్నేహం అంటే అలా ఉండాలి.. తన పేరు తగలబడిపోయినా పర్లేదు తన స్నేహితుడి పేరుకి ఏం కాకూడదు అనుకున్న గొప్ప మనసు ఈ అమ్మాయిది అని అంటుంది. నాగవల్లి ఫోన్ మాట్లాడుతూ ఉంటే మధు అక్కడికివెళ్లి మీరు ఒక విషయం తెలుసుకోవాలి.. అని కొంగులో కట్టుకున్న మ్యాడీ పేపర్ చూపిస్తుంది. నా కొడుకుని కొంగున కట్టుకోవాలి అనుకుంటున్నావా అని అంటుంది. కాగితం మీద రాసిన రాత కాబట్టి కాల్చేశారు కానీ నుదిట మీద రాసిన రాత ఎవరూ మార్చలేరు అని అంటుంది. అటుగా వెళ్తున్న మ్యాడీని పిలుస్తుంది. ఎందుకే వాడిని పిలుస్తున్నావ్ అని నాగవల్లి అంటే మ్యాడీకి కూడా విషయం చెప్తా అని అంటుంది. వద్దు అని నాగవల్లి అంటుంది.
మ్యాడీ వచ్చి ఏంటి అని అడిగితే మీ అమ్మ నన్ను డ్రాప్ చేయడానికి కారు తీసుకెళ్లమని అంటున్నారని అంటుంది. ఆంటీ చెప్పినట్లు కారులో వెళ్లనా నువ్వు నన్ను బైక్‌లో డ్రాప్ చేస్తావా అని అంటుంది. దాంతో మ్యాడీ డ్రాప్ చేస్తా అని మధుని తీసుకెళ్తాడు. లోహిత మొత్తం చూసి ఆంటీతో మధు ఇంతలా మాట్లాడుతుంది అంటే ఏదో జరుగుతుంది అని అనుకుంటుంది. మధుని ఎలా అయినా కట్ చేయాలి అని అనుకుంటుంది.
మ్యాడీ చిన్ని ఫొటోలు చూసుకుంటూ బాధ పడతాడు. ఇంతలో మధు కాల్ చేసి చిన్ని గురించి ఈ రోజు కచ్చితంగా తెలుస్తుందని అంటుంది. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఆ మాటలు లోహిత వినేస్తుంది. లొకేషన్ పంపిస్తా వచ్చేయ్ అని అంటుంది. పదిన్నరకు వస్తే నీకు పెద్ద సర్‌ఫ్రైజ్ ఉంటుందని అంటుంది. మధు కూడా హ్యాపీగా ఉంటుంది. మధుని ఆ రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చినా కూడా తనే చిన్ని అని చెప్తేస్తుందా.. ఏం అనుకుంటుంది అని అని అనుకుంటుంది లోహిత.
లోహిత నాగవల్లి దగ్గరకు భయం భయంగా వెళ్తుంది. మీతో మాట్లాడాలి అని అంటుంది. నాగవల్లి కోపంగా లోహితని తిట్టేసి పంపేస్తుంది. దాంతో లోహిత నాగవల్లి కాళ్లు పట్టేసి నేను చెప్పేది మీరు వినే వరకు మీ కాళ్లు వదలను అని అంటుంది. మధునే పెళ్లి తర్వాత మా గురించి చెప్తే మీరు మాట వింటారు అంది.. నేను వద్దన్నా వినకుండా బలవంతంగా మాకు పెళ్లి చేసింది అని అంటుంది. నేను చెప్పేది మీరు ఇప్పుడు వినాలి ఎందుకంటే ఇది మ్యాడీకి సంబంధించిన విషయం అని అంటుంది. దాంతో నాగవల్లి వినడానికి ఓకే చెప్తుంది.
లోహిత నాగవల్లితో చిన్ని విషయం ఆంటీ అని చెప్తుంది. చిన్నప్పటి చిన్నిని గురించి శ్రేయ నాకు చెప్పింది.. అని లోహిత అంటుంది. మధు మ్యాడీని పూర్తిగా తన గ్రిఫ్‌లో పెట్టుకుంది.. పెద్ద కుట్రే చేస్తుంది అని అంటుంది లోహిత. మధు వాళ్ల ఇంట్లో ఉన్న ప్పుడు నేను దాన్ని బాగా పరిశీలించా అప్పుడు ఓ భయంకర విషయం తెలిసింది.. అది ఏంటి అంటే ఆ మధు ఎవరో కాదు ఆంటీ చిన్నప్పటి మ్యాడీ ఫ్రెండ్ చిన్నినే అని లోహిత చెప్పగానే నాగవల్లి ఫ్యూజులు అవుట్ అయిపోతాయి. మ్యాడీ వెతుకుతున్న చిన్నినే మధు అని లోహిత చెప్తుంది. నమ్మను నేను నమ్మను అని నాగవల్లి అంటే నాకు తెలుసు ఆంటీ మీరు నమ్మరు అని పక్కా సాక్ష్యంతో వచ్చా అని అంటుంది. అంటూ చిన్ని ఫొటో చూపిస్తుంది. చిన్నిని దత్తత తీసుకున్న ఫొటోలు కూడా చూపిస్తుంది. పెళ్లి కొడుకు బొమ్మతో మధు మాట్లాడుతూ ఉండటం ఉన్న ఫొటో కూడా చూపిస్తుంది. చిన్ని వాళ్ల కన్న తల్లి ఫొటో కూడా ఉందని కావేరి ఫొటో చూపిస్తుంది. నాగవల్లి బిత్తరపోతుంది. లోహితని చూసి ఆ మధునే చిన్ని అని నమ్ముతా అని అంటుంది. ఇక లోహిత మధు రేపు మ్యాడీతో తనే చిన్ని అని చెప్తా అని మధు తన ఫ్రెండ్‌కి చెప్పడం నేను విన్నాను అని మ్యాడీకి కూడా మధు కాల్ చేసి లొకేషన్‌కి రమ్మని చెప్పిందని అంటుంది. నాగవల్లి షాక్ అయిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















