Chinni Serial Today January 7th: చిన్ని సీరియల్: నాగవల్లి మాస్టర్ ప్లాన్! శ్రేయ జీవితం మలుపు తిరుగుతుందా? మధు భవిష్యత్ ఏంటి?
Chinni Serial Today Episode January 7th మధు, మ్యాడీలకు నాగవల్లి వ్రతం ఏర్పాటు చేయించి మధు తల్లిదండ్రులను పిలిపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు నాగవల్లితో ఏం బాధ పడకండి అత్తయ్య.. రేపటి నుంచి మీరే దగ్గరుండి పూజ చేయిద్దురు అని అంటుంది. ఒక్కపూజ ఏంటి ఏం చేయాలో అన్నీ నేనే దగ్గరుండి చేయిస్తా అంటుంది. నేను అంతే అత్తయ్యా కొత్త కోడలిగా ఏం చేయాలో అన్నీ చేసేస్తా అంటుంది. మధు నాగవల్లికి హారతి ఇస్తుంది. అత్తాకోడళ్లు మంచిగా ఉన్నారని ప్రమీల పొంగిపోతుంది.
మ్యాడీ మధుని పిలుస్తాడు. దానికి మధు ఏం కావాలి అండీ అంటుంది. చెప్తే కానీ రావా అని మ్యాడీ అంటే వస్తే కానీ చెప్పరా అని మధు అంటుంది. మ్యాడీ మధుని కోపంగా చూస్తాడు. ఇద్దరూ గదిలోకి వెళ్తారు. కొత్తగా ఈ అండీ ఏంటి అని అడుగుతాడు. భర్తని అండీ అనే అంటారు కదా అని మధు అంటుంది. నువ్వు నా భార్యవే కాదు అంటే ఇంట్లో ఈ హడావుడి ఏంటి అని మ్యాడీ అంటాడు. దానికి మధు అయితే నేను నీ భార్య కాదు అని ఇంట్లో అందరికీ చెప్పు అని అంటుంది. నేను చెప్పను అని మ్యాడీ అంటే అయితే నేను చెప్తా అని మధు అంటుంది. వద్దు అని మ్యాడీ అంటాడు. దానికి మధు అయితే నీ మనసులో ఏదో మూల నేను నీ భార్య అని ఫీలింగ్ ఉంది కదా అంటుంది. చివరి సారి చెప్తున్నా నువ్వు ఇలా నా భార్యలా ఈ ఇంటి కోడలిగా ప్రవర్తించకు.. లైఫ్‌లో నేను ఎప్పటికీ భార్యగా చూడను.. మళ్లీ మళ్లీ చెప్తున్నా గుర్తు పెట్టుకో అని అంటాడు.
దేవా కోపంగా ఉంటే నాగవల్లి వెళ్లి కోపంగా ఉందా బావ అంటే నువ్వు దానితో అంత క్లోజ్‌గా ఉంటే కోపం రాకుండా ఎలా ఉంటుంది అని అడుగుతాడు. నాకు ఇష్టం లేదు బావ.. కానీ తప్పడం లేదు.. నీకు బయట పాలిటిక్స్ తెలుసు కానీ.. కిచెన్ పాలిటిక్స్ అత్తాకోడళ్ల పాలిటిక్స్ తెలీదు అని అంటుంది. ఇక మధుని పిలిచి మామయ్య గారికి కాఫీ తీసుకురా అని అంటుంది. మధు తెస్తుంది. దేవా కోపంగా తీసుకోడు. మీ మామయ్య కోపం ఎక్కువ సేపు ఉండదమ్మా అని నాగవల్లి చెప్పి కాఫీ తీసుకోమని దేవాతో చెప్తుంది. ఇక ఇంటికి పంతులు వస్తారు.
ఆలయధర్మ కర్త తిలక్ తనని పంపారని పంతులు చెప్తారు. పెళ్లిని అంగీకరించానో లేదో తెలుసుకోవడానికి పంపారా అని దేవా అడుగుతాడు. ఒక్కగానొక్క కొడుకు పెళ్లి అలా జరిగినందుకు మీరు బాధ పడుతుంటారని అందుకు పెళ్లి తంతు జరిపించి వ్రతం చేయించమని పంపారని పంతులు చెప్తారు. దేవా చిరాకు పడతాడు. నాగవల్లి దేవాని ఆపుతుంది. రేపే ఆ కార్యక్రమం పెట్టుకుందామని నాగవల్లి అంటుంది.
నాగవల్లి నిర్ణయంతో వసంత, శ్రేయ, లోహిత, మ్యాడీ వెళ్లిపోతారు. మధు దగ్గరకు నాగవల్లి వెళ్లి విన్నావు కదా.. రేపు కార్యక్రమానికి మీ నాన్న వాళ్లని కూడా రమ్మని చెప్పు అని అంటుంది. దేవా నాగవల్లితో ఆ తిలక్ చెప్పాడని మనం వ్రతం చేయించాలా అని అడుగుతాడు. కాదు బావ రాజకీయం.. మనం వాళ్ల పెళ్లిని అంగీకరించామో లేదో అని తెలుసుకొని రాజకీయంగా దెబ్బకొట్టాలని ప్లాన్ చేశాడు అని అంటుంది.
శ్రేయ తల్లి దగ్గర తన బాధ చెప్పుకొని ఏడుస్తుంది. మా అన్నయ్యని వదినని నిలదీద్దాం అని శ్రేయని తీసుకెళ్లి దేవా, నాగవల్లి దగ్గర పడేస్తుంది. ఏమైంది వసంత అని నాగవల్లి అంటే నా కూతురి జీవితం నాశనం అయిపోయింది. చిన్నప్పుడు నుంచి అది బావే ప్రాణంగా బతుకుతుంది. ఇప్పుడు మీరు వత్రం చేయిస్తారు.. తర్వాత నా కూతురి దినం చేయిస్తారు అంతే కదా అని అంటుంది. దాంతో నాగవల్లి కోపంగా ఈ వత్రం జరుగుతుంది.. తర్వాత శ్రేయ నా కోడలు అవుతుంది. శ్రేయని నా ఇంటి కోడల్ని చేసి తీరుతాను.. ఇప్పుడు ఏం చేయాలో ఏది ఎలా చేయాలో నాకు బాగా తెలుసు.. అప్పటి వరకు మీరు ఓపికగా ఉండండి.. ఈ లోపు ఇలాంటి మెలో డ్రామాలు చేసి నన్ను ఇరిటేట్ చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు.. వెళ్లండి అని అంటుంది.
మధు తన తల్లికి కాల్ చేసి మాట్లాడుతుంది. నాగవల్లి ఆంటీ వాళ్లు నన్ను బాగా చూసుకుంటున్నారు. మా పెళ్లిని ఆ దేవుడి నిర్ణయంగా భావించి అంగీకరించారు. రేపు మాతో వ్రతం చేయిస్తున్నారు.. మీరు రావాలని నాగవల్లి ఆంటీ గట్టిగా చెప్పారు అని చెప్తుంది. స్వరూప చాలా సంతోషపడుతుంది. ఉదయం వ్రతానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. లోహిత శ్రేయతో ఈ ఏర్పాట్లు అన్నీ నీ కోసం జరగాల్సినవి నాగవల్లి ఆంటీ ఆ మధు కోసం చేయిస్తున్నారు ఏంటో నీ జీవితం అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















