Lakshimi Raave Maa Intiki Serial Today January 6th:శ్రీలక్ష్మీకి నిజం తెలిసిపోయిందన్న సంగతి మ్యాడీకి తెలిసిందా..? సింధూకు లక్ష్మీ ఇచ్చిన సూచన ఏంటి..?
Lakshimi Raave Maa Intiki Serial Today Episode January 6th: ఈ పెళ్లి మీకు ఇష్టంలేదన్న సంగతి నాకు తెలుసు అంటూ లక్ష్మీ సింధూతో అంటుంది.అయితే నువ్వు వెళ్లి ఈ విషయం గోపికి చెప్పమని మ్యాడీ అంటాడు.

Lakshimi Raave Maa Intiki Serial Today Episode: లక్ష్మీని పలకరించి వెళ్తూ తాము గుడికి వెళ్తున్నామని...నీ ఆరోగ్యం బాగున్నట్లయితే నువ్వే ఈ పనులన్నీ చూసుకుంటావని అనుకున్నానని సూర్యనారాయణ అంటాడు. నాకు బాగానే ఉందని మీరు వెళ్తుండండి నేను వచ్చేస్తానని లక్ష్మీ అంటుంది. వెంటనే వెళ్లి గోపికి సింధూ విషయం చెప్పాలని లక్ష్మీ పరుగుపరుగునా గుడికి పరుగెత్తుతుంది. ఇంతలో గుడిలో పెళ్లి వేడుకలు జరుగుతుంటాయి.గుడిలో ఎవరికి వారు తమ కోరికలను దేవుడిని కోరుకుంటుంటారు. అటు లక్ష్మీ పరుగున గుడికి పరుగెత్తుకుని వస్తుంది.
గోపీ వద్దకు వెళ్లి మాట్లాడాలని లక్ష్మీ అడగ్గా...నీతో ఇప్పుడు పూజ ఉందని నువ్వు తర్వాత మాట్లాడు అంటూ గోపిని వాళ్ల లాక్కెళుతుంది. ఇంతలో పెళ్లికి ముహూర్తం పెట్టి పంతులుగారు లగ్నపత్రిక చదువుతారు.అనంతరం నిశ్చయ తాంబూలాలు మార్చుకుంటారు. అనంతరం గోపీ, సింధూ ఇద్దరూ ఉంగరాలు మార్చుకుంటారు. దీంతో వారిద్దరి ఎంగేజ్‌మెంట్ పూర్తవుతుంది. మరోవైపు మ్యాడీకి గోపీ చెల్లెలు లైన్ వేస్తుంది. తనను పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. ఇంతలో శ్రీలక్ష్మీ వెళ్లి సింధూను వదిన అని పిలవగా...నాకు అలా పిలిస్తే చిరాకుగా ఉందని మండిపడుతుంది. అయితే నేను విన్నదంతా నిజమేనా అని నిలదీస్తుంది.ఏం విన్నావని సింధూ అడుగుతుంది. నీకు మా గోపి అన్నను పెళ్లిచేసుకోవడం ఇష్టం లేదన్న సంగతి అని అంటుంది. మీ ప్రవర‌్తన చూస్తేనే తెలుస్తోందని...నేను నిన్న వదిన అని పిలిచినా నచ్చడంలేదని లక్ష్మీ అంటుంది. నీముఖంలో పెళ్లి కలలేదని...ఆనందం కనిపించడం లేదని అంటుంది. అర్థం చేసుకున్నావు కదా వెళ్లి మీ అన్నకు చెప్పు అని అంటుంది.మా అన్నయ్యను ప్రపంచ దేశాలే కోరుకుంటున్నాయని...మీరు ఎందుకు వద్దనుకుంటున్నారో అర్థం కావడం లేదని అడుగుతుంది. మా అన్నయ్య చాలా మంచోడని....చాలాబాగా చదువుకున్నాడని అంటుంది. మా అన్నయ్యకు ఊరిమీద ప్రేమతో ఇక్కడే ఉండిపోయాడని...లేకపోతే చాలా పెద్దవాడు అయ్యి ఉండేవాడని చెబుతుంది.
ఇంతలో అక్కడికి మ్యాడీ రాగానే...ఈ పెళ్లి మీ అక్కకు ఇష్టం లేదన్న సంగతి మీతోపాటు మీ కుటుంబంలో ఇంకాచాలామందికి తెలుసు అన్న సంగతి నాకు తెలుసని శ్రీలక్ష్మీ అంటుంది. అలాంటప్పుడు మీ తాతయ్యను,మా అన్నయ్యను ఎందుకు మోసం చేస్తున్నారని నిలదీస్తుంది.ఈ పెళ్లి ఇష్టంలేదని నిజం చెప్పొచ్చు కదా అని అంటుంది. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదని నీకు ఎవరు చెప్పారని మ్యాడీ లక్ష్మీని నిలదీస్తాడు. రాత్రి మీరు మాట్లాడుకున్న మాటలన్నీ నేను విన్నానని అంటుంది. మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని....దేవుడిలాంటి పెద్దాయనను మోసం చేస్తున్నారని అంటుంది. దీంతో మ్యాడీ కోప్పడతాడు. మేం ఆయన్ను మోసం చేయడం కాదని..ఆయనే మా అక్కకు ద్రోహం చేస్తున్నాడని అంటాడు. మా అక్క ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని కలలు కంటే తీసుకొచ్చి ఈ పల్లెటూరులో పడేశాడని మండిపడతాడు. మా అన్నయ్య నిన్ను చూసి ఈ పెళ్లికి ఒప్పుకోలేదని...పెద్దాయనపై ఉన్న గౌరవంతో ఒప్పుకున్నాడని లక్ష్మీ చెబుతుంది. అలాంటి ఇద్దరు గొప్ప వ్యక్తులను మీరు బాధపెట్టొద్దని అంటుంది. పరువుపోతే పెద్దాయని తట్టుకోలేరని...ఆయనకు ఏమైనా అయితే మా అన్నయ్య ఓర్చుకోలేడని చెబుతుంది. అందుకే మీకు ఈపెళ్లి ఇష్టం లేదన్న సంగతి ఇద్దరిలో ఎవరికో ఒకరికి చెప్పండని సలహా ఇస్తుంది. అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నువ్వే ఈ విషయం చెప్పాలని మ్యాడీ సూచిస్తాడు.





















