Chinni Serial Today Episode January 14th: చిన్ని సీరియల్: మధు-మ్యాడీల బంధంలో కొత్త మలుపు! శ్రేయ అసలు రహస్యం తెలుసుకుంటుందా?
Chinni Serial Today Episode January 14th మధుని గుడిలో ఉండిపోయేలా చేసింది ఎవరో తెలుసుకొని చంపేస్తా అని శ్రేయ లోహితకు చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీకి పువ్వులమ్మే ఆవిడ పువ్వులు ఇచ్చి మధు తలలో పెట్టమని అంటుంది. ఇక్కడ బాగోదేమో అని మ్యాడీ అంటే పర్లేదు పెట్టు బాబు లేదంటే అమ్మాయి బాధ పడుతుందని అంటుంది. దాంతో మ్యాడీ మధు తలలో పువ్వులు పెడతాడు. మధు తెగ సిగ్గుపడిపోతుంది.
మ్యాడీ ఆవిడకు డబ్బులు ఇస్తుంటే వద్దని అంటుంది. తర్వాత మ్యాడీకి హల్వా ఇచ్చి రాత్రికి మీ ఆవిడకు తినిపించు అని అంటుంది. ఎందుకు అని మ్యాడీ అంటే మొగుడు పెళ్లాలకు దగ్గర చేసే విషయంలో ఈ పూలు హాల్వా ఉపయోగపడతాయి అని అంటుంది. మరోవైపు లోహిత శ్రేయ దగ్గరకు వెళ్లి బాధ పడకు శ్రేయ.. నువ్వు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయి మరొకరిని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం.. అందులోనూ వాళ్లు నీ కళ్లముందే బయటకు వెళ్లి ఇంకా రాకపోవడం ఇంకా కష్టం అని అంటుంది. దానికి శ్రేయ నేను వాళ్లు బయటకు వెళ్లడం గురించి ఎప్పుడో మర్చిపోయా.. కానీ నేను ఆలోచిస్తుంది.. ఆ రోజు మధు గుడిలో ఇరుక్కుపోవడానికి కారణమైన వ్యక్తి కోసం అదెవరో నాకు తెలియాలి నా సామి రంగా.. మామయ్య గన్ తీసుకొని కాల్చి పారేస్తా అని అంటుంది. లోహిత దెబ్బకి భయపడిపోతుంది. ఆ పని చేసింది నేనే అని తెలిస్తే అంతే ఇక అని అనుకుంటుంది.
మధు, మ్యాడీ షాపింగ్‌కి వెళ్తారు. మ్యాడీ, మధులను షాప్ వ్యక్తి చూసి మీరే గుడిలో పెళ్లి చేసుకున్నారు కదా అంత రిచ్ అయిన మీరు ఈ షాప్‌కి వచ్చారేంటి అని అడిగితే మేడంకి చిన్న చైన్ కావాలి అంటే ఇలా వచ్చామని అంటుంది. ఇక మధు మ్యాడీతో మ్యాడీ భర్తగా వద్దు కానీ ఫ్రెండ్‌గా ఓ మంచి చైన్ సెలక్ట్ చేయవా.. నీ సెలక్షన్ చాలా బాగుందని అంటుంది. ఫ్రెండ్‌గా అయితే ఒకే అని మ్యాడీ చెప్పి చైన్ సెలక్ట్ చేస్తాడు. రాత్రి అయినా ఇంకా మధు, మ్యాడీ రాలేదేంటి అని లోహిత, శ్రేయ ఎదురు చూస్తూ అంటారు. ఇంతలో మ్యాడీ వాళ్లు వస్తారు.
మధు తలలో పూలు చూసి వెళ్లేటప్పుడు మధు పూలు పెట్టుకొని వెళ్లలేదు అని శ్రేయ అంటే మ్యాడీ చేతిలో స్వీట్ కూడా లేదు అని లోహిత అంటుంది. అంటే అర్థం అని శ్రేయ అంటే వాడు వాడి పెళ్లానికి పూలు, స్వీట్స్ కొన్నాడు అని అర్థం అని నాగవల్లి అంటుంది. అందరూ సైలెంట్ అయిపోతారు. మ్యాడీ విషయం చెప్పబోతే పర్లేదు నాన్న ఏం జరిగినా మీరు సంతోషంగా ఉంటే మాకు అదే చాలు అని నాగవల్లి అంటుంది. దానికి మధు సరిపోదు అత్తయ్య మేం ఉంటే సరిపోదు ఇంట్లో అందరం సంతోషంగా ఉండాలి అని మధు అంటుంది. ఇక నాగవల్లి మధుతో మీ ఆయన నీకు ఏం నగలు కొనిపెట్టాడు అని అడిగితే ఈ చైన్ కొనిపెట్టాడు అని సంతోషంగా చూపిస్తుంది.
లోహిత మధుతో ఏంటి రిసెప్షన్‌కి ఇంత చిన్న చైన్ కొన్నావా నేను అయితే సగం షాప్ కొనేసేదాన్ని నీ మిడిల్ క్లాస్ బుద్ధి పోనిచ్చుకోలేదు అని అంటుంది. దానికి మధు నేను పుట్టింది మిడిల్ క్లాస్‌లోనే కదా.. మన పుట్టుకని మనం మర్చిపోకూడదు కదా.. మర్చి పోయి గొప్పింటి కోడలు అయ్యామని సగం షాప్ కొనేస్తే దాన్ని రిచ్ అనరు.. కక్కూర్తి అంటారు అని అంటుంది. నాగవల్లి మధుతో కరెక్ట్‌గా చెప్పావమ్మా నువ్వు ఎప్పటికీ ఇలాగే ఉండాలి అంటుంది. నేను నాగవల్లి గారి కోడలిని కదా.. ఎప్పటికీ లాగే ఉంటాను అని అంటుంది.
మధు మ్యాడీని పట్టుకొని వెళ్లడంతో అప్పుడే మ్యాడీని కొంగున కట్టేసింది పాపం శ్రేయ బాధ పడుతుందని దానికి శ్రేయ ముందు గుడిలో మధుని లాక్ చేసింది ఎవరో తెలిస్తే అప్పుడుంది అని అంటుంది. లోహిత చాలా భయపడుతుంది. మరోవైపు దేవా బాలరాజు దగ్గరకు వెళ్తాడు. మందు సెటప్ పెట్టిస్తాడు. మనం మిత్రులుగా ఉన్నప్పుడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇలాగే ఏర్పాటు చేసేవాళ్లం అని మందు పోస్తాడు. బాలరాజు వెంటనే మందు తాగేస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















