Nindu Noorella Saavasam Serial Today January 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్: అమ్మును చంపేందుకు మనోహరి ప్లాన్ - మనును హెచ్చరించిన చంభా
Nindu Noorella Saavasam serial Today Episode January 14th: అమ్మును చంపాలని అప్పుడే భాగీ శాశ్వతంగా దూరం అవుతుందని మనోహరి ప్లాన్ చేస్తుంది. దీంతో ఇవాల్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మ గురించి పూర్తిగా తెలుసుకోవాలని వెళ్తున్న మనోహరికి రోడ్డు మీద రాజు కనిపిస్తాడు. వెంటనే రాజు దగ్గరకు వెళ్లి పలకరిస్తుంది. మనోహరిని చూసిన రాజు షాక్ అవుతాడు. మనోహరి మాత్రం బుజ్జమ్మ గురించి అడుగుతుంది. బుజ్జమ్మ అనాథ అని రాజు చెప్పగానే.. మనోహరి కోపంతో ఊగిపోతుంది.
మనోహరి: అంటే ఆ పాపకు ఎవ్వరూ లేరు అంటారు
రాజు: ఎవ్వరూ లేని వారినే అనాథ అంటారు కదమ్మా
మనోహరి: మరి ఇందాక పాప వాళ్ల అమ్మ ఇక్కడకు వచ్చింది అని చెప్పింది
రాజు: ఆవిడ పాప వాళ్ల అమ్మ కాదు ఆశ్రమంలో టీచర్
మనోహరి: ఓహో టీచరా..? సరే అయితే నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉంటాను
రాజు: ఎందుకు వస్తారండి
మనోహరి: మీరు అక్కడ ఏం దాచారో చూడటానికి వస్తాను
రాజు: దాచడం ఏంటండి..
మనోహరి: ఐ మీన్ ఆశ్రమాన్ని మీరు ఎలా రన్ చేస్తున్నారో చూడ్డానికి వస్తాను.. ఎంతైనా అది నేను పెరిగిన ఆశ్రమమే కదా..? ఏం రాజు గారు ఆ అనాథ జాగ్రత్త
రాజు: ఏంటండి అంటున్నారు
మనోహరి: ఆ పిల్ల జాగ్రత్త అని అంటున్నాను.. అసలే ఎవ్వరూ లేని అనాథ కథా కంటికి రెప్పలా కాపాడుకోండి సరేనా..? యాదమ్మ పద
అని అక్కడి నుంచి వెళ్లిపోతారు. తర్వాత పిల్లుల పుట్‌బాల్ అడుతుంటే మనోహరి చూస్తుంటుంది. వెనక నుంచి చంభా వస్తుంది.
చంభా: (మనసులో ఇందేంటి మనోహరి పిల్లలు అలా చూస్తుంది. మళ్లీ ఏదైనా ప్లాన్ చేస్తుందా ఏంటి..?) మనోహరి ఆ పిల్లల వంక అలా చూస్తున్నావు..? మళ్లీ అమ్మూకు స్పాట్ ఏమైనా పెట్టబోతున్నావా..?
మనోహరి: ఎందుకు అడుగుతున్నావు
చంభా: ఎందుకు అంటావేంటి..? ఐదేళ్ల క్రితం నువ్వు పెట్టిన భయంతోనే కదా..? భాగీ బిడ్డను తీసుకుని దూరంగా పారిపోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చింది. భాగీని దూరంగా తరమాలి అంటే అమ్మూకు ఏదైనా జరగాలి కదా..? అప్పుడే కదా భాగీలో భయం మొదలవుతుంది
మనోహరి: భాగీలో భయం మొదలవడం కాదు.. ఇప్పటికే రెట్టింపు అవ్వాలి
చంభా: నేను అదే చెప్తున్నాను మనోహరి.. ఈ రోజు ఈ పిల్లలు స్కూల్ లో ఆ చిన్న పిల్లను కలిశారు కదా..?
మనోహరి: ఆ విషయం భాగీకి తెలియదు కదా..?
చంభా: ఈ రోజు కాకపోతే రేపైనా తెలుస్తుంది కదా..?
మనోహరి: మనమే తెలిసిపోయేలా చేయాలి. ఈ పిల్లలు ఆ చిన్న పిల్ల కలిసిపోయారని భాగీకి అర్థం అవ్వాలి. భాగీలో భయం పెంచాలి
చంభా: అదెలా చేస్తావు
మనోహరి: సింపుల్ ఈ రోజు అంజుతో ఆరు పాప ఇంటికి వస్తుంది. ఆ పిల్ల ఇక్కడ ఉండగానే అంజుకు పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే అమ్మును ఐసీయూలో అడ్మిట్ చేస్తారు. ప్రాణం ఉంటుందా పోతుందా అనే సిచ్యుయేషన్ వస్తుంది. ఈ న్యూస్ ఆ భాగీకి చేరేలా చేస్తాను. అప్పుడు అమ్ము దగ్గరకు రాలేక.. అమరేంద్ర దగ్గరకు వచ్చి ఏడేళ్ల గడువు గురించి చెప్పలేక సతమతమవుతూ.. కుమిలిపోతుంది. ఆరు పాప ఈ ఇంటికి రావడం వల్లే అమ్ముకు అలా జరిగిందని.. భాగీ అనుకుంటుంది. భయంతో పాపను తీసుకుని దూరంగా పారిపోతుంది
చంభా: ప్లాన్ అయితే బాగుంది. కానీ రెండేళ్ల తర్వాతైనా భాగీ మళ్లీ వెనక్కి వస్తుంది కదా..?
మనోహరి: రాదు.. రాకూడదు.. భాగీ ఎప్పటికీ తిరిగి రాకుండా అమ్ముకు అతి పెద్ద ప్రమాదం జరగబోతుంది
చంభా: అంటే ఈ రోజు అమ్ముకు మూడిందన్నమాట.. జాగ్రత్త మనోహరి ఏదైనా తేడా జరిగితే నువ్వు ఉండవు..
అని చంభా, మనోహరికి చెప్పగానే.. నేను బతికి ఉండాలనే ఈ ప్లాన్ చేస్తున్నాను చంభా.. జరగబోయేది నువ్వే చూస్తావు.. అంటూ కోపంగా పిల్లల వైపు చూస్తుంది మనోహరి. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















