Chinni Serial Today January 10th: చిన్ని సీరియల్: మధుపై దాడి.. నాగవల్లి ప్లానేనా! మ్యాడీ మధుని కాపాడగలడా?
Chinni Serial Today Episode January 10th మధు మీద రౌడీలు అటాక్ చేయడం మ్యాడీ వాళ్లని చితక్కొట్టి మధుని కాపాడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode లోహిత పెళ్లి తంతు పనులు అన్నీ దగ్గరుండి చూసుకోవడంతో శ్రేయ లోహితతో నాకు మా బావతో పెళ్లి జరగకపోయినా సరే నీకు ఆ బాధ లేకుండా ఆ మధుకి అన్నీ దగ్గరుండి చేస్తూ బాగా సంతోషంగా ఉన్నావని అంటుంది. దాంతో లోహిత నేను తప్పనిసరి అయి చేయాల్సి వచ్చిందని చెప్తుంది.
నాగవల్లి పంతులుతో నా కొడుకు పెళ్లి చూడలేకపోయాను అనే బాధ లేకుండా చేశారు థ్యాంక్స్ అని అంటుంది. దేవా నాగవల్లితో థ్యాంక్స్ చెప్పాల్సింది తిలక్‌కి. చాలా మంచి పని చేశావ్ తిలక్ నేను ఇలాగే నీకు సాయం చేసి తీరుతా అని అంటాడు. ఇక నాగవల్లి మధు, మ్యాడీలను పంతులు దగ్గర ఆశీర్వాదం తీసుకోమని అంటుంది. ఇద్దరూ ఆశీర్వాదం తీసుకుంటారు. పంతులు నాగవల్లితో మీ ఇంటి సంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత ఆ గుడిలో అమ్మవారి దర్శనం చేయించాలని అంటారు. ఇప్పుడే పంపిస్తా అని నాగవల్లి అంటుంది. లోహిత నేను వెళ్తా అంటే కొత్త జంట మధ్యలో నువ్వు ఎందుకు వాళ్లు వెళ్తారులే అని నాగవల్లి కొడుకు కోడలిని పంపిస్తుంది.
శ్రేయ చాలా ఫీలవుతుంది. మ్యాడీ, మధులు గుడిలో అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వస్తారు. మ్యాడీని మళ్లీ మధు భర్త అనడంతో నేను నీకు భర్త కాదు.. ప్రతీ దానికి నువ్వు భర్త భర్త అని అనొద్దని అంటాడు. నీకో ప్రశ్న అడుగుతా మధు మనం బెస్ట్ ఫ్రెండ్స్ కదా నన్ను లవ్ చేయాలి అని నీకు ఎప్పుడూ అనిపించలేదా.. స్నేహ బంధం ప్రేమ బంధంగా మారాలని నీకు ఎప్పుడూ అనిపించలేదా అని అడుగుతాడు. లేదు అని మధు అంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు ఎందుకు భర్త భర్త అని అంటున్నావ్.. చిన్నితో నేను లవ్‌లో ఉన్నప్పుడు నా బాధ అర్థం చేసుకున్నావ్,. శ్రేయతో నిశ్చితార్థం అప్పుడు నన్ను అర్థం చేసుకున్నావ్.. మరి ఇప్పుడు ఎందుకు భార్య, భర్త అని నన్ను బాధ పెడుతున్నావ్ అని అడుగుతాడు. దానికి మధు అప్పుడు మన మధ్య స్నేహం మాత్రమే ఉంది ఇప్పుడు ఈ తాళి బంధం ఉంది కదా అని అంటాడు.
మధు, మ్యాడీ ఇంటికి వెళ్తుంటే మధ్యలో డైవర్షన్ ఉండటంతో ఆ రూట్ గుండా ఇద్దరూ వెళ్తారు. రౌడీలు కావాలనే వాళ్లని డైవర్ట్ చేస్తారు. ఆ రూట్‌లో వెళ్లగా కొంచెం దూరంలో రోడ్డుకి అడ్డంగా రాళ్లు పెడతారు. దాంతో మ్యాడీ దిగి వాటిని తీస్తాడు. ఇంతలో రౌడీలు వచ్చి మధుని తీసుకెళ్లిపోతారు. మ్యాడీ కారు అద్దంలో చూసి రౌడీలను కొట్టి మధుని కాపాడతాడు. ఇంతలో నాగవల్లి మ్యాడీకి కాల్ చేసి మాట్లాడుతుంది. నాగవల్లికి మ్యాడీ జరిగింది చెప్తాడు. మధు మీద దొంగలు అటాక్ చేశారని నేను రౌడీలను చితక్కొట్టానని చైన్ తెంపేశారని చెప్తాడు. నాగవల్లి డిసప్పాయింట్ అయి త్వరగా ఇంటికి వచ్చేయమని మ్యాడీకి చెప్తుంది. నాగవల్లి మనసులో ఓసేయ్ మధు ఇప్పుడు తప్పించుకున్నా అని సంబర పడిపోవద్దు.. అతి త్వరలో నువ్వు మీ అమ్మ దగ్గరకి వెళ్లడం ఖాయం అని అనుకుంటుంది.
ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇంతలో మధు, మ్యాడీలు ఇంటికి వస్తారు. ఏంటి మధు ఎప్పుడూ నీకు ఇలాగే జరుగుతుంది.. ప్రతీసారి నిన్ను మ్యాడీనే కాపాడుతున్నాడు.. అసలు ఇలా ఎందుకు చేస్తున్నారు.. గతంలో నీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా.. నీ గతం తాలూకు మనుషులు నిన్ను చంపాలని ఇలా ప్రయత్నిస్తున్నారా.. అలాంటి గతం ఉంటే చెప్పమ్మా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేం చేసుకుంటాం అని అంటుంది. ఏం లేదు అని మధు అంటుంది. దానికి నాగవల్లి బాగా గుర్తు చేసుకోమ్మా మీ అమ్మ తాలూక గతం ఉండొచ్చు కదా.. మీ నాన్న తాలూక గతం ఉండొచ్చు ఏమో అంటుంది. ఏం లేదని మధు అంటే అవునులే సుబ్బారావుని స్వరూపని చూస్తే ప్లాష్‌బ్యాక్ లేని ముఖాలులా ఉన్నారని అంటుంది. మధు జరిగిన దానికి భయపడి ఉంది వదిలేయ్ మమ్మీ అని గదిలోకి తీసుకెళ్లిపోతాడు.
లోహిత నాగవల్లితో మధుకి ఏదో గతం ఉంది ఆంటీ అని అంటే అనవసరమైన విషయాల్లో నువ్వు దూరొద్దు.. ఇలాంటి విషయాలు మేం చూసుకుంటా అని అంటుంది. దేవా నాగవల్లితో ఈ సారి మిస్ అయింది కానీ మరోసారి మిస్ అవ్వకూడదు అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















