అన్వేషించండి

Jagadhatri Serial Today January 9th:మాధురి బిడ్డను ఎత్తుకెళ్లిన బామ్మను జేడీ కనిపెట్టిందా..? అసలు పిల్లల కిడ్నాప్‌కు మీనన్‌కు సంబంధం ఏంటి..?

Jagadhatri Serial Episode January 9th: మాధురి కొడుకు జాడ కనిపెట్టిన జేడీ,కేడీకి చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా మీనన్‌దే అని తెలుసుకుంటారు. వీరికి సాయం చేస్తున్న డాక్టర్‌ను కూడా అరెస్ట్ చేయిస్తారు.

Jagadhatri Serial Today Episode: కేడీ,జేడీ అడిగిన అన్ని ప్రశ్నలకు బామ్మ దగ్గర సమాధానాలు ఉండటంతో  ధాత్రికి ఏం చేయాలో అర్థం కాదు. అక్కడికి వచ్చిన మహిళ కూడా పార్వతమ్మకు తోడుగా నాటకం ఆడటంతో  ఏం చేయలేక కేడీ, జేడీ ఇద్దరూ బయటకు వ‌చ్చేస్తారు. తమకు కావాల్సిన ఆధారాలేవీ అక్కడ దొరక్కపోవడంతో నిరాశ చెందుతారు. జేడీమాత్రం ఈ పార్వతమ్మే బాబును ఎత్తుకొచ్చిందని అనుమానపడుతుంది. వాళ్ల బయటకు రాగానే...తమ బండారం బయటపడుతుందని బామ్మతో కలిసి వచ్చిన మహిళ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఇంతలో జేడీ,కేడీ ఆ ఇంటి బయటే ఉన్న ఇస్త్రీ బండి వాడ్ని విచారిస్తారు. పార్వతమ్మకు అసలు కూతుర్లే లేరని..చెబుతాడు. ఈ మధ్య చాలామంది కార్లలోవచ్చి పార్వతమ్మను కలిసి వెళ్తున్నారని చెబుతాడు. ఇంతకు ముందు వచ్చిన మహిళ కూడా ఆమె కూతురు కాదని చెప్పడంతో  జేడీ అనుమానం నిజమవుతుంది. రాత్రి కూడా ఓ గుండు అతను వచ్చి వెళ్లాడని చెబుతాడు. అయితే వచ్చింది దేవా అని జేడీకి అర్థమవుతుంది. మీనన్ మనుషులే ఈ కిడ్నాప్ చేయించారని కేడీకి తెలిసిపోతుంది. జేడీ, కేడీ రాకచూసి వెనక గేటు నుంచి పార్వతమ్మతోపాటు ఆ మహిళ పారిపోతారు. ఆటో ఎక్కి వెళ్లిపోతుంటే....జేడీ, కేడీ వాళ్లను ఫాలోఅవుతారు.
                        పార్వతమ్మ పారిపోయి దేవా వద్దకు వెళ్లిపోతుంది. అక్కడ మధు కొడుకు ఉంటాడు.ఎందుకు ఇక్కడికి వచ్చావని బామ్మను దేవా నిలదీస్తాడు.పోలీసులు నన్ను వెతుక్కుంటూ ఇంటి వరకు వచ్చారని బామ్మ చెబుతుంది. దేవా వెంటనే తన మనుషులకు బాబును ఇచ్చి వెనక నుంచి పారిపొమ్మని చెబుతాడు. వాళ్లు బయటకు వెళ్లగానే జేడీ, కేడీ కనిపిస్తారు.వాళ్లను చూసి రౌడీలు భయంతో మళ్లీ వెనక్కి పరుగెత్తుకుని వచ్చి దేవాకు చెబుతారు. ఇంతలోఅక్కడికి వచ్చిన జేడీ,కేడీ....దేవాకు వార్నింగ్ ఇస్తారు. ఇప్పటివరకు కౌషికిపై కోపంతో మీనన్ ఈ పని చేయించాడని అనుకున్నాం. కానీ సిటీలో చిన్నపిల్లలను ఎత్తుకుని వెళ్లి అమ్ముకునే ముఠా మీదేనని తెలిసిందని అంటారు. మర్యాదగా బాబును అప్పగించండని జేడీ హెచ్చరిస్తుంది. బాబును ఇచ్చేది లేదని చెప్పి బాబును తీసుకుని దేవా పారిపోవడంోత జేడీ వాడి వెంటపడుతుంది. ఇక్కడ  ఉన్న రౌడీలను కేడీ ఇరగదీస్తాడు. ఇంతలో బాబును జేడీకి ఇచ్చి దేవా పారిపోతాడు.
                   బాబును తీసుకుని వెనక్కివచ్చిన జేడీ....అసలు పిల్లను  ఎందుకు ఎత్తుకెళ్తున్నారని పార్వతమ్మను ప్రశ్నిస్తుంది. సిటీలో పిల్లలు లేని వాళ్లు మీనన్‌ దగ్గరకు వచ్చి డబ్బులిస్తే...నేను ఆస్పత్రుల్లో పిల్లలను మాయం చేసి వాళ్లకు ఇస్తుంటానని చెబుతుంది. రెండేళ్లుగా ఈ దందా చేస్తున్నట్లు  పార్వతమ్మ చెబుతుంది. వేరే బాబు బదులు  ఈ బాబును తీసుకొచ్చానని చెబుతుంది. బాబు బరువు చూ‌స్తున్నప్పుడే నేను ఎవరికీ తెలియకుండా బిడ్డను అక్కడి నుంచి ఎత్తుకునివచ్చానని చెబుతుంది. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి పార్వతమ్మతోపాటు మహిళను ఇద్దరు రౌడీలను అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా  ఆస్పత్రిలో వీరి కోసం పనిచేసే వారు ఉన్నారని ధాత్రి అంటుంది. ఆస్పత్రికి వెళ్లి డాక్టర్‌ను నిలదీస్తారు.మీకు ఆ పార్వతమ్మకు ఉన్న సంబంధం ఏంటని అడుగుతారు. తమకు ఆవిడ ఎవరో కూడా తెలియదని....పెద్దింటి బిడ్డ మిస్‌ అయ్యేసరికి కంగారుపడిపోయి వేరే బాబును తీసుకొచ్చి ఇచ్చామని చెబుతారు. దీంతో జేడీ డాక్టర్‌ను అరెస్ట్‌ చేయిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Godavari Serial Today July 28th: 'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
'గోదావరి' సీరియల్: తోట సీక్రెట్ రివీల్‌! జాను పోరాటానికి బ్రేకుల్లేనట్లేనా! సింహాద్రి చిక్కుల్లో పడతాడా!
Nindu Manasulu Serial Today July 28th: నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
నిండు మనసులు: సిద్ధూ- ప్రేరణల డబుల్ సక్సెస్‌.. డబుల్ సెలబ్రేషన్స్! సివిల్స్ క్లియర్‌..!
Karthika Deepam 2 Serial Today July 28th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న పెళ్లి చూపుల్లో ఊహించని ట్విస్ట్! జ్యోత్స్న నిజంగా నీ కూతురేనా? దీపతో నిజం చెప్పించిన మాలిని!
Podarillu Serial Today July 28th:ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?
పొదరిల్లు: ఇంట్లో నుంచి వెళ్లిపోవాలనుకున్న మాధవ్‌,కేశవ్‌, కన్నా....దీనికి మహాలక్ష్మీ రియాక్షన్ ఏంటి..?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Team India Squad: శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ప్రకటించిన BCCI - రవీంద్ర జడేజా రీఎంట్రీ
Telangana ACB Raids: తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
తెలంగాణ ఏసీబీ భారీ స్కెచ్ - ఐఏఎస్, ఐపీఎస్, రెవెన్యూ అధికారులపై దాడులకు రంగం సిద్ధం - తిమింగలాలపైనే గురి?
Crop Insurance: పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
పంటల బీమాకు మరో 3 రోజులే డెడ్‌లైన్.. ఎల్‌నినో ముప్పు ఉన్నా తక్కువగా రైతుల నమోదు
Vizianagaram Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
దైవదర్శనానికి వెళ్తుండగా విషాదం.. వ్యాన్‌ను ఢీకొట్టిన లారీ, ముగ్గురు మృతి, 13 మందికి గాయాలు
Maruti Brezza 2026: మారుతి బ్రెజ్జాలో బడ్జెట్‌ ఫ్రెండ్లీ వేరియంట్‌ ఇదే! - తగ్గిన ధర, పెరిగిన ఫీచర్లు
2026 మారుతి బ్రెజ్జా పూర్తి ధరల జాబితా విడుదల - ఏ వేరియంట్‌ రేటు ఎంతంటే?
AP Telangana Rain Alert: తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
తీరం దాటనున్న వాయుగుండం.. తెలంగాణలో 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీలో అక్కడ పిడుగులు పడే అవకాశం
Driving Safety Tips: రోడ్డు మీద హీరో కావాలంటే స్పీడ్ కాదు.. సేఫ్టీ ముఖ్యం! ప్రతి డ్రైవర్ తప్పక తెలుసుకోవాల్సిన టిప్స్
బండి స్పీడ్‌లో ఉంది.. కానీ బ్రెయిన్‌ అలర్ట్‌గా ఉందా? ప్రమాదాలను తప్పించే సింపుల్ ట్రిక్స్
Embed widget