అన్వేషించండి

Chinni Serial Today February 12th: చిన్ని సీరియల్: ఇక నుంచి చిన్నిగా వసుధార! నాగవల్లికి నిజం చెప్పేసిన బాలరాజు! దేవాని చంపేస్తుందా!

Chinni Serial Today Episode February 12th దేవానే మీ అక్కని చంపాడు అని బాలరాజు నాగవల్లికి చెప్పడం నాగవల్లి గన్ తీసుకొని దేవాని షూట్ చేయాలని వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తిరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని సీరియల్‌ లవర్స్‌కి అదిరిపోయే సర్‌ఫ్రైజ్ ఇచ్చారు టీమ్. రిషి సార్ రిషి సార్ అంటూ గుప్పెడంత మనసు సీరియల్‌లో వసుధారగా ఎంతో మంది అభిమానులను దక్కించుకున్న వసుధార చిన్ని సీరియల్‌లో చిన్ని అలియాస్ మధుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈరోజు ఎపిసోడ్‌లో వసుధారని చిన్నిగా చూడొచ్చా లేదా తెలియాలి అంటే ఇవాళ్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

సత్యభామ మ్యాడీని తీసుకొని ఫోన్ వచ్చిన లొకేషన్‌కి బయల్దేరుతుంది. స్వరూప సుబ్బుతో ఏంటి మీరు కంగారుగా అలా చెప్తున్నారు.. కొంచెంలో దొరికిపోయే వాళ్లం అని అంటుంది. కరెక్ట్‌గా ఎలా చెప్తా స్వరూప నేను చిన్ని కన్న తండ్రికి కాదు కదా అంటాడు. మరోవైపు నాగవల్లి బాలరాజు దగ్గరకు వెళ్లుంది.  అన్నీ వసతలు బాగున్నాయా.. ఎక్కువ రోజులు నీకు ఇబ్బంది పెట్టంలే.. తొందర్లోనే నీ కూతురిని కూడా కనిపెట్టేసి ఇక్కడికి తీసుకొస్తాం.. నిన్నూ నీ కూతుర్ని నీ భార్య దగ్గరకు పంపేస్తా అంటుంది. 

బాలరాజు పెద్దగా నవ్వుతాడు. ఎందుకురా అలా నవ్వుతున్నావ్ అని నాగవల్లి అంటే రౌడీలు నాగవల్లితో నిన్నటి నుంచి ఇలాగే నవ్వుతున్నాడు. అడిగితే పిల్లి పిల్లల్ని మార్చినట్లు.. తన కూతురికి భయపడి మీరు మార్చుతున్నారని చెప్తారు. నీ కూతురికి భయపడి మార్చడం లేదురా.. ఆఫ్ టికెట్ నిన్ను తప్పించాలని చూస్తున్నాడు అందుకే మార్చాం అని అంటుంది. నీ భార్య మా అక్కని చంపినందుకు నీ ఫ్యామిలీ మొత్తాన్ని చంపే వరకు నా పగ చల్లారదు అని నాగవల్లి అంటుంది. అలా అయితే నా ఫ్యామిలీ మొత్తాన్ని చంపినా నీ పగ చల్లారదు.. ఎందుకంటే నీ అక్కని చంపిన వాళ్ల మీద కదా నీ పగ.. నిజానికి నీ అక్కని చంపింది కావేరి కాదు.. మీ అక్కని కావేరి చంపనప్పుడు కావేరి ఫ్యామిలీ మొత్తాన్ని చంపినా నీ పగ చల్లారదు అంటాడు. నాగవల్లి షాక్ అయి మా అక్కని కావేరి చంపకపోవడం ఏంటి. మరి ఎవరు చంపారు అని అడుగుతుంది. చెప్తే నీ గుండె పగిలిపోతుంది అని బాలరాజు అంటాడు. చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అని కర్ర తీస్తుంది. దాంతో బాలరాజు మీ అక్కని అతి దారుణంగా చంపింది ఎవరో కాదు మీ బావ దేవా.. అవును మీ అక్క మెడలో తాళి కట్టిన మీ బావే ఆస్తి కోసం మీ అక్కని చంపేశాడు.. అని బాలరాజు చెప్పడంతో నాగవల్లి బిత్తరపోతుంది. 

సత్యభామ, మహి లొకేషన్‌కి వెళ్తారు. ఇక్కడికి ఎందుకు వచ్చాం అని మ్యాడీ అడిగితే మధు ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఇక్కడికి వచ్చాం అని అంటుంది. ఇక ఫోన్ కోసం ఇద్దరూ ఆ ప్రాంతంలో వెతుకుతారు. ఇంతలో సత్యభామకి ఫోన్ దొరుకుతుంది. ఫోన్ కవర్ తీసి చూస్తే అందులో మ్యాడీ ఫొటో ఉంటుంది. దాని మీద హనుమంతుడి గుండె చీల్చితే రాముడు ఉంటాడు.. నా గుండె చీల్చితే నా రాముడు మ్యాడీ ఉంటాడు అని ఉంటుంది. చిన్నిని నేను ప్రేమించిన దానికి వంద రెట్లు మధు నన్ను ప్రేమిస్తుంది. గుండెలో అంత ప్రేమ ఉంచుకొని నా మాటకి విలువ ఇచ్చి నాకు దూరంగా ఉంది.. కానీ ఆ మనిషి ప్రేమని ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోకపోవడం నా దురదృష్టం.. నా మధు నాకు కావాలి.. నన్ను అంతలా ప్రేమించే నా మధుని నేను ఎలా అయినా కాపాడుకోవాలి.. మధు లేకుండా బతకడం కష్టం అనిపిస్తుందని అని మ్యాడీ అంటాడు. మధు ఆచూకీ నేను కనిపెడతాడా.. నిన్ను అంతలా ప్రేమిస్తున్న మధుని నీ ముందు నేను నిలబెడతా అని సత్య అంటుంది. 

నాగవల్లి బాలరాజు మాటలు తలచుకొని అక్క ఫొటో చూస్తూ వినకూడని మాట విన్నాను అక్క. బావే నిన్ను అతిదారుణంగా చంపాడు అని విని తట్టుకోలేకపోయాను.. ఆస్తి కోసం నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న బావ నిన్ను చంపేశాడు అంటే తట్టుకోలేకపోయాను.. వెంటనే బావని కాల్చి చంపేయాలి అనిపించింది కానీ బావ ఎదురుగా లేడు.. చేతిలో రివాల్వర్ కూడా లేదు అనుకుంటుంది. ఇంతలో దేవా ఆ మాటలు విని బిత్తరపోయి నాగవల్లి ఎదురుగా నిల్చొంటాడు. నాగవల్లి గన్ తీసుకురాగానే నాగవల్లి ఏం చేస్తున్నావ్ నువ్వు ఆ బాలరాజు ఏదో చెప్తే అది నువ్వు నమ్మేస్తున్నావా అని కంగారు పడి అడుగుతాడు. నువ్వే అక్కని చంపావని బాలరాజు చెప్పినప్పుడు నువ్వు నా పక్కనే ఉండి ఉంటే నువ్వు నా మెడలో తాళి కట్టిన భర్త అని కూడా చూడకుండా.. నా పసుపుకుంకుమలు పోతాయనే బాధ కూడా లేకుండా చంపేసేదాన్ని.. కానీ అదే ఆవేశంతో వచ్చిన నా ఆవేశం ఇంటికి రాగానే తగ్గి ఆలోచన మొదలైంది.. తన కూతుర్ని తనని కాపాడుకోవడానికే ఆ బాలరాజు అలా చెప్పాడని అర్థమైంది.. ఇప్పుడే వాడిని చంపేస్తా అని నాగవల్లి అంటుంది. చిన్ని కూడా దొరికాక వాళ్లిద్దరినీ కలిపి చంపేస్తా అని నేను వాడికి ఛాలెంజ్ చేశా అర్థం చేసుకో అని అంటాడు. నీ ఇష్టం బావ అని నాగవల్లి గన్ ఇచ్చేసి వెళ్లిపోతుంది. కొంచెంలో తప్పించుకున్నా అని దేవా అనుకుంటాడు. 

మ్యాడీ మధు గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సత్యభామ చూసి మ్యాడీ దగ్గరకు వెళ్లి చిన్నిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తెలిసిన మధు.. నీకు చిన్నికి సాయం చేసిన మధు సడెన్‌గా నీకు అంతలా ప్రేమించడం ఆశ్చర్యంగా ఉంది.. ఓ పోలీస్ ఆఫీసర్‌గా ఆనుమానిస్తున్నా.. సడెన్‌గా జరిగిన పెళ్లిని నువ్వు ఎలా అయితే పెళ్లి కాదు అనుకున్నావో అలాగే మధు అనుకోవాలి కదా.. నువ్వు చిన్నిని అంతలా ప్రేమిస్తున్నావ్ అని తెలిసిన ఏ అమ్మాయి నిన్ను ప్రేమించదు.. కదా  మరి మధు ఎలా ప్రేమించింది అని సత్యభామ అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today June 8th: నిండు మనసులు: సిద్ధూతో దారుణంగా మాట్లాడిన సాహితి! విజయానంద్ కాల్చేసింది ఎవర్ని?
నిండు మనసులు: సిద్ధూతో దారుణంగా మాట్లాడిన సాహితి! విజయానంద్ కాల్చేసింది ఎవర్ని?
Podarillu Serial Today June 8th:నెరవేరిన మహాలక్ష్మీ కల..కొత్త జాబ్‌తో పాటు మహాకు కొత్త కష్టాలు
పొదరిల్లు: నెరవేరిన మహాలక్ష్మీ కల..కొత్త జాబ్‌తో పాటు మహాకు కొత్త కష్టాలు
Illu Illalu Pillalu Serial Today June 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుందా! కత్తి పట్టిన రామరాజు సేనాని ఏం చేశాడు?
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ధీరజ్ కోసం ప్రేమ శాశ్వతంగా పుట్టింటికి వెళ్లిపోతుందా! కత్తి పట్టిన రామరాజు సేనాని ఏం చేశాడు?
Vishnu Kanth: గుండెనిండా గుడిగంటలు బాలు.. ప్రేమ పెళ్లి 15 రోజుల్లోనే బ్రేకప్.. విష్ణుకాంత్ రియల్ లైఫ్ విషయాలు
గుండెనిండా గుడిగంటలు బాలు.. ప్రేమ పెళ్లి 15 రోజుల్లోనే బ్రేకప్.. విష్ణుకాంత్ రియల్ లైఫ్ విషయాలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
Pawan Kalyan Social Engineering: కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
కులాలను కలిపే రాజకీయంలో మాస్టర్ క్లాస్ - దీర్ఘకాలిక రాజకీయ వ్యూహమే - పవన్ కల్యాణ్ మారిపోయారా?
Chepa Prasadam: నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
నేటి నుంచి చేప ప్రసాదం పంపిణీ,టైమింగ్స్ ఇవే- హైదరాబాద్‌లో 2 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు
Rajinikanth Annamalai New Party TN: అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
అన్నామలైతో పాటు రజనీకాంత్ కూడా - ఇద్దరూ కలిసే కొత్త పార్టీ - తమిళనాడులో అంతా మారిపోతోందా?
RERA Rules: ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
ఫ్లాట్ మీ చేతికి రాకున్నా EMIలు కడుతూనే ఉన్నారా? ఈ విషయాలు తెలుసుకోండి
School Holidays: విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
విద్యార్థులకు పండగే.. తెలంగాణలో సమ్మర్ హాలిడేస్ పొడిగించిన విద్యాశాఖ
Smoking With Tea : టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
టీ తాగుతూ సిగరెట్ కాలుస్తున్నారా? అయితే జాగ్రత్త ఈ ఆరోగ్య ప్రమాదాలు తప్పవట
Tiger Hunt in Polavaram: ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
ప్రజలు ఆందోళన చెందవద్దు.. అప్రమత్తంగా ఉండండి: పోలవరం అడవుల్లో పులి వేట!
Embed widget