అన్వేషించండి

Lakshimi Raave Maa Intiki Serial Today February 11th: శ్రీలక్ష్మీ తల్లిదండ్రులను ఘోరంగా అవమానించిన ప్రియంవద...పబ్‌లో మ్యాడీ చెంపపగులగొట్టిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki Serial Today Episode February 11 th: శ్రీలక్ష్మీ తల్లిదండ్రులను ఘోరంగా అవమానించిన ప్రియంవద...పబ్‌లో మ్యాడీ చెంపపగులగొట్టిన సూర్యనారాయణ

Lakshimi Raave Maa Intiki  Serial Today Episode:  మ్యాడీని  వెతుక్కుంటూ సూర్యనారాయణ, శ్రీలక్ష్మీ పబ్‌కు వెళ్తారు. అప్పటికే ఫుల్‌గా  మందుతాగి  మ్యాడీ  అక్కడ చిందులేస్తుండటం చూసి ఆగిపోతారు. అక్కడ ఉన్న పబ్‌లో వారందరికీ తన కథ మొత్తం మ్యాడీ చెబుతుంటాడు. తన లైఫ్‌లో ఇద్దరు శత్రువులు ఉన్నారని అంటాడు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు  వచ్చావని అడిగితే రిసెప్షన్ నుంచి పారిపోయి వచ్చానని అంటాడు. అదేంటి  ఇష్టం లేకపోతే పెళ్లి నుంచి పారిపోవాలి గానీ....రిసెప్షన్‌ నుంచి ఎందుకు పారిపోయి వచ్చావని అందరూ నిలదీస్తారు. నా ప్రమేయం లేకుండానే ఈ పెళ్లి జరిగిందని చెబుతాడు. నా మొదటి శత్రువు అయిన శ్రీలక్ష్మీకి ఓ తాగుబోతు వాడితో పెళ్లి జరుగుతుంటే అది చూసి ఆనందపడదామని అక్కడికి  వెళ్లానని....అక్కడ కేవలం కూరకోసం గొడవపడి ఆ శ్రీలక్ష్మీ  తన పెళ్లి చెడగొట్టుుకుందని హేళనగా మాట్లాడటం చూసి సూర్యనారాయణకు కోపం వస్తుంది. ఇక  మా ఇంట్లో ఉన్న రెండో శత్రువు మా తాతయ్యని అతను మా ఇంటికే హిట్లరని  ఆయన ఏం చెబితే ఇంట్లో అందరూ  అదే వినాలని  అంటాడు.  ఎంతలా అంటే మా నాన్న కూడా  ఆయన మాటకు ఎదురుచెప్పలేడని చెబుతాడు. మా తాతయ్యే నాకు బలవంతంగా  ఆ శ్రీలక్ష్మీతో తాళి కట్టించాడని అంటాడు. నాకంటూ  ఇంట్లో ఉన్న ఏకైక మద్దతు మా అత్త నుంచే ఉంటుందని..ఆమె నన్ను బాగా  అర్థం చేసుకుంంటుందని తాగిన మత్తులో వాగుతుంటాడు.  
                     ఇంటినుంచి బయటకు వెళ్లిన శ్రీలక్ష్మీ, సూర్యానారాయణ ఇంకారాకపోవడంతో రిసెప్షన్‌కు వచ్చిన బంధువులతోపాటు  కోటేశ్వరరావు, నూకాలు కూడా ఎదురుచూస్తుంటారు.ఇంతలో మ్యాడీ బంధువుల్లో ఒక ఆమె మీరు మీ మనవడు,మనవరాళ్లను పల్లెటూరు సంబంధాలు ఇచ్చి పెళ్లిచేశారంట  కదా అని ఆరా తీస్తుంది. మీరు కోరుకుంటే కోటీశ్వరులు మీ ఇంటి ముందు క్యూ కడతారు కదా ఎందుకు ఇలాంటి సంబంధాలు చేశారనిఅడగ్గా....ప్రియంవద కల్పించుకుని ఆ పల్లెటూరు పెళ్లికూతురు బయటకు వెళ్లిందని వాళ్ల అమ్మానాన్న వీళ్లని అంటుంది. ఎక్కడో నక్కతోక తొక్కితే ఇలాంటి సంబంధం దొరికిందని అనగా...ఇందిరకు కోపం వస్తుంది.నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడమని హెచ్చరిస్తుంది.అయినప్పటికీ ప్రియంవద శ్రీలక్ష్మీ తల్లిదండ్రులను అవమానిస్తూనే ఉంటుంది. కేవలం కూర కోసం పెళ్లి సంబంధం చెడగొట్టుకున్నారని అంటుంది. ఆతాగుబోతు బుల్లిరాజు కన్నా  మా మ్యాడీకి ఇచ్చి పెళ్లి చేస్తే ఆస్తి మొత్తం కలిసొస్తుందని పథకం వేసి ఈమెగారు కిరోసిన్ పోసుకున్నట్లు నాటకం ఆడిందని అంటుంది. ఆ శ్రీలక్ష్మీ వద్దువద్దూ  అంటూనే పెళ్లిపీటలు ఎక్కి కూర్చుందని తిడుతుంది. ఈ మాటలకు కోటేశ్వరరావుకు కోపం వస్తుంది.మేం ఏం నాటకాలు ఆడి ఈ పెళ్లి చేయలేదని...మా అమ్మాయి గుణగణాలు నచ్చే మీ నాన్న  ఈ పెళ్లి చేశాడని అంటాడు.
    
                    అక్కడ పబ్‌లోశ్రీలక్ష్మీ గురించి మ్యాడీ తప్పుగా మాట్లాడుతూనే ఉంటాడు. తన మెడలో తనతో మాతాత తాళి కట్టించి నా గొంతుకోశాడని మాట్లాడుతూనే ఉంటాడు. అక్కడ ప్రియంవద కూడా రెచ్చిపోతుంది. ఈ పెళ్లి, రిసెప్షన్‌ ఇష్టం లేక మా మేనల్లుడు గోడదూకి పారిపోయాడని చెప్పడంతో అక్కడ ఉన్న అందరూ నోరు వెళ్లబెడతారు.ఇందరి కల్పించుకుని కోటేశ్వరరావు,నూకాలకు సర్దిచెబుతుండగా...ప్రియంవద ఈరిసెప్షన్ జరగదని అందరూ వెళ్లిపోవాలని చెబుతుంది. నూకాలుకు  కోపం వచ్చి పెద్దయ్యగారు రాగానే మా శ్రీలక్ష్మీని తీసుకుని మేం వెళ్లిపోతామని అంటుంది. అంతలో సూర్యనారాయణ మ్యాడీ వద్దకు వెళ్లి లాగిపెట్టి కొడతాడు. దీంతో మ్యాడీకి మత్తు వదిలిపోతుంది. గల్లాపట్టుకుని మ్యాడీని ఇంటికి లాక్కెళ్లతాడు. నాకు రిసెప్షన్‌ ఇష్టం లేదని...నాకు  పెళ్లి అయిన సంగతి ఎవరికీచెప్పాలనుకోవడం లేదని అంటాడు. ఇప్పుడు మీరు ఇక్కడ చేసిన పని ఏంటని శ్రీలక్ష్మీ నిలదీస్తుంది. మీరు ఇక్కడికి  వచ్చిన సంగతి అక్కడ ఎవరికీ  తెలియదని మర్యాదగా రావాలని కోరుతుంది.   

 

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today August 13th:కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
జగద్ధాత్రి సీరియల్: కేదార్‌ను కత్తితో పొడవబోయిన యువరాజు....అడ్డుపడిన కమలాకర్‌ చేతికి గాయం
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: ఆ స్కెచ్ మా అమ్మది కాదు.. షాక్‌ ఇచ్చిన క్రిష్! అంబిక బండారం సిద్ధార్థ్‌ బయట పెడతాడా!
Illu Illalu Pillalu Serial Today August 13th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: 'ఆడపిల్ల మనసు అర్థం చేసుకోలేని భర్త నాకు వద్దు'.. ప్రేమ సంచలన నిర్ణయం!
Godavari Serial Today August 13th: 'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!
'గోదావరి' సీరియల్: తల్లీ, పెళ్లాం మధ్య ఇరుక్కున్న మురళీకృష్ణుడు! జాను ఇంటి దగ్గర సింహాద్రి రచ్చ!

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget