Chinni Serial Today December 5th: చిన్ని సీరియల్: మ్యాడీ, శ్రేయల పెళ్లి ఫిక్స్! మధుకి షాక్ ఇచ్చిన నాగవల్లి! ఏం జరగనుందో!
Chinni Serial Today Episode December 5th మధు చిన్ని అని నాగవల్లికి తెలుసు అని నాగవల్లి మధుతో చెప్పి మధుకి వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ తనని పట్టించుకోవడం లేదని శ్రేయ ఏడుస్తూ నాకు కొంచెం విషం ఇచ్చి చంపేయండి అని ఏడుస్తుంది. దేవా శ్రేయ దగ్గరకు వెళ్లి నువ్వు నా మేనకోడలివి అయినా చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండటం వల్ల ఈ ఇంటి ఆడబిడ్డవి అయ్యావు.. ఆడబిడ్డ కన్నీరు తుడవలేకపోతే మేం ఉన్నాం చచ్చినట్లే నువ్వు వాళ్లతో పోల్చుకోవడం ఏంటమ్మా.. నీ మేనమామగా చెప్తున్నా నువ్వే నా కోడలివి అని అంటాడు.
నాగవల్లి కూడా ఆరు నూరు అయినా అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే నీతో మ్యాడీ పెళ్లి అవుతుంది అని అంటుంది. మ్యాడీ మీద నువ్వు పెంచుకున్న పిచ్చి ప్రేమకు ఆ మ్యాడీ మెడలు వంచి అయినా నీ మెడలో తాళి కట్టిస్తా జరగబోయే మీ పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు అని దేవా అంటాడు. శ్రేయ మామయ్యకి థ్యాంక్స్ చెప్తుంది. ఆంటీ అంకుల్ తలచుకుంటే జరగనింది ఏం ఉంది శ్రేయ అని లోహిత అంటుంది.
మహి భర్త్డే వేడుకలు జరుగుతాయి. మ్యాడీకి దేవా, నాగవల్లి కేక్ తినిపిస్తారు. శ్రేయ కూడా తినిపిస్తుంది. చివరకు మధు కూడా తినిపిస్తుంది. ఇక పుట్టిన రోజు వేడుకలో దేవా మ్యాడీకి శ్రేయకి పెళ్లి చేస్తామని అనౌన్స్ చేస్తాడు. దాంతో మహితో పాటు మధు కూడా షాక్ అయిపోతుంది. దేవా మహితో ఏంటి నాన్న ఇంత గుడ్‌న్యూస్ చెప్తే నువ్వు అంత డల్‌గా ఉన్నావ్.. నీ ఇష్టప్రకారమే కదా ఇదంతా జరుగుతుంది అని అంటాడు. అందరూ శ్రేయ, మ్యాడీలకు కంగ్రాట్స్ చెప్తారు. ఇక మ్యాడీ అందరి ముందు తన తల్లిదండ్రుల మాటని కాదు అనను అని అందుకే నా మేనకోడలు శ్రేయని కూడా పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు.
మధు బయటకు వెళ్లి బాధ పడుతుంది. ఇంతలో లోహిత వచ్చి చిన్ని నువ్వే అని మ్యాడీకి తెలిస్తే ఇన్ని రోజులు చిన్ని అని దాచినందుకు నిన్ను గేటు కూడా దాటనివ్వడు అని అంటుంది. నేను వరుణ్ దగ్గర రిచ్ అని చెప్పా నువ్వు చిన్ని అని మహి దగ్గర దాచేశావ్ నువ్వు లైఫ్ లాంగ్ ఏడుస్తావ్ అని అంటుంది. నేను ఏడుస్తానా.. నిన్నే ఏడిపిస్తానే అని మధు అంటుంది. దానికి లోహిత ఏం చేస్తావే మా అన్నయ్యకి చెప్తావా.. మా అన్నయ్య ఏం చేయలేడు ఎందుకంటే నా మెడలో తాళి ఉందే.. నేనేం చేయగలనో తెలుసా ఇప్పుడే నిన్ను మెడ పట్టుకొని గెంటేయగలను అని అంటుంది.
మధు లోహితతో ప్రస్తుతానికి సేఫ్ జోన్‌లో ఉన్న నువ్వు డేంజర్ జోన్‌లోకి వస్తావ్.. నేను సేఫ్ జోన్‌లోకి రావడం పక్కా అని అంటుంది. మధు బాధ పడుతుంటే స్వప్న మధుని ఓదార్చుతుంది. లోహిత అన్ని మాటలు అంటే ఎందుకే వదిలేశావ్ అని అడుగుతుంది. మ్యాడీకి నువ్వే చిన్ని అని చెప్పేయ్.. ఇప్పుడు చెప్పకపోతే జీవితంలో చెప్పలేవు అని అంటుంది. ఇప్పుడే చెప్పేస్తా అని మధు వెళ్తుంది. మధు లోపలికి వెళ్తుంటే నాగవల్లి అడ్డుకుంటుంది. మళ్లీ ఎక్కడికి వస్తున్నావే అని అంటుంది. ఫ్రెండ్లీగా మ్యాడీతో మాట్లాడటానికి వెళ్తున్నా అని మధు అంటే హో ఫ్రెండ్‌గా వెళ్తావా ఏ ఫ్రెండ్‌గా వెళ్తావ్ ఎంటెక్‌లో పరిచయమైన మధులానా చిన్నప్పటి ప్రాణ స్నేహితురాలు చిన్ని లాగా అని వల్లీ అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటే అంత షాక్ అవుతున్నావ్ నువ్వే చిన్ని అన్న విషయం నాకు తెలుసు.. నువ్వు అటు చిన్నిగా ఇటు మధుగా మ్యాడీని లవ్ చేస్తున్నావ్ అని కూడా తెలుసు.. మ్యాడీ,శ్రేయలకు పెళ్లి ఫిక్స్ అయిందని తెలిసి కూడా వాడిని కలవడానికి ఎందుకు వెళ్తున్నావ్.. నిన్ను పెళ్లి చేసుకోమని చెప్పడానికా అని అడుగుతుంది. దానికి మధు మ్యాడీ వాళ్ల అమ్మని మా అమ్మ చంపలేదు అని చెప్పడానికి వెళ్తున్నా అని అంటుంది. నోర్ముయ్ అని నాగవల్లి అరుస్తుంది. మీకు నేను చెప్తే వినరు కానీ దేవా అంకుల్‌కి చెప్తా అని అంటుంది. దానికి నాగవల్లి మా బావకి నువ్వు చిన్ని అని తెలిస్తే ఇన్నేళ్లు తన కొడుకుని ఇంత బాధ పెట్టినందుకు నీ పీక పిసికి వెంటనే చంపేస్తాడు.. తప్పు చేసిన వాళ్లని శిక్షించడం తప్ప క్షమించడం రాదు మా బావకి.. నేను కాబట్టి నిన్ను క్షమించా.. మ్యాడీ పెళ్లి అయ్యే వరకు ఇలాగే ఫ్రెండ్‌లా వస్తుండు.. అంతే అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















