Chinni Serial Today September 27th: చిన్ని సీరియల్: కథలోకి రాకుమారి.. రాజకుమారుడికి తెలుస్తుందా! లోహితకు తెలిసిన నిజమేంటి?:
Chinni Serial Today Episode September 27th మధుకి ఆఫ్ టికెట్ కాల్ చేసి బాలరాజు కిడ్నాప్ అయ్యాడని చెప్పి మధుని జాగ్రత్తగా ఉండమని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధు మ్యాడీ కోసం వెతుకుతుంది. మ్యాడీ వెళ్లిపోయాడని ఫ్రెండ్స్ చెప్పడంతో మధు స్వప్న స్కూటీ తీసుకొని మ్యాడీ కోసం వెతుకుతూ వెళ్తుంది. మ్యాడీ ఓ చోట కూర్చొని చిన్నిని తలచుకొని ఏడుస్తూ ఉంటాడు. మధు ఓ చోట ఉంటే చూసి వెళ్తుంది.
మ్యాడీ నువ్వు దేవదాసు అయిపోతావ్ అని డౌట్ వస్తుందని అంటుంది. ఏంటి మధు అంత మాట అన్నావ్ అంటే ఊరికే అన్నాను అని అంటుంది. నీ బాధ ఏంటి మ్యాడీ.. నువ్వు ప్రేమించిన అమ్మాయి నీకు కలవలేదు అనే కదా.. మీ ఇద్దర్ని నేను కలుపుతా అని మధు అంటుంది. రాజకుమారుడు రెక్కల గుర్రం మీద వచ్చి రాకుమారిని తీసుకెళ్తాడు కానీ నీ కథలో రాకుమారి వచ్చి నిన్ను రెక్కల గుర్రం మీద తీసుకెళ్తుందని అంటుంది. పోయిన పెయింటింగ్ చూపించి నీ రాజకుమారి చాలా బాగుంది అని కథ చెప్పి మ్యాడీని నవ్వించేస్తుంది.
మ్యాడీ చేతిని మ్యాడీ గుండెల మీద పెట్టి మ్యాడీ నిజంగా నిన్ను వెతుక్కుంటూ నీ రాజకుమారి వస్తుంది..నువ్వు కట్టుకున్న నీగుడిలోకి వస్తుంది. బాధ పడకు మ్యాడీ.. నువ్వు బాధ పడితే నేను చూడలేను అని అంటుంది. నువ్వు చెప్తుంటే నిజంగా వస్తుందని అనిపిస్తుంది థ్యాంక్స్ మధు అని మ్యడీ చెప్తాడు. మధు పానీ పూరీ తీసుకొచ్చి మ్యాడీకి తినిపిస్తుంది. మ్యాడీ నువ్వు ప్రేమించిన అమ్మాయి గురించి చెప్పు అని అడుగుతుంది. తన కళ్లు కలువ పువ్వులు, నవ్వులు పండు వెన్నెల, మాటలు చిలక పలుకులు అని మ్యాడీ చిన్ని గురించి చిన్నికే వర్ణిస్తాడు. చిరునామా తన చిరునామా.. అంటూ పాట పాడుతూ డ్యాన్స్ చేస్తాడు. తన పేరు ఏంటి ఎక్కడ కలిశావ్ అన్నీ చెప్పు అని మధు అడుగుతుంది.
మ్యాడీ పేరు చెప్పే టైంకి మ్యాడీకి నాగవల్లి కాల్ చేస్తుంది. ఇంటికి గెస్ట్‌లు వస్తున్నారు త్వరగా రమ్మని చెప్తుంది. మ్యాడీ మధుతో వరుణ్‌కి మ్యాచ్ ఫిక్స్ అయింది డిన్నర్‌కి వస్తున్నారు నేను వెళ్లాలి అని మధుని జాగ్రత్తగా ఇంటికి వెళ్లిపోమని చెప్పి మ్యాడీ వెళ్లిపోతాడు. మధు మ్యాడీ రాకుమారి తాను అవ్వలేకపోతున్నా అని ఏడుస్తుంది. మరోవైపు నాగవల్లి పురమాయించిన రౌడీ లోహిత వాళ్ల ఇంటిని వీడియో తీస్తూనే ఉంటాడు. ఇంతలో లోహిత బయట నుంచి వచ్చి వీడియో తీయడం చూసి వీడు ఎవడా అని అనుకుంటుంది. దగ్గరకు వెళ్లి అతన్ని అడుగుతుంది. వీడియో తీయడం లేదు మేడం రీల్స్ చేస్తున్నా అని అంటాడు. అతని దగ్గర ఫోన్ లాక్కొని వీడియోలు, ఫొటోలు చూసి షాక్ అయిపోతుంది. వీడు నాగవల్లి మనిషా.. అని ఎలా అయినా పంపించేయాలని అనుకొని కానిస్టేబుల్ రావడం చూసి అతన్ని ఆపి ఫొటోలు తీస్తున్నాడని చెప్పి కొట్టిస్తుంది. ఫోన్‌లో ఫొటోలు అన్నీ డిలీట్ చేసేస్తుంది. దెబ్బకి ఆ రౌడీ పారిపోతాడు. నాగవల్లికి మా గురించి తెలిసిపోయినట్లు ఉంది.. వరుణ్‌తో పెళ్లి అయ్యేవరకు జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది.
వరుణ్‌కి అందరూ నీకు కాబోయే భార్య వస్తుందని సర్‌ఫ్రైజ్ ఇస్తారు. వరుణ్ షాక్ అయిపోతాడు. డిన్నర్ ఏర్పాట్లు పూర్తయిపోతాయి. మరోవైపు ఆఫ్ టికెట్ చిన్నికి కాల్ చేస్తాడు. బాలరాజు అన్నని ఎవరో ఎత్తుకుపోయారని.. నిన్ను బయటకు తీసుకురావాలి అనే ఇదంతా చేస్తున్నారని అంటాడు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావ్ ఆఫ్ టికెట్ ఎవరు వాళ్లు నువ్వు చెప్పు అని అడిగితే ఆఫ్ టికెట్ కావాలనే తెలీదు అని చెప్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి.. నువ్వే చిన్ని అని ఎవరికీ తెలీకూడదు.. నీకు తోడుగా నేను ఉన్నానమ్మా అని అంటాడు. చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. తర్వాత కావేరి ఫొటో దగ్గరకు వెళ్లి నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదమ్మా.. నేను ఇష్టపడేది ఏదీ నా దగ్గర ఉండటం లేదు.. నాన్న, నువ్వు, చందు మీ ముగ్గురు నాకు చాలా ఇష్టం మీలో ఎవరూ నా దగ్గర లేరు అని ఏడుస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















