Nuvvunte Naa Jathaga Serial Today September 27th: నువ్వుంటే నా జతగా సీరియల్: రాహుల్, త్రిపురల ఈవిల్ ప్లాన్! ఆదిత్యను మిథున నిలదీయడానికి కారణమేంటి?
Nuvvunte Naa Jathaga Serial Today Episode September 27th దేవాని తనని విడదీయాడానికి ఆదిత్య కారణం అని ఆదిత్యను మిథున ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode మిథున ప్రమోదినితో దేవా ఇలా ఎందుకు సడెన్‌గా మారిపోయాడో అర్థం కావడం లేదని అంటుంది. దానికి ప్రమోదిని దేవా నిన్ను భార్యగా అంగీకరించాడు అనడానికి నేనే ప్రత్యక్ష సాక్షిని కానీ దేవా సెడన్‌గా ఇలా మారిపోవడానికి ఏదో పెద్ద కారణమే ఉంది.. మన చుట్టూ ఉన్న వాళ్లే కారణం అని అనిపిస్తుంది. మనం బాగా నమ్మిన వారే ఇదంతా చేసుంటారని ప్రమోదిని అంటుంది.
మిథున ఆలోచనలో పడుతుంది. ఆదిత్య గురించి ఆలోచించి దేవా నాకు మెట్టెలు తొడగడు అని ఆదిత్య అంత కచ్చితంగా ఎలా చెప్పాడు.. ఆదిత్య మమల్ని విడదీయాలి అని చూస్తున్నాడా అని ఆలోచిస్తుంది. మరోవైపు త్రిపుర, రాహుల్ దేవా గురించి మాట్లాడుకుంటారు. మిథున అంత కేసు నుంచి విడిపించినందుకు మిథున మీద వాడి ప్రేమ బయటకు తీయొచ్చు.. చావు అయినా బతుకు అయినా మిథునతో అనుకునే పరిస్థితి రావొచ్చు.. ఎలా ఆపాలి అని త్రిపుర అంటే.. ఆ ఇంటి మొత్తాన్ని విడదీసేద్దాం.. ఇంట్లో అందరూ పీకల్లోతు ఊబిలో పడేటట్లు చేద్దాం అప్పుడు వాళ్లలో వాళ్లు కొట్టకు చస్తారు. అప్పుడు ఆటోమెటిక్‌గా దేవా, మిథున మధ్య కూడా గొడవలు వస్తాయి.. ఆ గొడవ మనం వాడుకుంటే మిథున శాశ్వతంగా మన ఇంటికి వచ్చేస్తుందని రాహుల్ చెప్తాడు. ఐడియా బాగుంది మరి ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అని త్రిపుర అడుగుతుంది. కాంతం, రంగాలను పావులగా వాడుకోవాలని వాళ్లతో మాట్లాడుదాం పిలిపించు అని అంటాడు.
దేవా గ్యారేజ్‌కి వెళ్లాడు. నిన్ను బయటకు తీసుకురావడానికి వదిన చాలా కష్టపడింది.. వదినకు నువ్వు అంటే ప్రాణం అని దేవా ఫ్రెండ్స్ చెప్తారు. వదిన మంచిది వదిన మీద నీ ప్రేమ చంపుకోవద్దు.. అని అంటారు. దేవా ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు. మన మాటలు అన్న మీద పని చేస్తాయని అనుకుంటారు.
రాహుల్, త్రిపురలు రంగం, కాంతం కోసం వెయిట్ చేస్తుంటారు. వాళ్లు లక్షనే ఇచ్చారు కదా ఇంకా వాళ్ల దగ్గర డబ్బు కొట్టేద్దాం.. మిథున, దేవాల్ని విడదీయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నాం అని చెప్పి ఇంకా డబ్బు అడుగుదాం అనుకుంటారు. తీరా వేళ్తే త్రిపుర ఇద్దరికీ షాక్ ఇస్తుంది. మేం చెప్పిన పని చేయలేదు మా లక్ష మాకు ఇచ్చేయండి అని రివర్స్ అవుతుంది. కాంతం, రంగం త్రిపుర కాళ్లు పట్టేస్తారు. త్రిపుర వాళ్ల ఇద్దరి మీదకు డబ్బు కట్టలు విసురుతుంది. ఈ సడెన్ అదృష్టానికి కారణం ఏంటి మేడం మేం ఏం చేయాలి అని కాంతం అడుగుతుంది. ఓ విజిటింగ్ కార్డు ఇచ్చి మీ అన్నని ఈ జాబ్‌లో జాయిన్ అవ్వమని చెప్పు మిగతాది మేం చూసుకుంటాం అని అంటారు. త్రిపుర భర్తతో జాబ్‌లో చేరినందుకు ఆనంద్, చేర్పించినందుకు శ్రీరంగం ఇద్దరూ ప్రమాదంలో పడబోతున్నారని తెలీదు పాపం అని త్రిపుర అనుకుంటుంది.
మిథున ఆదిత్యను కలుస్తుంది. నువ్వు మంచోడివి అనుకున్నా ఆదిత్య ఇలాంటివాడివి అనుకోలేదు అంటుంది. ఆదిత్య మనసులో నా నిజస్వరూపం తెలిసిపోయిందా అని అనుకుంటాడు. మిథున ఆదిత్యతో నీ మనసులో ఉన్నది వేరు నువ్వు బయటకు చూపిస్తుంది వేరు.. నీ గురించి పూర్తిగా తెలిసిపోయింది. నువ్వు ఏంటో నువ్వు ఎలాంటివాడివో తెలిసిపోయింది. నా మీద నీకు ఉన్న ప్రేమ ఇంకా పోలేదు.. నన్ను ఇంకా దక్కించుకోవాలి అనుకుంటున్నావ్ అని అంటుంది. ఏంటి మిథన ఇంత దారుణంగా మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. నన్నుదేవాని విడదీయాలని నువ్వు కుట్రలు చేస్తున్నావ్.. కాకపోతే దేవా నాకు మెట్టెలు తొడగడు అని నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. ఇదా విషయం అని ఆదిత్య అనుకుంటాడు. నువ్వు దేవాని బ్లాక్ మెయిల్ చేశావా అని అడుగుతుంది. నేను దేవాని బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి మిథున అని అంటాడు. నిజం చెప్పు లేదంటే నీ మీద ఫోకస్ పెడతా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















