Chinni Serial Today October 1st: చిన్ని సీరియల్: గుడిలో పెళ్లి చేసుకుందామని లోహితతో చెప్పిన వరుణ్! కొడుకు మాటలు విన్న వసంత!
Chinni Serial Today Episode October 1st వరుణ్‌ని నిశ్చితార్థం చేసుకోని అని లోహితకు చెప్పడం వసంత వినేయంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode ఆఫ్ టికెట్ మధుని గ్యారేజ్ లోపలకి తీసుకెళ్లి ఎందుకు వచ్చావ్ అమ్మా ఎందుకు నువ్వు ఇలా వస్తే నువ్వే చిన్ని అని అందరికీ తెలిసిపోతుంది అని అంటాడు. నిన్ను చూడాలని వచ్చాను అని చిన్ని అంటుంది. నాన్న గురించి ఏమైనా తెలిసిందా అని అడిగితే మూడు నెలల క్రితం వరకు ఇదే గ్యారేజ్‌లో అన్న పని చేశాడని చెప్తాడు. ఫోన్‌లో సీసీ టీవీ ఫుటేజ్ కూడా చూపిస్తాడు.
బాలరాజు స్వప్న బండి రిపేర్ చేయడం చూసి చిన్ని చాలా ఏడుస్తుంది. గ్యారేజ్ ఓనర్ చిన్నితో బాధ పడకు అమ్మ మీ నాన్న ఉన్నన్ని రోజులు నీ కోసం చాలా బాధ పడేవాడు అని చెప్తాడు. దానికి ఆఫ్ టికెట్ బాలరాజు ఎవరో కిడ్నాప్ చేశారని అందుకే పేపర్‌లో ఆ యాడ్ ఇచ్చారని నిన్న బయటకు తీసుకు రావాలి అనే ఇదంతా చేశారు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటాడు. ఇదంతా ఎవరు చేస్తున్నారు. మధు ఏడుస్తూ వెళ్లిపోతుంది.
వరుణ్‌కి లోహిత కాల్ చేస్తుంది. పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో చెప్పావా లేదా అని అడుగుతుంది. లేదు అని వరుణ్ అంటే ఒకసారి బయటకిరా మీ ఇంటి దగ్గర ఉన్నా అని పిలుస్తుంది. వరుణ్ షాక్ అయిపోతాడు. వరుణ్‌ని లోహిత కోసం వెళ్లడం వసంత చూస్తుంది. వరుణ్, లోహిత కలిసి మాట్లాడుకోవడం చూస్తుంది. ఇద్దరూ హగ్ చేసుకుంటారు. ఈ అమ్మాయి వరలక్ష్మీ వ్రతానికి వచ్చింది కదా అని వసంత గుర్తు చేసుకుంటుంది. నిశ్చితార్థం ఆపేస్తా అని వరుణ్ చెప్తాడు. వసంత షాక్ అవుతుంది. నిశ్చితార్థం ఆపలేకపోతే నేను చనిపోతా రేపు గుడిలో నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తాడు. ఆ మాటలు విని వసంత షాక్ అయిపోతుంది. వరుణ్‌ని అడగాలి అని వెళ్లేలోపు నాగవల్లి వచ్చి వసంతని ఏం చేస్తున్నావ్ పడుకోకుండా అని అడుగుతుంది.
మ్యాడీ, మధు, స్వప్న వాళ్లు అంతా వీడియో కాల్ మాట్లాడుకుంటారు. కాలేజ్‌కి వెళ్లి వస్తామని మధు చెప్తుంది. లోహిత వీడియో కాల్‌లోకి రాలేదని మ్యాడీ అడుగుతాడు. ఇంతలో మరో ఫ్రెండ్ పిలవడంతో లోహిత వీడియో కాల్‌లోకి వస్తుంది. ఎందుకు అలా ఉన్నావ్ అని మ్యాడీ అడుగుతాడు. నిశ్చితార్థానికి రమ్మని పిలుస్తాడు. వరుణ్ దగ్గరకు వసంత వెళ్తుంది. మోసం చేస్తున్నావ్ ఎందుకురా అని అడుగుతుంది. నేనేం మోసం చేయలేదు అని వరుణ్ అంటే లాగి పెట్టి కొట్టి లోహిత విషయం చెప్తుంది. నిశ్చితార్థం ఆపాలని ప్రయత్నిస్తే నేను చచ్చిపోతా అని వసంత అంటుంది. విషం తాగడానికి ప్రయత్నిస్తుంది. వరుణ్ ఆపి నేను వెళ్లను లోహితను పెళ్లి చేసుకోను నిశ్చితార్థం చేసుకుంటా అని చెప్తాడు. వసంత వరుణ్ ఫోన్ తీసుకొని వెళ్లిపోతుంది. నిశ్చితార్థం ఆపాలి అని చూస్తే నీకు నీ అమ్మ చెల్లి మిగలరు అని చెప్తుంది.
నిశ్చితార్థం హడావుడి మొదలవుతుంది. వరుణ్ దగ్గరకు నాగవల్లి వస్తుంది. ప్రమీల కూడా వచ్చి శ్రేయ, వరుణ్ మీరు చాలా లక్కీ అమ్మ కంటే ఎక్కువ ప్రేమగా చూసుకున్న అత్త ఉందని అంటుంది. వీళ్లు నాకు కన్నబిడ్డలతో సమానం కడుపులో మోయకపోయినా కడుపులో పెట్టుకొని పెంచానని అంటుంది. మధు వాళ్లు కాలేజ్‌కి వెళ్తారు. క్లాస్‌కి వెళ్దాం అని మధు అంటే స్వప్న వాళ్లు నిశ్చితార్థానికి వెళ్దాం అంటుంది. మేం రాకూడదు అని ఫిక్స్ అయిపోయాం అని మిగతా ఫ్రెండ్స్ అంటారు. ఇంతలో స్వప్నకి మ్యాడీ కాల్ చేస్తాడు. వచ్చేస్తున్నారా అంటే మేడం క్లాస్‌కి వెళ్దాం అంటుందని అంటుంది. మ్యాడీ మధుతో లేడీ హిట్లర్ త్వరగా రండి అని అంటాడు. లోహిత మాత్రం చాలా టెన్షన్ పడుతుంది. మధు లాస్యని పంపి లోహితను తీసుకురమ్మని చెప్తుంది. లోహిత రాను అని చెప్తుంది. అందరం కలిసే వెళ్దాం అని మధు మిగతా వారిని క్లాస్‌కి తీసుకెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















