అన్వేషించండి

Ammayi garu Serial Today September 30th: అమ్మాయిగారు సీరియల్: సూర్యప్రతాప్ మనసు మార్చిన విరూపాక్షి! కోమలి పగ, రూప-రాజుల భవిష్యత్ ఏంటి?

Ammayi garu Serial Today Episode September 30th విరూపాక్షి, సూర్యప్రతాప్‌ల ఏకాంతం చూసి ఇంటిళ్ల పాది సంతోషపడటంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Ammayi garu Serial Today Episode విరూపాక్షి, సూర్యప్రతాప్‌లను వదిలేసి అందరూ గుడికి వెళ్లిపోతారు. విరూపాక్షితో రూప నాన్నతో ఏదో ఒకటి మాట్లాడు అని చెప్తుంది. విరూపాక్షి సూర్యప్రతాప్‌తో కాఫీ తీసుకొస్తా అని అంటుంది. సూర్యప్రతాప్‌ ఏం అంటాడా అని మొత్తం ఫోన్‌లో  చూస్తున్న రాజు, రూప, చంద్ర, సుమ, మందారం చూస్తుంటారు. 

సూర్యప్రతాప్‌ కాఫీ వద్దని అంటాడు. ప్రతీ రోజు ఈ టైంకి తాగుతావ్ కదా నేను తీసుకొస్తా అని విరూపాక్షి వెళ్తుంది. రూప చూస్తూ అమ్మ కాఫీ ఇస్తే ఏం జరుగుతుందో అని రాజుతో చెప్తుంది. ఏం కాదులే అని రాజుతో పాటు అందరూ అంటారు. విజయాంబిక, దీపక్, కోమలిలు ఏదో జరుగుతుంది అని అనుకుంటారు. కోమలి అశోక్ గురించి మొక్కుతా అని వెళ్లిపోతుంది. విరూపాక్షి వెళ్లి కాఫీ ఇస్తుంది. సూర్యప్రతాప్‌ ఏం చేస్తాడా అని అందరూ టెన్షన్‌గా చూస్తారు. అందరి అంచనాలు తారుమారు చేస్తూ సూర్యప్రతాప్‌ విరూపాక్షి ఇచ్చిన కాఫీ తీసుకుంటాడు. రూప వాళ్లు చాలా సంతోషపడతారు. సూర్యప్రతాప్ తాగడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీలవుతారు. విరూపాక్షి ఆనందానికి అయితే అవథులే ఉండవు..వెనక్కి తిరిగి పొంగిపోతుంది. సూర్యప్రతాప్‌ విరూపాక్షిని చూస్తాడు. కాఫీ బాగుందా సూర్య అని విరూపాక్షి అడిగితే ఊ అని సూర్యప్రతాప్‌ అంటాడు. 

టిఫెన్ ఏం చేయమంటావ్ సూర్య అని విరూపాక్షి అడుగుతుంది. వద్దు అని సూర్యప్రతాప్‌ అంటే నేను చేస్తే తినవా.. నన్ను నీ భార్యగా అనుకోవద్దు ఓ పనిమనిషిగా అనుకో అని అంటే ఈ మాటలే వద్దు అని సూర్యప్రతాప్‌ అనడంతో అయితే టిఫెన్ చేస్తా అని విరూపాక్షి గదికి వెళ్లి వేడి వేడి దోసెలు చేస్తుంది. రూప వాళ్లు నవ్వుకుంటూ ప్లాన్ సూపర్ అనుకుంటారు. విజయాంబిక, దీపక్‌లు  చూసి రేయ్ దీపక్ వీళ్లు ఏదో చేస్తున్నారురా అని అని అనుకుంటారు. ఇక్కడేం చేస్తున్నారు అని అడిగితే సినిమా చూస్తున్నాం అని రూప అంటుంది. మేం చూస్తాం అంటుంది. సినిమా అయిపోయింది దర్శనానికి వెళ్దాం పదండి అని చంద్ర అంటాడు. వీళ్ల మాటలకు చెప్పే దానికి ఏం సంబంధం లేదురా ఎందుకో చాలా హ్యాపీగా ఉన్నారు. వీళ్లని హ్యాపీగా ఉండనివ్వకూడదు అని అంటుంది. 

చంద్ర పూజ చేద్దాం అని అందర్ని గుడిలోకి తీసుకెళ్తాడు. తల్లీదండ్రులది, చిన్నాన్న పిన్నిది పేర్లు చెప్తుంది. రాజు రూపల పేర్లు చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. రాజు బావ భార్య పేరు రూప కదా. అందుకే చెప్పా.. ఎప్పటికైనా రూపనే రాజు బావ భార్య అని అంటుంది. సుమ కోమలితో నీ పేరు మీద మీ అక్క పూజ చేయిస్తుంది నువ్వు మొక్కుకో అని అంటుంది. విజయాంబిక రూప వాళ్లు సంతోషంగా ఉండకూడదు అని రాఘవ చనిపోవాలని తల్లీకొడుకులు కోరుకుంటారు. రాజు వాళ్లంతా సూర్యప్రతాప్‌, విరూపాక్షి కలవాలని కోరుకుంటారు. రూపని చూసిన కోమలి మీ ఇద్దరూ ఇంత సంతోషంగా ఉండటం నాకు ఇష్టం లేదు అని రూపని రాజు పక్కనుంచి నెట్టేస్తుంది. రూపని చూసి కన్నెగరేస్తుంది. రూప బాధపడటం చూసిన మందారం పంతులు శతకోపం పెట్టే టైంకి మందారం పిన్నుతో కోమలి కాలి మీద గుచ్చేస్తుంది. దాంతో కోమలి కింద ఒంగడంతో రూప, రాజులకు పంతులు దీవిస్తారు. కోమలి హర్ట్ అయి వెళ్లిపోతుంది. నా ఇంటికి వచ్చి నాకు వార్నింగ్ ఇస్తావా ఎక్కువ చేస్తే రూప 2.0 చూపిస్తా అంటుంది. దాంతో కోమలి నేను తలచుకుంటే రేపే నీకు రాజుని దూరం చేస్తా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today may 9th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ అంబిక కుట్రని అడ్డుకుంటుందా! విహారి చేసిన పనికి చారుకేశవ షాక్!
Nindu Manasulu Serial Today may 9th: నిండు మనసులు: ఫస్ట్‌నైట్‌ గదిలో మంచం ఫట్! ప్రేరణ కొంగు పట్టుకొని సిద్ధూ సిగ్గు పడుతున్నాడోచ్!
నిండు మనసులు: ఫస్ట్‌నైట్‌ గదిలో మంచం ఫట్! ప్రేరణ కొంగు పట్టుకొని సిద్ధూ సిగ్గు పడుతున్నాడోచ్!
chinni serial today may 9th: చిన్ని సీరియల్: అదిరిపోయిన చిన్ని క్లైమాక్స్! చివరి ఎపిసోడ్‌లో ఇన్ని ట్విస్ట్‌లా! పార్ట్ 2 ఉందా!
చిన్ని సీరియల్: అదిరిపోయిన చిన్ని క్లైమాక్స్! చివరి ఎపిసోడ్‌లో ఇన్ని ట్విస్ట్‌లా! పార్ట్ 2 ఉందా!
Illu Illalu Pillalu Serial Today may 9th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: నగలు పుట్టింటివాళ్ల మీద విసిరి కొట్టిన ప్రేమ! ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం రామరాజుకి తెలిసిపోతుందా!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: నగలు పుట్టింటివాళ్ల మీద విసిరి కొట్టిన ప్రేమ! ధీరజ్, ప్రేమల పెళ్లి రహస్యం రామరాజుకి తెలిసిపోతుందా!

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi Meets Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి వెళ్లిన ప్రధాని మోదీ.. గంటపాటు చర్చలు
IPL 2025 CSK VS LSG Result Update: సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
సీఎస్కే థ్రిల్లింగ్ విక్ట‌రీ.. ప‌ట్టిక‌లో ఐదో ప్లేస్ కు చేరిక‌.. ఉర్విల్ రికార్డు ఫిఫ్టీ.. రాణించిన రుతురాజ్, ఒవ‌ర్ట‌న్, ల‌క్నో ఔట్
Who is S Keerthana: విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
విజయ్ క్యాబినెట్‌లో లేడీ ప్రశాంత్ కిశోర్ - తెలుగు మాట్లాడే తమిళ మంత్రి రికార్డులు, ప్రత్యేకతలు ఇవే
Tamil Nadu Cabinet Ministers: తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
తమిళనాడు కేబినెట్ మంత్రుల ప్రత్యేకతలివే.. విజయ్ టీవీకే పార్టీ వారికే ఛాన్స్
JEE Advanced 2026 Admit card: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, పూర్తి ప్రక్రియ
Tamil Nadu CM Vijay: విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
విజయ్ సీఎం అయ్యాక రిలీజవుతున్న ఫస్ట్ తమిళ్ సినిమా... జన నాయగన్ కాదు - అయినా దళపతికి స్పెషల్
CM Vijay: సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే 3 ఫైళ్లపై విజయ్ సంతకాలు.. అధికారులకు కీలక ఆదేశాలు
Josh Inglis Smashes Fastest Fifty: చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
చెపాక్ మైదానంలో జోష్ ఇంగ్లిస్ విధ్వంసం.. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన లక్నో హిట్టర్! సరికొత్త ఐపీఎల్ రికార్డు
Embed widget