Chinni Serial Today May 29th: చిన్ని సీరియల్: నాగవల్లి చెంప పగలగొట్టిన కావేరి.. రాజు, కావేరికి మళ్లీ పెళ్లి చేస్తానన్న చిన్ని!
Chinni Today Episode చిన్ని తల్లిదండ్రులకు మళ్లీ పెళ్లి చేసి వాళ్లతో కలిసి ఉండాలని ఉందని నానమ్మకి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్ని కావేరిని పట్టుకొని ఏడుస్తూ చూడమ్మా ఆ ఆంటీ మనది క్రిమినల్ ఫ్యామిలీ అని అంటున్నారు అని ఏడుస్తుంది. కావేరి డబ్బులు కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే చిన్ని దేవా వాళ్లని అడుగుదాం అని అంటుంది. కావేరి వద్దని నేను అరేంజ్ చేస్తా అని కోప్పడుతుంది. చిన్ని, ఆఫ్ టికెట్‌తో మనం మన ప్రయత్నం చేద్దాం ఈ ఏరియాలో మా ఫ్రెండ్స్ ఫ్యామిలీలు ఉన్నాయి కదా అడుగుదాం అంటుంది.
చిన్ని, కావేరి చెరోవైపు డబ్బు కోసం చాలా మందిని బతిమాలుతూ ఉంటారు. నాగవల్లి కావేరి వాళ్లు డబ్బు ఏర్పాటు చేయలేరని అనుకుంటుంది. కావేరి దగ్గరకు వెళ్లి నీ భర్తని విడిపించుకోవడానికి షాపుల దగ్గర ముష్టి ఎత్తుకుంటున్నావా. ఇలా అందమైన నువ్వు ముష్టి ఎత్తుకోవడం కంటే నీ అందాన్ని పెట్టుబడిగా పెడితే అని అంటుంది. దాంతో కావేరి నాగవల్లి చెంప పగలగొడుతుంది. నీకు నిలువెల్లా పొగరే అందుకే సాటి ఆడదానితో ఇలా నీచమైన మాటలు మాట్లాడుతున్నావ్. డబ్బు కోసం నువ్వు అలాంటి పనులు చేస్తావ్ కానీ నేను చచ్చినా చేయను. ఇంకోసారి ఇలాంటి కూతలు కూస్తే చంపేస్తా అని కావేరి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
నాగవల్లి రగిలిపోతుంది. నా చెంప పగలగొట్టి నాకే వార్నింగ్ ఇస్తావా నిన్ను వదలనే అనుకుంటుంది. మరోవైపు చిన్ని ఆఫ్ టికెట్ డబ్బు ముట్టక గుడి మెట్ల దగ్గర కూర్చొని ఉంటారు. ఇంతలో స్కూల్ ప్రిన్సిపల్ మేడం చిన్నిని చూసి ఏమైందని అడుగుతుంది. ఆఫ్ టికెట్ జరిగింది అంతా మేడంకి చెప్తాడు. ఆమె డబ్బు ఇస్తానని న్యాయమే గెలుస్తుందని అంటుంది. చిన్ని టీచర్‌తో మీ దగ్గర ఊరికే డబ్బు ఎవరి దగ్గర తీసుకోలేను మేడం మా అమ్మ అది మంచిది కాదని మా అమ్మ చెప్పింది అని అంటుంది. నీ డబ్బులే నీకు నేను ఇస్తానమ్మా నీ భవిష్యత్‌కి అవసరం అవుతాయని మీ నాన్న ప్రతీ నెల నా దగ్గర డబ్బు దాస్తున్నారు అని చెప్తారు. అలా దాచిన డబ్బు 60 వేల వరకు ఉన్నాయి వాటిలో నీకు కావాల్సినంత తీసుకో అని చెప్తారు. చిన్ని చాలా హ్యాపీగా ఫీలవుతుంది.
బాలరాజుకి బెయిల్ వస్తుంది. లాయర్ బాలరాజుని ఇంటికి తీసుకొస్తారు. నువ్వు కావేరికి ఎంత ఇబ్బంది పెట్టినా ఈ రోజు కావేరి నీ వైపు నిల్చొంది నువ్వు చాలా అదృష్టవంతుడివి బాలరాజు. నీ కోసం తన బంగారం అమ్మేసింది తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసింది అని చెప్తారు. బాలరాజు కావేరికి థ్యాంక్స్ చెప్తాడు. మా అన్నయ్య విషయంలో నువ్వు తప్పు చేయలేదు అని నమ్మాను కాబట్టి నా ప్రయత్నం నేను చేశాను అని చెప్తుంది. చిన్ని కూడా చాలా కష్టపడింది అని ఆఫ్ టికెట్ చెప్పడంతో నా కోసం ఇంత కష్టపడ్డావా తల్లి అని బాలరాజు భార్యకూతురికి దండం పెడతాడు. మీ పెద్ద మనషుకి దండం పెట్టాలి అంటాడు.
నాగవల్లి సరళకి కాల్ చేసి బాలరాజుకి ఉషా టీచర్ బెయిల్ ఇప్పించిందని చెప్తుంది. ఉషని వెంటనే ఇంటి నుంచి గెంటేయమని చెప్తుంది. సరళ సరే అని చందుని పిలిచి పైకి వెళ్లి తలుపులు బద్దలకొట్టి ఉష టీచర్ సామాను పడేయ్ అంటుంది. ఇంతలో కావేరి ఇంటికి వస్తే ఆపుతుంది. నీ సామాను బయట పడేస్తా వెళ్లిపో అని చెప్తుంది. లోహిత కూడా చందుతో ఆమె సామాను తెచ్చి పడేయ్ మంటుంది. బాలరాజు ఏ తప్పు చేయలేదు అని నేరం చేసిన వాళ్లని పట్టుకోవడానికే బాలరాజుని తీసుకొచ్చానని మనకు సత్యంబాబుని దూరం చేసిన వాళ్లని వదలను అని కావేరి అంటుంది. మీరు నన్ను బయటకు గెంటేయాలి అని చూసినా సరే నేను ఇక్కడే ఉంటాను మీకు తోడుగా ఉంటాను అని చెప్పి లోపలికి వెళ్తుంది.
చిన్ని నానమ్మతో అమ్మ ఎప్పుడూ బాధల్లోనే ఉంది. అమ్మకి నాన్న మీద కోపం పోలేదు కానీ నాన్నతో వెళ్లిపోవడానికి రెడీ అయింది. నాన్న అమ్మని జైలు నుంచి తీసుకొచ్చారు ఇప్పుడు అమ్మ నాన్నని విడిపించింది. మేం ముగ్గురం కలిసి ఎప్పుడూ లేం. కొన్ని రోజులు నాన్న దగ్గర కొన్ని రోజులు అమ్మ దగ్గర ఉన్నాను అంతే కానీ ముగ్గురం కలిసి ఎప్పుడూ లేం అసలు కలిసి ఉంటామా నానమ్మా అని ఏడుస్తుంది. అమ్మానాన్నకి పెళ్లి చేద్దాం అప్పుడే అమ్మకి గౌరవం కలుగుతుందని అంటుంది. ఇద్దరూ ఒప్పుకోరని భారతి అంటే చెప్పకుండా గుడికి తీసుకెళ్లి పెళ్లి చేసేద్దాం అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: ఫీల్ ది లవ్ బేబీ.. నన్ను ఎందుకు కాపాడావ్? దేవాకి మిథున లవ్ ప్రశ్నలు!



















