Chinni Serial Today June 28th: చిన్ని సీరియల్: చిన్ని, చందు, మహిల జీవితాల్లో ఊహించని మలుపు.. మధుమితగా చిన్ని.. మెకానిక్‌గా చందు!
Chinni Today Episode చిన్ని పేరు మార్చి కొత్త జీవితం ప్రారంభించమని తల్లిదండ్రులు చెప్పడం.. మహి వేరే దేశానికి బయల్దేరడం, చందు మెకానిక్‌గా మారిపోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode చిన్నికి తల్లిదండ్రులుగా మారిన భార్యాభర్తలు జైలుకి వెళ్లి విషయం చెప్పాలా లేదా అని ఆలోచిస్తారు. ఇద్దరూ జైలుకి వెళ్లి కలిసినట్లు బాలరాజు అక్కడ లేనట్లు చెప్పేద్దాం అనుకుంటారు. చిన్ని అతని దగ్గరకు పరుగున వెళ్లి మా నాన్నకి కలిశారా అంటే వెళ్లాను కానీ అక్కడ మీ నాన్న లేరు వేరే జైలుకి పంపారు. ఎక్కడికి పంపారో నాకు చెప్పడం లేదని హత్య కేసులో ఉన్న వారిని జైళ్లు మార్చుతూ ఉంటారని అబద్ధం చెప్తారు. ఆయన భార్య మనసులో అబద్ధం చెప్పడం చేతకాని అతనితో ఎన్ని అబద్ధాలు చెప్పిస్తున్నానో అని బాధ పడుతుంది.
చిన్ని చాలా ఏడుస్తుంది. ఎందుకు మాకే ఇలా జరుగుతుంది. అమ్మానాన్న నేను కలిసి సంతోషంగా ఉండాలి అనుకొని కలలు కన్నా ఆ కల కలగానే మిగిలి పోయాం అని ఏడుస్తుంది. చిన్నిని వాళ్లు హక్కున చేర్చుకొని మీ అమ్మానాన్నల్ని నీకు తీసుకురాలేం కానీ వాళ్లు లేని లోటు నీకు తెలీకుండా మేం పెంచుకుంటా అని అంటారు. ఇద్దరూ చిన్నికి నచ్చచెప్తారు. అమ్మా నాన్నల కలల్ని ఆశయంగా మార్చుకొని కొత్త జీవితం మొదలు పెట్టమ్మా అని అంటారు. చిన్ని ఆవిడను హగ్ చేసుకొని ఏడుస్తుంది.
చందు తన ఇంటికి వెళ్లి గేటు బయట నుంచే చూసి బాధగా వెళ్లిపోతాడు. తర్వాత మహి వచ్చి తాళం చూసి చాలా బాధ పడతారు. మహి అటుగా వచ్చిన వ్యక్తిని చిన్ని వాళ్లు గురించి అడిగితే చిన్ని వాళ్ల గురించి తెలీదు కానీ సరళమ్మ పిల్లల్ని తీసుకొని వెళ్లిపోయిందని చెప్తారు. మహి చాలా బాధ పడతాడు. నాగవల్లి మహిని చూసి స్కూల్‌కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగితే చిన్ని కోసం వచ్చానని అంటే నాగవల్లి కోప్పడుతుంది. మహికి నచ్చచెప్తుంది. మహి బాధ మర్చిపోతానని కానీ చిన్ని కోసం తెలుసుకుంటానని అంటాడు. చిన్ని బాధ పడుతూ ఉంటుంటే చిన్ని కోసం వాళ్ల కొత్త తల్లిదండ్రులు వస్తే తల్లిని హగ్ చేసుకొని అమ్మ అని ఏడుస్తుంది.
చిన్నితో ఆ అమ్మా నాన్నల గురించి మర్చిపోయి వాళ్ల కలల్ని నిజం చేయడంతో పాటు ఈ అమ్మానాన్నల్ని చూసుకోవాల్సింది కూడా నువ్వే అని అంటారు. చిన్ని అమ్మా అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. ఇక ఉదయం చిన్ని కోసం కొత్త డ్రస్ తీసుకొచ్చి స్కూల్‌లో అడ్మిషన్ తీసుకున్నానని పుస్తకాలు తీసుకొచ్చి ఇస్తారు. కొత్త డ్రస్‌లో చిన్ని ముద్దుగా ఉంటుంది. తల్లిదండ్రులు ఇద్దరూ చిన్నిని ముద్దాడుతారు. తండ్రి పట్టీలు తీసుకొచ్చి చిన్నికి పెట్టి మురిసిపోతాడు. చిన్ని కంట నీరు పెట్టుకుంటుంది. ఎందుకు ఏడుస్తున్నావ్ తల్లీ అని అంటే నువ్వు ఇలా పట్టీలు పెడుతుంటే నాకు మామయ్య గుర్తొచ్చాడు. మామయ్య నాకు అమ్మానాన్నల్లా ప్రేమగా చూసుకునే వాడు. ఇప్పుడు మళ్లీ మీరు నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు అంటుంది.
ఇద్దరూ ఎమోషనల్ అయి నువ్వు మా ఇంటి దుర్గమ్మవి నువ్వు ఏ జన్మలోనో మా బిడ్డవి అయి ఉంటావు అని గుడిలో చూసిన మాకు నువ్వు ఈ జన్మలోనే మా బిడ్డవి అని దుర్గమ్మ చూపించింది. ఇన్నాళ్లు చిన్నిగా నీ జీవితం వేరు ఇప్పుడు మా కూతురిగా నీ జీవితం వేరు కొత్త జీవితంతో పాటు కొత్త పేరు కూడా పెడటాం అని అంటారు. ఇక మహిని వేరే దేశం పంపించడానికి ఏర్పాట్లు చేస్తారు. మహి వెళ్లడానికి ఇష్టం చూపించడు. నాగవల్లి చిన్ని ఎక్కడుందో వెతికించి నీకు చెప్తా నువ్వు అప్పటి వరకు చిన్ని గురించి ఆలోచించకుండా పై చదువులు చదువుకో అని చెప్తుంది. దేవా కూడా నచ్చచెప్తాడు. మహి ఒకే చెప్తాడు. వెళ్తూ వెళ్తూ చిన్ని గుర్తుగా పెళ్లి కూతురి బొమ్మ తీసుకెళ్తాడు.
మరోవైపు లోహిత స్కూల్‌కి వెళ్తుంది. చెల్లిని చదివించడానికి చందు ఓ మెకానిక్ షాప్‌లో పని చేస్తాడు. చిన్ని వల్లే మన పరిస్థితి ఇలా అయిపోయింది అని లోహిత అన్నతో అంటుంది. చిన్నిని ఏం అనొద్దు నువ్వు చక్కగా చదువుకో అని లోహితకు పుస్తకాలు ఇస్తాడు. లోహిత మెకానిక్ షాప్ నుంచి వెళ్లగానే మహి వాళ్లు అక్కడికి వస్తారు. మహి వాళ్ల కారుకి గాలి చెక్ చేయమని డ్రైవర్ చందుకి చెప్తాడు. మరోవైపు చిన్నికి పేరు మార్చే కార్యక్రమం జరుగుతుంది. కొత్త తల్లిదండ్రుల మధ్య కూర్చొపెట్టి ఆ కార్యక్రమం జరుగుతుంది. చిన్ని పేరుని మధుమితగా మార్చుతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: విహారి గ్రూప్ కంపెనీకి ఎదురుదెబ్బ! ఘోర అవమానం.. లక్ష్మీ రాజీనామా!





















