Chinni Serial Today June 21st: చిన్ని సీరియల్: బాలరాజు ఎన్‌కౌంటర్.. అడవిలో హైటెనెన్షన్.. కావేరి, చిన్ని ఏం చేయనున్నారు!
Chinni Today Episode బాలరాజు పోలీసుల్ని కొట్టి తప్పించుకోవడం కావేరి, చిన్నిలను కలవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode బాలరాజుని పోలీసులు ఎన్‌కౌంటర్ చేయాలని అడవికి తీసుకెళ్తారు. కావేరి, చిన్ని టెన్షన్‌గా వెళ్తారు. బాలరాజు అనుమానం వచ్చి అడగటంలో ఫారెస్ట్ నుంచి సెంట్రల్ జైలుకి తీసుకెళ్తామని అంటారు. బాలరాజు చేతులు కట్టేసి ముఖానికి ముసుగు వేస్తారు. ముసుగు ఎందుకు సార్ అని బాలరాజు అడిగితే నువ్వు తప్పించుకోకుండా ఉండటానికి అంటారు.
బాలరాజు ముసుగు వద్దు అని అంటే బలవంతంగా కొట్టి ముసుగు వేస్తారు. బాలరాజుని బలవంతంగా తీసుకెళ్లడం అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి చూస్తారు. కావేరి, చిన్ని అటుగా ఉన్న అందర్ని పోలీస్ బండి గురించి అడుగుతూ వస్తుంటారు. బాలరాజుని చూసిన తాతని కావేరి పోలీస్ బండి కోసం అడగటంతో ఇక్కడే ఆగింది అని ప్లేస్ చూపించి ఓ వ్యక్తిని ముసుగు వేసుకొని తీసుకెళ్తున్నారని చెప్తారు. దాంతో కావేరి, చిన్ని కంగారు పడతారు. చిన్ని టెన్షన్ అయిపోతుంది. కావేరి నీరు తాగడానికి ఇస్తుంది. ఇద్దరూ పోలీస్ జీపు దగ్గరకు వెళ్తారు. బాలరాజు కోసం మొత్తం వెతుకుతారు.
చిన్ని అడవిలో అమ్మవారిని చూసి తన తండ్రిని కాపాడమని కోరుకుంటుంది. కావేరి కూడా బాలరాజుకి ఏం కాకూడదు అని మొక్కుకుంటుంది. చిన్ని నాన్న అని పిలవడం బాలరాజుకి వింటాడు. పోలీసులు కూడా విని కంగారు పడతారు. ఎవరో వచ్చినట్లు ఉన్నారు వాళ్లు వచ్చేలోపు మన పని పూర్తి చేసుకొని వెళ్లిపోవాలని బాలరాజుని స్పీడ్‌గా తీసుకెళ్తారు. ఓ చోట పోలీసులు బాలరాజుని కొట్టి కాల్చబోతే నన్ను చంపడం మీ వల్ల కాదురా అని దేవా వాళ్లతో గొడవ పడి తోసేసి ముసుగుతోనే పరుగులు పెడతాడు. ఓ చోట ఆగి చెట్టు కొమ్మతో తన ముఖానికి ఉన్న ముసుగు తీసేస్తాడు.
బాలరాజు పరుగు పెడుతుంటే పోలీస్ అధికారి కాల్చుతాడు. ఆ సౌండ్ విన్ని చిన్ని, కావేరి కంగారు పడతారు. మళ్లీ మళ్లీ సౌండ్ రావడంతో చిన్ని ఏడుస్తుంది. నాన్నని ఏదో చేస్తున్నారు అని పరుగులు పెడుతుంది. చిన్ని వెనక కావేరి పరుగులు పెడుతుంది. సీఐ తన వాళ్లతో మిస్ అయిపోయాడు అని చెప్తాడు. వెంటనే సీఐ దేవాతో బాలరాజు మిస్ అయ్యాడని ఎవరో నాన్న అని పిలవడంతో ఎక్కడలేని బలంతో అందర్ని కొట్టి వెళ్లిపోయాడని చెప్తాడు. బాలరాజుని చంపాను అన్న గుడ్ న్యూస్ చెప్పకపోతే మీ ఫ్యామిలీ మీ గురించి బ్యాడ్ న్యూస్ వింటారు అని దేవా వార్నింగ్ ఇస్తాడు. చిన్ని కావేరికి అనుమానం వచ్చి వెళ్లుంటారని అనుకొని దేవా తన మనుషులకు ఫోన్ చేసి అడవికి వెళ్లి ముగ్గురిని చంపేయమని చెప్తాడు.
బాలరాజు చేతికి కట్లు ఉండటంతో రాయికి తాకించి కట్లు విప్పుకుంటాడు. చిన్ని కావేరిని కాపాడుకోవాలి అనుకుంటాడు. చిన్ని అరుపులు విని వెతుకుతాడు. కావేరి చిన్ని కోసం వెళ్లి కంగారుగా ఓ లోయలో పడిపోబోయి రాయిని పట్టుకుంటుంది. చిన్ని చూసి తల్లి చేయి పట్టుకుంటుంది. బాలరాజు చూసి కావేరిని కాపాడుతాడు. బాలరాజుని కావేరిని పట్టుకొని నువ్వు రావడం లేటు అయింటే అంతే అని హగ్ చేసుకొని ఏడుస్తుంది. బాలరాజు చేతికి తగిలిన బులెట్ దెబ్బకి కట్టు కడుతుంది. పోలీసులు వెతుకుతుండటం చూసి కావేరి వాళ్లని ఓ వైపు పంపేసి తాను మరోవైపు వెళ్లి దాక్కుంటాడు.
పోలీసులు కావేరి వాళ్లని చూసి ఆపుతారు. మీరు ఎందుకు వచ్చారు అని అడిగితే మీరు ఎందుకు వచ్చారు అని కావేరి అడుగుతుంది. పోలీసులతో పొగరుగా మాట్లాడుతావా తర్వాత నీ సంగతి చూస్తా అని సీఐ అంటాడు. తర్వాత ముగ్గురు తప్పించుకుంటారు. మహి నాగవల్లితో అమ్మా ఈ రోజు కూడా చిన్ని, చందు వాళ్లు స్కూల్‌కి రాలేదు ఒకసారి వాళ్ల ఇంటికి వెళ్దామని అడుగుతాడు. నాగవల్లి సరే అంటుంది. సరళ ఇంటికి వెళ్తే అక్కడ ఎవరూ లేకపోవడం చూసి ఎక్కడికో వెళ్లి ఉంటారని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీకి జైలులో చిత్రహింసలు.. సూపర్ ఉమెన్‌తో అంబిక 60 లక్షల డీల్!





















